

హైదరాబాద్: ఫిఫా ప్రపంచకప్‌లో ఉరుగ్వే జోరు కొనసాగిస్తోంది. ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌లో భాగంగా రుస్తోవ్ ఎరినా మైదానంలో బుధవారం గ్రూపు-ఏ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో 1-0 తేడాతో ఉరుగ్వే జట్టు సౌదీ అరేబియాపై విజయం సాధించింది. ఈ క్రమంలో రెండో రౌండ్ దిశగా అడుగులు వేసింది. మ్యాచ్ ఆరంభమే పోటాపోటీగా మొదలైంది.
ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక
ఈ క్రమంలో 23వ నిమిషంలో ఉరుగ్వే కీలక ఆటగాడు సురెజ్ తొలి గోల్ అందించాడు. ఆ తర్వాతి నుంచి బంతిపై నియంత్రణకోసం సౌదీ అరేబియా తీవ్రంగా పోరాడింది. పలుమార్లు గోల్ చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. మ్యాచ్ ప్రథమార్థంలోనే 24వ నిమిషంలో ఉరుగ్వే గోల్ చేసింది.
ద్వితియార్థంలో సైతం ఉరుగ్వే .. సౌదీకి ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. అయినప్పటికి సౌదీ అరేబియా డెడ్‌లాక్‌ను ఛేదించేందుకు గోల్ పోస్ట్‌పై ఎటాకింగ్‌కు తీవ్రంగా ప్రయత్నించినా గోల్ సాధించలేకపోయింది. దీంతో ఉరుగ్వే 1-0తో గెలిచింది.
తొలి మ్యాచ్‌లో ఈజిప్టుపై గెలిచిన ఉరుగ్వే, తాజా విజయంతో దాదాపు రెండో రౌండ్‌కు చేరినట్లే. మరోవైపు రెండు వరుస ఓటములతో సౌదీ అరేబియా రెండో రౌండ్ అవకాశాల్ని చేజార్చుకుంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా లూయిజ్ సురేజ్ నిలిచాడు. ఇప్పటికే ఈజిప్ట్‌పై విజయం సాధించిన ఉరుగ్వే నేడు జరిగిన మ్యాచ్‌లో సౌదీ అరేబియాపై గెలుపొంది నాకౌట్ దశకు చేరుకుంది.