Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

3 వారాల్లో రాజకీయ పార్టీని పెట్టబోతున్న స్టార్ ప్లేయర్

Two Months After Quitting TMC, Bhaichung Bhutia to Launch His Political Party Tomorrow

హైదరాబాద్: 'వ్యవస్థను మార్చాలనుకుంటే వ్యవస్థలో ఉండాలి. బయటి నుంచి ఎంత మొత్తుకున్నా లాభం లేదు' అంటున్నాడు భారత ఫుట్‌బాల్ మాజీ ప్లేయర్ బై చుంగ్ భూటియా. రాజకీయాల్లో కొత్త అధ్యాయం లిఖిస్తానంటూ భూటియా సిక్కింలో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నాడు. రెండు నెలల కిందటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన భూటియా.. సొంతంగా పార్టీ పెట్టాలని నిర్ణయికున్నాడు. గురువారం ఢిల్లీలో అధికారికంగా ఈ పార్టీని లాంచ్ చేయనున్నాడు.

పార్టీ పెట్టబోతున్న విషయం నిజమే

పార్టీ పెట్టబోతున్న విషయం నిజమే

ఈ సందర్భంగా మాట్లాడిన భూటియా 'నేను పార్టీ పెట్టబోతున్న విషయం నిజమే. ఈ పార్టీ సిక్కిం ప్రజలకు అంకితం. రాష్ట్రంలో అవినీతిని అంతమొందిస్తాం. కొన్ని అంశాలపై సీబీఐ విచారణను డిమాండ్ చేస్తున్నాం' అని భూటియా చెప్పాడు. గురువారం పార్టీ లాంచ్ సమయంలోనే పేరు ప్రకటిస్తానని తెలిపాడు.

మూడు వారాల్లో పూర్తి స్థాయిలో

మూడు వారాల్లో పూర్తి స్థాయిలో

'మరో మూడు వారాల్లో పార్టీ పూర్తి స్థాయిలో సిద్ధమవుతుంది. సభ్యులందరికీ బాధ్యతలు కేటాయించి పార్టీని పటిష్టం చేస్తాం. మహిళల కోసం ప్రత్యేకంగా ఓ వింగ్ ఏర్పాటు చేస్తాం. కొత్త రాజకీయ పార్టీ అవసరం ఉన్నది.' అని భూటియా చెప్పాడు.

అవినీతిని అంతమొందించడం, ఉద్యోగ కల్పన:

అవినీతిని అంతమొందించడం, ఉద్యోగ కల్పన:

'మీరు వ్యవస్థను మార్చాలనుకుంటే వ్యవస్థలో ఉండాలి. బయటి నుంచి ఎంత మొత్తుకున్నా ప్రయోజనం లేదు. మొదట్లో మా కుటుంబం దీనిని వ్యతిరేకించింది. అయితే సిక్కింలో అవినీతిని అంతమొందించడం సరైన రాజకీయ వేదిక ద్వారానే సాధ్యమవుతుందని నా భార్య, ఇతర కుటుంబ సభ్యులు ఇప్పుడు అంగీకరిస్తున్నారు అని భూటియా తెలిపాడు. ఉద్యోగ కల్పన, క్రీడలు, విద్య, ఆరోగ్యం, తాగునీరు, మౌళిక సదుపాయాలు కల్పించడమే తమ పార్టీ ఎజెండా అని అతను స్పష్టంచేశాడు.

2011లో ఫుట్‌బాల్ కెరీర్‌కు గుడ్‌బై

2011లో ఫుట్‌బాల్ కెరీర్‌కు గుడ్‌బై

2011లో ఫుట్‌బాల్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన భూటియా.. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాడు. 2013లో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరాడు. 2014 ఎన్నికల్లో డార్జీలింగ్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి ఎస్‌ఎస్ అహ్లూవాలియా చేతిలో 2 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయాడు. 2016లో బెంగాల్‌లోని సిలిగురు అసెంబ్లీ నుంచి పోటీ చేసినా.. సీపీఎం అభ్యర్థి అశోక్ భట్టాచార్య చేతిలో 14 వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ప్రత్యేక గోర్ఖాలాండ్ రాష్ట్రానికి ఇప్పటికే భూటియా మద్దతు పలకడం విశేషం. ఢిల్లీలో ఇప్పటికే బైచుంగ్ భూటియా ఫుట్‌బాల్ స్కూల్‌ను కూడా అతను నడిపిస్తున్నాడు.

Story first published: Wednesday, April 25, 2018, 17:08 [IST]
Other articles published on Apr 25, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+