సాకర్‌కు లివర్ పూల్ లెజెండ్ గెర్రార్డ్ గుడ్ బై
బెంగళూరు: లివర్ పూల్ లెజెండ్ స్టీవెన్ గెర్రార్డ్ తన 19 ఏళ్ల ప్రొఫెషనల్ ఫుట్ బాల్ ఆటకు గుడ్ బై చెప్పేశారు. ట్విట్టర్ రియాక్షన్‌తో కలత చెందిన ఈ ఇంద్రజాల మిడ్ ఫీల్డర్ గెర్రార్డ్ ఇక ఆడలేనని తేల్చి చెప్పారు. పేరొందిన మిడ్ ఫీల్డర్‌గా 948 మ్యాచ్ లు, 191 గోల్స్ తన ఖాతాలో జమ చేసుకున్న గెర్రార్డ్ లివర్‌పూల్ తరఫున 18 ఎడిషన్లలో ప్రాతినిధ్యం వహించాడు.
2015లో లివర్‌పూల్ క్లబ్ నుంచి వైదొలిగిన గెర్రార్డ్ 'లా గాలక్సీ' సాకర్ లీగ్‌లో చేరాడు. రిటైర్మెంట్ ప్రకటించడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆయన అభిమానులంతా ట్విట్లర్‌లో గెర్రార్డ్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. సుమారు 15 ఏళ్ల పాటు లివర్ పూల్ క్లబ్‌కు విధేయత ప్రదర్శించిన గెర్రార్డ్ ఇంతకుముందు ఇంగ్లండ్ జట్టుకు సారధిగా వ్యవహరించాడు.
దాదాపు 18 ఏళ్ల పాటు లివర్‌పూల్, ఇంగ్లండ్ జాతీయ క్లబ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. చిన్నతనం నుంచే లివర్‌పూల్ అభిమానిగా ఉన్న గెర్రార్డ్.. అదే జట్టు ప్లేయర్‌గా, సారధిగా తన కల సాకారంచేసుకున్నాడు. పలు యూరోపియన్ క్లబ్‌లు ఆకర్షణీయమైన, విలాసవంతమైన ఆఫర్లు ఇచ్చినా తోసిరాజని లివర్‌పూల్ క్లబ్ సేవలకు మాత్రమే పరిమితమయ్యాడు.

లివర్‌పూల్ జట్టు సారధిగా స్టీవెన్ గెర్రార్డ్
2003 నుంచి లివర్ పూల్ జట్టు సారధిగా సేవలందించాడు. స్టీవెన్ గెర్రార్డ్ ఇంగ్లండ్ జట్టుకు 15 ఏళ్ల పాటు ఆడాడు. 114 అంతర్జాతీయ క్యాప్స్, 21 గోల్స్ సాధించాడు. అధికారికంగా గెర్రార్డ్ తన రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత బిబిసి ఆయన చేసిన వ్యాఖ్యను ఇలా ఉటంకించింది:

మరిచిపోలేని అనుభూతి
‘నా కెరీర్ అంతా అద్భుతమైన ముఖ్య ఘట్టాలు ఆవిష్కరణయ్యాయి. ప్రత్యేకత రికార్డులు సాధించిన అనుభవంతో నేను చాలా లక్కీగా ఫీలవుతున్నా'అని ఆయన అన్నారని బిబిసి తెలిపింది. లివర్‌పూల్, ఇంగ్లండ్, లా గాలక్సీ జట్లకు ప్రాతినిధ్యం వహించిన తన కెరీర్‌లో ప్రతి నిమిషం అద్భుతమైంది, ప్రతి క్షణం మరిచిపోలేని అనుభూతి మిగిల్చిందని గెర్రార్డ్ వ్యాఖ్యానించాడు.

బ్లాక్‌బర్న్ రోవర్స్‌కు వ్యతిరేకంగా
‘టీ నేజర్‌గా ఉన్నప్పుడు లివర్ పూల్ జట్టు జెర్సీ ఫేమస్ రెడ్ షర్ట్ ధరించాలని కలలు కనేవాడ్ని. 1998 నవంబర్‌లో బ్లాక్‌బర్న్ రోవర్స్‌కు వ్యతిరేకంగా ఆడిన తొలి గేమ్ అనుభూతిని మరిచిపోలేను. ఆ తర్వాత 18 ఏళ్ల పాటు సుదీర్ఘంగా నా ప్రయాణం సాగింది' అని తెలిపాడు.

గర్వంగా ఉంది
‘లివర్ పూల్ క్లబ్ తరపున 700లకు పైగా గేమ్స్ ఆడినందుకు నాకు గర్వంగా ఉంది. వాటిల్లో కొన్ని మ్యాచ్ లకు సారధ్యం వహించాను. క్లబ్ జట్టు విజయాల్లో నా వంతు పాత్ర పోషించా. అన్ ఫీల్డ్‌లో చేరే వరకు
గౌరవాన్నందించింది' అని తెలిపాడు. అంతర్జాతీయంగా ఇంగ్లండ్ జట్టు తరఫున ఆడిన పలు సార్లు క్యాప్ గెలుచుకున్న నేను నా దేశం తరఫున జట్టుకు సారధ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నా. నేను ఇంగ్లండ్ తరఫున మ్యాచ్ ఆడిన ప్రతిసారి ఇంగ్లండ్ జట్టు జెర్సీని ఒకసారి తరచి చూసుకునే వాడ్ని' అని చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications