Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రంజాన్‌ ఉపవాసం: గోల్ కీపర్ 'ఉత్తుత్తి గాయం' డ్రామా (వీడియో)

Tunisia goalkeeper fakes injury to break Ramadan fast

హైదరాబాద్: ముస్లింలు రంజాన్‌ మాసం ఎంతో పవిత్రమైన మాసం. రంజాన్ సమయంలో ఉపవాసం ఉండే ముస్లింలు ఎంతో భక్తిశ్రద్ధలతో ఆచరిస్తుంటారు. అలాంటి రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటూ పుట్ బాల్‌లో అలసిపోయిన తన సహచరులకు సాయం చేయాలనుకున్న ఓ గోల్‌ కీపర్‌ భిన్నంగా ఆలోచించాడు.

తునీషియా గోల్‌ కీపర్‌ కీలక నిర్ణయం

వివరాల్లోకి వెళితే... ఫిఫా ఫుట్‌‌బాల్‌ వరల్డ్‌ కప్‌ ‌సందర్భంగా తునీషియా, పోర్చుగల్‌ జట్ల మధ్య సోమవారం ఫ్రెండ్లీ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో తునీషియా గోల్‌ కీపర్‌ మొహెజ్‌ హసన్‌ ఆట మధ్యలో ప్రత్యర్ధి జట్టు ఆటగాడు అతడిని తాకడంతో ఒక్కసారిగా మైదానంలో కుప్పకూలిపోయాడు.

మిగతా ఆటగాళ్లకు కర్జూరతో పాటు డ్రింక్స్‌

దీంతో వెంటనే వైద్యులు అతడికి చికిత్స అందించింది. అదే సమయంలో జట్టులోని మిగతా ఆటగాళ్లకు కర్జూరతో పాటు డ్రింక్స్‌ను అందించారు. రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌లో పుట్ బాలర్లకు ఇచ్చే ఇఫ్తార్‌ విందులో భాగంగా వీటిని సిబ్బంది జట్టు యాజమాన్యానికి ముందుగానే అందించారు.

నిజంగా గాయం కాలేదు

అయితే, తనకు నిజంగా గాయం కాలేదని ఆట ఆడి అలసిపోయిన తన సహచరుల కోసం ఇలా గాయపడినట్లు నటించానని మ్యాచ్ అనంతరం హసన్‌ పేర్కొన్నాడు. కాగా, ఇఫ్తార్‌ విందుకు ముందు 2-1తో వెనకబడిన తునీషియా జట్టు ఆ తర్వాత ఆరు నిమిషాల్లోనే స్కోరును సమం చేసింది. దీంతో 2-2తో ఈ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.

12 ఏళ్ల తర్వాత తొలిసారిగా వరల్డ్ కప్‌కు అర్హత

12 ఏళ్ల తర్వాత తొలిసారిగా వరల్డ్ కప్‌కు అర్హత

12 ఏళ్ల తర్వాత తునీషియా తొలిసారిగా వరల్డ్ కప్‌కు అర్హత సాధించింది. రష్యా ఆతిథమిస్తోన్న ఈ ఫిఫా వరల్డ్ కప్‌ జూన్ 14 నుంచి జులై 15 వరకు జరగనుంది. టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్ మాస్కోలోని లుజింకి స్టేడియంలో ఆతిథ్య రష్యా-సౌదీ అరేబియా జట్ల మధ్య జరగనుంది. మరోవైపు తునీషియా తన తొలి మ్యాచ్‌ను ఇంగ్లాండ్‌తో జూన్‌ 18న ఆడనుంది.

Story first published: Tuesday, June 5, 2018, 19:34 [IST]
Other articles published on Jun 5, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+