100 మిలియన్ యూరోలు: పోగ్బాపై కన్నేసిన బార్సిలోనా

హైదరాబాద్: సాకర్ ప్రపంచంలో ప్రస్తుతం అత్యుత్తమ ఎటాకింగ్ మిడ్ ఫీల్డర్ పాల్ పోగ్బా. అంతేకాదు ఇటీవల రష్యాలో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో ఫ్రాన్స్ వరల్డ్ కప్ విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు. అలాంటి 25 ఏళ్ల పోగ్బాపై ప్రపంచంలోనే అత్యుత్తమ సాకర్ క్లబ్ బార్సిలోనా కన్నేసింది.
స్పానిష్ సాకర్ లీగ్ లా లీగాలో అత్యుత్తమ క్రికెట్ క్లబ్‌గా పేరున్న బార్సిలోనా జట్టు ఈ ఎటాకింగ్ మిడ్‌ఫీల్డర్‌ను సొంతంచేసుకోవాలని తహతహలాడుతోంది. నిజానికి పుట్‌బాల్ ఆడే ప్రతి క్రీడాకారుడు తన జీవితంలో ఒక్కసారన్న బార్సిలోనా జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని కల కంటుంటాడు.

ఫ్రాన్స్ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం
ప్రస్తుతం పాల్ పోగ్బా ఫ్రాన్స్ జాతీయ జట్టుతో పాటు ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్‌లో మాంచెస్టర్ యునైటెడ్ జట్లలో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. సాకర్ ప్రపంచంలో అత్యుత్తమ జట్లకే ఇప్పటివరకూ పాల్ పోగ్బా ప్రాతినిధ్యం వహించాడు. 2010 నుంచి 2012 వరకూ మాంచెస్టర్ యునైటెడ్ తరుపున ఆడాడు.

2012 నుంచి ఇటాలియన్ క్లబ్ జువెంటస్‌కు
ఆ తర్వాత 2012 నుంచి ఇటాలియన్ క్లబ్ జువెంటస్‌కు ప్రాతినిథ్యం వహించాడు. 2016లో జువెంటస్ క్లబ్ నుంచి 105 మిలియన్ యూరోల కాంట్రాక్ట్‌తో మాంచెస్టర్ యునైటెడ్ జట్టు తిరిగి పోగ్బాను దక్కించుకుంది. అప్పటి నుంచి మాంచెస్టన్ యునైటెడ్ జట్టులో స్టార్ ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు.

100 మిలియన్ యూరోలతో
100 మిలియన్ యూరోలతో ఐదు సంవత్సరాలకు పోగ్బాతో బార్సిలోనా ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాల్ పోగ్బా మరోసారి హైలెటయ్యాడు. గతంలో ఎన్నో సార్లు బార్సిలోనా క్లబ్ తరఫున ఆడే అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు పోగ్బా ప్రకటించాడు.

పోగ్బా ట్రాన్స్‌ఫర్‌పై ప్రకటన చేయని మాంచెస్టర్ యునైటెడ్
ఇదిలా ఉంటే మాంచెస్టర్ యునైటెడ్ మేనేజ్‌మెంట్ మాత్రం పోగ్బా ట్రాన్స్‌ఫర్‌పై ఎలాంటి ప్రకటన చేయక పోవడం విశేషం. కాగా, రష్యా వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో ఫ్రాన్స్ వరల్డ్ కప్ నెగ్గడంలో పోగ్బా ప్రధాన పాత్ర పోషించాడు. ఫైనల్‌లో క్రొయేషియాపై కళ్లు చెదిరే గోల్ కొట్టి రెండో సారి ఫ్రాన్స్‌ను వరల్డ్ ఛాంపియన్‌గా నిలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications