Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రష్యాకు పొంచి ఉన్న ఉగ్రవాద ముప్పు: అమెరికా

US warns Americans of potential terrorism at World Cup

హైదరాబాద్: ఉగ్రవాదులు ఎక్కువగా జన సమూహంపైనే టార్గెట్ చేస్తారని దీంతో.. ప్రపంచ కప్ నేపథ్యంలో ప్రపంచం నలుమూలల నుంచి ఫుట్‌బాల్ మ్యాచ్ చూసేందుకు విచ్చేసిన అభిమానుల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని అమెరికా రష్యాని సూచించింది. ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌కు రష్యా ఆతిథ్యమిస్తున్న నేపథ్యంలో 'ఉగ్ర' ముప్పు పొంచి ఉండవచ్చని ఆ దేశాన్ని అమెరికా హెచ్చరించింది. ఫిఫా మ్యాచ్‌లు చూడటానికి వెళ్లే అమెరికన్లు దీనిపై ఒకసారి ఆలోచించాలని అగ్రరాజ్యం సూచించినట్లు అక్కడి మీడియా తెలిపింది.

ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక

అమెరికా మీడియా తెలిపిన వివరాల ప్రకారం...' ప్రజలు ఎక్కువగా ఎక్కడైతే గుమిగూడి ఉంటారో అలాంటి ప్రదేశాలపై ఉగ్రవాదుల కన్ను ఎక్కువగా ఉంటుంది. ఫిఫా నిర్వహణకోసం కావల్సిన దాని కంటే ఎక్కువగానే భద్రతా సిబ్బందిని రష్యా ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉంటుందని మేము భావిస్తున్నాం. పెద్ద పెద్ద స్టేడియాలు, అభిమానులు ఎక్కువగా సందడి చేసే ప్రాంతాలే ఉగ్రవాదులు లక్ష్యంగా పెట్టుకుంటారు. ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే వాళ్లు దాడులు చేస్తారు.

ఎక్కువగా పర్యాటక ప్రాంతాలను, రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్లు, మార్కెట్లు, షాపింగ్‌ మాల్స్‌, ఇతర ప్రజావేదికలు, రద్దీ ప్రాంతాలను ఉగ్రవాదులు లక్ష్యంగా ఎంచుకుంటారు. కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఆతిథ్య దేశం పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేయాలి.' అని తెలిపింది. ప్రపంచకప్‌ జరిగినన్ని రోజులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని కోరింది. ముఖ్యంగా సెమీ ఫైనల్స్‌, ఫైనల్స్‌, ముగింపు ఉత్సవం నాడు పెద్ద మొత్తంలో అభిమానులొస్తారని వారి భద్రతకు రష్యా మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరింది.

అయితే ఇప్పటికే భారీ సంఖ్యలో భద్రతా ఏర్పాట్లు నిర్వహించిన రష్యా.. హెచ్చరికలు జారీ చేసేందుకు తీసుకున్న చర్యలను వేరే దేశాలతో పోల్చి చూస్తే.. నాలుగు పాయింట్లకు గాను మూడు పాయింట్లు సాధించింది. ఇలా క్యూబా, పాకిస్థాన్, టర్కీ, హోండురాస్, నికారాగూవాలకు కూడా హెచ్చరికలు జారీ చేసింది.

Story first published: Sunday, June 17, 2018, 16:35 [IST]
Other articles published on Jun 17, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+