Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఉరుగ్వే ఉరకలు, ఘనా పరుగులు

Striker Diego Forlan
జొహన్నెస్‌ బర్గ్‌: ఫేవరైట్లు కాని ఉరుగ్వే, ఘనా జట్ల మధ్య ఈరాత్రి మ్యాచ్ జరుగనుంది. సాకర్ ‌సిటీ స్టేడియంలో శుక్రవారం జరిగే క్వార్టర్‌ ఫైనల్లో తలపడేముందు ఉరుగ్వే, ఘనాల పరిస్థితి ఇది. ఎప్పుడో రెండుసార్లు ప్రపంచకప్‌ గెలిచినా, 1970 తర్వాత ఒక్కసారి కూడా సెమీస్‌కు చేరలేకపోయిన ఉరుగ్వే...ఈసారి తమకు సువర్ణావకాశం లభించిందని భావిస్తోంది.

మరోవైపు ఘనా...స్థానిక అభిమానుల మద్దతుతో చెలరేగిపోతోంది. గత ప్రపంచకప్‌ లోనూ ఆఫ్రికా నుంచి నాకౌట్‌ దశకు చేరిన ఒకే ఒక జట్టు...ఈసారి కూడా ఆఫ్రికా ఆశలను మోస్తూ క్వార్టర్స్‌ దాకా చేరింది. చరిత్రలో ఈ ఘనత సాధించిన మూడో ఆఫ్రికా జట్టు ఘనా. ఇప్పటికే ఘనా ప్రదర్శన సంచలనం. ఇక సెమీస్‌కు కూడా చేరితే...ఆఫ్రికా నుంచి ఆ ఘనత సాధించిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించవచ్చు. ఇప్పుడు దీనిమీదే మొత్తం ఆఫ్రికా ఖండం ఆశ.

ఆ ఇద్దరే ఉరుగ్వే బలం
చాలాకాలంగా దక్షిణ అమెరికా ఖండంలోని సహచర దేశాలు బ్రెజిల్‌, అర్జెంటీనాల నీడలో ఉరుగ్వే కనపడలేదు. ఈసారి మాత్రం సెమీస్‌ కు చేరతామని ఈ జట్టు ధీమాగా ఉంది. పటిష్టమైన డిఫెన్స్‌ ఈ జట్టు బలం. స్ట్రయికర్స్‌ ఫోర్లాన్‌, సారెజ్‌ ఫుల్‌ఫామ్‌లో ఉన్నారు. వీరికి తోడుగా కేవెని కూడా చెలరేగితే ఈ జట్టుకు తిరుగుండదు. అనుభవం ఉన్న కోచ్‌ ఆస్కార్‌ టెబరెజ్‌ ఈ జట్టుకు అదనపు బలం.

యువరక్తంతో ఘనా ఉరకలు
కీలక మ్యాచ్‌కు నాణ్యమైన ఇద్దరు ఆటగాళ్లు మెన్సా, అయు అందుబాటులో లేరు. దీంతో స్టార్‌ స్ట్రయికర్‌ గ్యాన్‌పై మరింత భారం పెరిగింది. అంచనాలు లేకపోవడం, ఆటగాళ్లు మంచి ఉత్సాహంతో ఉండటం, స్థానిక అభిమానుల మద్దతు బలం. టోర్నీలో సగటు వయసు అత్యంత తక్కువగా ఉన్న జట్టు ఘనా. గత ఏడాది ఫిఫా అండర్‌ 20 కప్‌ గెలిచిన ఆటగాళ్లు ఎక్కువ మంది జట్టులో ఉన్నారు.

క్వార్టర్‌ ఫైనల్‌ 2
ఘనా/ఉరుగ్వే
రాత్రి గం.12.00 నుంచి,ఈఎస్పీఎన్‌ లో ప్రత్యక్ష ప్రసారం.

ఈ రెండు జట్లూ ఇప్పటివరకూ ఒక్కసారి కూడా తలపడలేదు. లీగ్‌ దశలో ఘనా నాలుగు గోల్స్‌ చేసి మూడు ఇచ్చింది. ఉరుగ్వే ఆరు చేసి ఒక్కటే ఇచ్చింది.
Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+