క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్ళిన ఉరుగ్వే
పోర్ట్ ఎలిజబెత్: చిన్నచూపు చూసిన వారందరికీ షాకిస్తూ ఉరుగ్వే ప్రపంచకప్ క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం హోరాహోరీగా సాగిన తొలి నాకౌట్ మ్యాచ్‌లో ఉరుగ్వే 2-1తో దక్షిణ కొరియాను ఓడించింది. సురెజ్ రెండు గోల్స్ (8వ నిమిషం, 80వ) సాధించి జట్టును గెలిపించాడు. దక్షిణ కొరియా తరఫున లీ చుంగ్ యంగ్ (68వ) గోల్ చేశాడు. 1970 తర్వాత ఉరుగ్వే క్వార్టర్‌ఫైనల్ చేరడమిదే తొలిసారి. అమెరికా, ఘనా మధ్య జరిగే ప్రిక్వార్టర్స్ మ్యాచ్ విజేతను ఉరుగ్వే క్వార్టర్స్‌లో ఎదుర్కొంటుంది.
దక్షిణ కొరియా పోరాడినా..రెండు జట్లూ ఆరంభం నుంచి ఎదురుదాడికి దిగాయి. బంతిపై నియంత్రణకు పోటీపడ్డాయి. తొలి గోల్ ఉరుగ్వేదే కానీ మ్యాచ్‌పై ఆధిపత్యం దక్షిణ కొరియాదే. ద్వితీయార్ధంలో కొరియా స్కోరు సమం చేసింది. కానీ విజయం ఉరుగ్వేదే. బంతిపై పూర్తిగా నియంత్రణ సాధించకపోయినా..వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంది ఉరుగ్వే. ఆరంభంలో దూకుడుగా ఆడిన దక్షిణ కొరియాకు ఐదో నిమిషంలోనే గోల్ చేసే అవకాశం వచ్చింది. కానీ ఆ జట్టు కొద్దిలో చేజార్చుకుంది. 25 గజాల దూరం నుంచి పార్క్ చు యంగ్ కొట్టిన ఫ్రీకిక్ గోల్ అయ్యేలా కనిపించింది. ఐతే బంతి పోల్‌కు తాకి దూరంగా వెళ్లింది. వెంటనే పుంజుకున్న ఉరుగ్వే ఎదురుదాడికి దిగింది. మూడు నిమిషాల వ్యవధిలో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+

Click it and Unblock the Notifications