For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐఎస్ఎల్: ఫాంటసీల్లోనూ దూకుడుకే ప్రాధాన్యం

By Nageshwara Rao

న్యూఢిల్లీ: ఐఎస్ఎల్ 3 ఎడిషన్‌లో నార్త్ఈస్ట్ యునైటెడ్, అట్లెటికో డీ కోల్‌కతా జట్లు.. ఫాంటసీలకు వేదికగా మారాయి. ఈ టోర్నీలో మరో పది రౌండ్ల మ్యాచ్‌లు జరుగనున్న నేపథ్యంలో ఆయా జట్లలో ఉత్తమ ఆటతీరు, ప్రతిభ కనబరుస్తున్న ప్లేయర్లు ఉన్నారు. వారిలో నలుగురు అత్యుత్తమ ప్లేయర్ల గురించి తెలుసుకుందాం.

వారి ఆటతీరుకు అనుగుణంగానే గణనీయంగా వారి బిజినెస్ సామర్థ్యమూ పెంపొందుతున్నది. అలా బెస్ట్ అనిపించుకున్న ప్లేయర్లలో అట్లెటికో డీ కోల్ కతాకు చెందిన డేబ్జిత్ మజుందార్, కేరళ బ్లాక్ బస్టర్స్ ప్లేయర్ సెడ్రిక్ హాంగ్‌బార్ట్, ముంబై సిటీ ఎఫ్ సి కుర్రాడు క్రిస్జిస్థాన్ వడోక్, ఢిల్లీ డైనమోస్ ప్లేయర్ రిచర్డ్ గాడ్జే ఉన్నారు.

ఫాంటసీల్లో డేబ్జిత్ మజుందార్ టాప్
ఈ ఏడాది ఐఎస్ఎల్ ఫాంటసీల్లో అత్యధిక పాయింట్లు అట్లెటికో డీ కోల్ కతా గోల్ కీపర్ దేబ్జిత్ మజుందార్ దక్కించుకున్నాడు. ఎటికె తరఫున ఆరు మ్యాచ్ లు ఆడిన మజుందార్ రెండు క్లీన్ చిట్స్ పొందాడు. 28 ఏళ్ల ఈ కుర్రాడు 2014 సీజన్ లో జట్టు కస్టోడియన్ గా అందరి ద్రుష్టిని ఆకర్షించాడు. ఆ ఏడాది టైటిల్ ను గెలుచుకోవడంలో మజుందార్ పాత్ర ఎనలేనిది.

ఈ ఏడాది ప్రత్యర్థి జట్ల ప్లేయర్లు పంపిన బంతులు గోల్ పోస్ట్ దరి చేరకుండా వదిలేయడం పలువురిని ప్రత్యేకించి ప్రత్యర్థి జట్ల ప్లేయర్లను ఆశ్చర్య చకితులను చేసింది. ఐఎస్ఎల్ ఫాంటసీలో 24 పాయింట్లు రాగా మజుందార్ 18 సేవ్‌లు సాధించాడు. ఇప్పటికే స్థిరమైన పాయింట్‌తో ముందుకు సాగుతున్న మజుందార్ ధర ఫాంటసీ టీంలో రూ.5 కోట్లు పలుకుతోంది.

Unsung heroes of ISL Fantasy 2016

డిఫెన్స్‌లో హెంగ్‌బార్ట్ ముందంజ
ఈ ఏడాది ఫాంటసీ డిఫెన్స్‌లో అత్యధిక పాయింట్లు పొందిన ప్లేయర్ కేరళ బ్లాక్ బస్టర్స్ కు చెందిన సెడ్రిక్ హెంగ్ బార్ట్ ఒకరు. ముంబై సిటీ ఎఫ్‌సికి చెందిన ఎయిర్బొర్లాంగ్ ఖోంజీతో కలిసి సెడ్రిక్ హెంగ్ బార్ట్ డిఫెన్సివ్ ఆటలో 35 పాయింట్లు పొందాడు. కేరళ బ్లాక్‌బస్టర్స్‌కు వెన్నుదన్నుగా నిలిచిన సెడ్రిక్ హెంగ్‌బార్ట్.. రెండు క్లీన్ చిట్లు పొంది ఉన్నాడు.

ఎఫ్ సి పుణె సిటీతో జరిగిన మ్యాచ్ లో శరవేగంగా ప్రత్యర్థి పెనాల్టీ ఏరియాలో శరవేగంగా గోల్ చేసిన ఘనత కూడా ఈయన సొంతమే. హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్న సెడ్రిక్ నిరంతరం సుస్థిర ప్రతిభ కనబరుస్తున్నాడు. తత్పలితంగా ఐఎస్ఎల్ అభిమానుల ఫాంటసీ టీంలో ఆయనకు ఆరు కోట్ల రూపాయలు లభిస్తోంది.

సెంటర్ లో దూకుడు క్రిస్జిస్థాన్
అటాకింగ్ లో, పిచ్ మధ్యలో దూకుడుగా ముందుకు దూసుకెళుతున్న ప్లేయర్లలో ముంబై సిటీకి చెందిన క్రిస్జిస్థాన్ వాడోక్ పేరు ముందున్నది. మిడ్ ఫీల్డర్లలో అలెగ్జాండ్రి గుమారెస్ శిష్యుడైన క్రిస్జిస్థాన్ పేరు ఫాంటసీల్లో మారుమోగుతున్నది.

ముంబై సిటీ తరఫున 37 వ్యక్తిగత పాయింట్లు పొందిన క్రిస్జిస్థాన్.. ఈ సీజన్ లో రెండు గోల్స్ లో భాగస్వామ్యం, 19 బంతులు గోల్ పోస్ట్ దరి చేరకుండా అడ్డుకున్నాడు. మూడు సార్లు అటాకింగ్‌లో గోల్స్ చేయకుండా అడ్డుకున్న ఈ ముంబై సిటీ కుర్రాడు హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు ఎంపిక అయ్యాడు. తదనుగుణంగానే క్రిస్జిస్థాన్ పేరు ఫాంటసీ టీంలో రూ.7.1 కోట్ల ధర పలుకుతున్నది.

రిచర్డ్ గాడ్జెకు అత్యధిక రేట్
ప్రస్తుత సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన జట్లలో ఢిల్లీ డైనమోస్ ఒకటి. అందులో స్ట్రయికర్ ఆటగాడిగా ఉన్న రిచర్డ్ గాడ్జె జట్టును ముందుకు తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఢిల్లీ లయన్స్.. ముంబై సిటీతో మ్యాచ్‌ను 3 - 3 స్కోర్ తేడాతో థ్రిల్లింగ్ డ్రాగా ముగించడంలో కీలక భూమిక పోషించిన గాడ్జె.. ఆ మూడుగోల్స్ ఆయన చేసినవే.

సహచర ప్లేయర్లకు అసిస్టెన్స్‌లోనూ, పెనాల్టీ విన్నింగ్‌తో స్కోర్ సమం చేయడంలోనూ అన్నింటా ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. రోజురోజుకు శక్తి సామర్థ్యాలు పెంపొందించుకుంటున్న గాడ్జె వంటి ఆటగాడి కోసం పలు జట్ల ఫ్రాంచైసీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయంటే అతిశేయోక్తి కాదు. తత్ఫలితంగా అభిమాన కోటి ఫాంటసీ టీంలో రిచర్డ్ గాడ్జె కు రూ.8.6 కోట్ల విలువైన ధర లభిస్తున్నది.

టైటిల్‌పై తొందరేం లేదు: లివర్‌పూల్ సారధి జోర్డన్ హిండర్సన్
ప్రీమియర్ లీగ్ చాంపియన్ షిప్ టోర్నీ టైటిల్ ను గెలుచుకోవడంపై స్పందించడం తొందరపాటవుతుందని లివర్ పూల్ క్లబ్ జట్టు సారధి, మిడ్ ఫీల్డర్ జొర్డన్ హిండర్సన్ వ్యాఖ్యానించాడు. క్రిస్టల్ ప్యాలెస్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 - 2 స్కోర్ తేడాతో విజయం సాధించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

1990ల్లో 18 ఇంగ్లిష్ లీగ్ టైటిళ్లు గెలుచుకున్న లివర్ పూల్ జట్టుకు ప్రస్తుతం ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్‌లో 10 మ్యాచ్ లు పూర్తయిన తర్వాత మాంఛెస్టర్ సిటీ జట్టుకు మధ్య రెండు పాయింట్ల తేడా మాత్రమే ఉంది. అభిమానుల ఆకాంక్షలకు అనుగుణంగా స్ఫూర్తిదాయకమైన ఆటతీరు ప్రదర్శిస్తున్న హిండర్సన్ తాము కేవలం ప్రత్యర్థి జట్లతో జరిగే మ్యాచ్‌లపైనే ద్రుష్టిని సారించామన్నారు.

ప్రతి గేమ్ లోనూ ముందుకు వెళ్లడంపైనే ఆసక్తిచూపుతున్నామని, మిగతా అంశాలను పట్టించుకోవడం లేదన్నాడు. ప్యాలెస్‌ ప్లేయర్ జేమ్స్ మైక్ ఆర్తూర్ డిఫెన్స్ తమకు ఆందోళన కలిగిస్తున్నదని చెప్పాడు. అతడ్ని దాటుకుని తాము ముందుకు వెళ్లడం కష్ట సాధ్యంగానే ఉన్నా.. సెకండాఫ్‌లో అధిగమించగలిగామని హిండర్సన్ వ్యాఖ్యానించాడు.

ప్రతి మ్యాచ్ పూర్తయిన తర్వాత తాము చేసే పొరపాట్లను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని, కానీ గతంలో చేసిన పొరపాట్లను పట్టించుకోకుండా ముందడుగు వేస్తామన్నాడు. వచ్చే ఆదివారం నాడు వాట్ఫోర్డ్‌తో జరిగే మ్యాచ్‌కు లివర్ పూల్ ఆతిథ్యం ఇవ్వనున్నది.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+