ఇంటర్ కాంటినెంటల్ టోర్నీకి పూర్తి ఫిట్‌నెస్‌తో అండర్23 టీమిండియా

హైదరాబాద్: ఇండియన్ అండర్ - 23 ఫుట్‌బాల్ జట్లు పూర్తిగా ఫిట్‍గా, శక్తిమంతంగా ఉన్నారని డిఫెండర్ అనాస్ ఎడాథోడికా ప్రశంసించాడు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్న నాలుగు దేశాల ఖండాంతర కప్ టోర్నీకి ఇండియన్ అండర్ - 23 జట్టు శిక్షణ పొందుతున్నారు. శిక్షణలో మెరుగైన ఆటతీరు కనబరిచిన వారిలో కొందరిని మాత్రమే తుది జట్టుకు ఎంపిక చేయనున్నారు.
'మనం మానసికంగా కూడా చాలా శక్తిమంతంగా ఉండాలి. అందుకోసమే యువ ఆటగాళ్లను ఎంపిక చేస్తున్నాం. మా జట్టు సభ్యుల శక్తి సామర్థ్యాల గురించి కోచ్ స్టీఫెన్ కాంస్టాంటైన్ చాలా విశ్వాసంతో ఉన్నారు. ఖతార్ జట్టుపై జరిగిన మ్యాచ్‌లో భారత అండర్ 23 జట్టు సభ్యులు చాలా స్ఫూర్తిదాయంగా ఆడారు. నాకు స్ఫూర్తినిచ్చారు' అని అనాస్ తెలిపారు.

వచ్చేనెల ఒకటో తేదీ నుంచి ఇంటర్ కాంటినెంటల్ కప్
‘వారు భౌతికంగా ఎదురయ్యే సవాళ్లను శరవేగంగా ఎదుర్కోనున్నారు. కారణమేమిటంటే అత్యంత దృఢత్వంతో వారు ఆడటమే దీనికి నిదర్శనం' అని అనాస్ ఎడాథోడికా తెలిపారు. ప్రస్తుతం అండర్ - 23 జట్టు ముంబైలోని అంధేరిలోని ఫుట్‌బాల్ ఎరినాలో శిక్షణ పొందుతున్నది. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి ఖండాంతర దేశాల కప్ టోర్నమెంటుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్నది.

నాలుగు దేశాల జట్లతో తలపడనున్న ఇండియన్ టీం
ఈ టోర్నమెంటులో చైనీస్ థైపీ, న్యూజిలాండ్, కెన్యా జట్లతో భారత్ అండర్ - 23 జట్టు తలపడనున్నది. ఖతార్‌లోని దోహాలో జరిగిన అండర్ - 23 క్వాలిఫయ్యర్స్ టోర్నీలో ఖతార్ జట్టు చేతిలో 0 - 1, సిరియా జట్టు చేతిలో 0- 2 తేడాతో ఓటమి పాలైనా తుర్కెమినిస్థాన్ జట్టుపై భారత్ జట్టు 3 - 1 స్కోర్ తేడాతో విజయం సాధించింది.

ఇండియన్ జట్టుకు ఇంటర్ కాంటినెంటల్‌కప్ ఎంతో కీలకం
‘భారత జట్టుకు ఇది (ఇంటర్ కాంటినెంటల్ కప్) చాలా ముఖ్యమైన టోర్నమెంట్. వచ్చే ఏడాది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఎఈ)లో త్వరలో జరిగే ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫిడరేషన్ (ఎఎఫ్సీ) జరిగే టోర్నమెంట్లలో ఆడేందుకు అనుభవం సాధించాలంటే ఈ టోర్నమెంట్ ఎంతో దోహదపడుతుంది. మరిన్ని మ్యాచ్‌ల్లో ఆడేందుకు కోచ్ కాంస్టాటైన్ చర్యలు చేపడుతున్నారు' అని తెలిపారు. గతేడాది జరిగిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లోనూ జంషెడ్ పూర్ జట్టు తరఫున అనాస్ ఎడాథోడికా ప్రాతినిధ్యం వహించాడు. ఆసియాన్ కప్ నిర్వహించేందుకు బహ్రెయిన్, థాయిలాండ్‌లతోపాటు కలిసి భారతదేశం ఆతిథ్యం ఇస్తున్నది. ఇండియన్ టీంకు, ఐఎస్ఎల్ టీంకు చాలా తేడా ఉన్నదని తెలిపాడు. ఐఎస్ఎల్‌తోపాటు ఐ లీగ్‌కు కూడా ఆయన ప్రాతినిధ్యం వహించాడు.

భయం పూర్తిగా పోయిందని మాన్విర్
అండర్ - 23 ఆసియా కప్‌లో తుర్కెమినిస్థాన్ జట్టుపై విజయం సాధించడానికి కీలకమైన మూడు గోల్స్ సాధించాడు పంజాబ్‌కు చెందిన మాన్విర్ సింగ్. ‘మేం చాలా బాగా ఆడాం. మేం 100 శాతం ఆడగలిగాం. ఇది నా ఆరంభానికి, నేను స్కోర్ సాధించడానికి కీలకం. నేను గోల్ చేసిన తర్వాత నాలో ఉన్న భయం పూర్తిగా పోయింది' అని మాన్విర్ సింగ్ తెలిపాడు. ఫిట్ నెస్ కాపాడుకునేందుకు తామెంతో కష్టపడి పని చేస్తున్నట్లు చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications