
హైదరాబాద్: యూఈఎఫ్ఏ ఫుట్‌బాల్ ఛాంపియన్ లీగ్‌కు పక్కాగా పదహారు టీంలు సెలక్టయ్యాయి. ఆ టీంల వివరాలు కింది విధంగా ఉన్నాయి. లీగ్‌కు 16 జట్ల ఎంపికైతే పూర్తయింది. కానీ, ఏ టీం ఎవరితో తలపడనుందో తెలియాల్సి ఉంది.
ఈ విషయాన్ని సోమవారం అంటే డిసెంబర్ 11 వతేదీన వేసే ఫైనల్ డ్రాలో తేల్చనున్నారు. ఈ జట్టులలో ఒకే దేశానికి చెందిన వాళ్లు కానీ, ఒకే గ్రూపుకు సంబంధించిన వాళ్లు గానీ ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. క్లబ్‌లోని టాప్ గ్రూప్‌లను సీడెడ్‌గా, మిగిలిన వాటిని అన్‌సీడెడ్‌గా విడదీశారు.
సీడెడ్: మాంచెస్టర్ యునైటెడ్, పారిస్ సెయింట్-జర్మైన్, రోమా, బార్సిలోనా, లివర్‌పూల్, మాంచెస్టర్ సిటీ, బెసిక్తాస్, టొట్టెన్‌హమ్
అన్‌సీడెడ్: బాసెల్, బేయర్న్ మునిచ్, చిల్సీ, జువెంటస్, సెవిల్లా, షక్తర్ డొనెటస్క్, పొర్టో, రీల్ మద్రిద్