ఫుట్‌బాల్ మ్యాచ్‌లో మారణహోమం.. 100 మందికి పైగా మృతి (Video)
ఆఫ్రికా దేశం గినియాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆ దేశంలోని రెండో అతిపెద్ద నగరమైన ఎన్‌జెరెకోర్‌లో ఆదివారం జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా చెలరేగిన ఘర్షణల్లో దాదాపు 100 మందికి పైగా మృతి చెందారు. రిఫరీ తీసుకున్న నిర్ణయం వివాదస్పదం కావడంతో ఇరు జట్ల అభిమానులు ఒకరిపైనొకరు దాడికి దిగారు. ఈ క్రమంలో వీధుల్లోకి వచ్చి ఘోరంగా కొట్టుకున్నారు. అంతేగాక సమీపంలోని పోలీస్ స్టేషన్‌ను ధ్వంసం చేసి నిప్పటించారు.
అసలేం జరిగిందంటే.. సెప్టెంబర్ 2021 తిరుగుబాటులో అధికారాన్ని చేజిక్కించుకుని, తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకున్న గినియా జుంటా నాయకుడు మామాడి డౌంబౌయా గౌరవార్థం జెరెకొరె నగరంలో ఓ ఫుట్ బాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఓ మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్‌లో రిఫరీ తీసుకున్న నిర్ణయం వివాదస్పదంగా మారింది. రిఫరీ నిర్ణయానికి వ్యతిరేకిస్తూ ఓ జట్టు అభిమానులు మైదానంలోకి దూసుకొచ్చారు. మరోవైపు అవతల జట్టు అభిమానులు కూడా ప్రతిదాడి చేయడానికి గ్రౌండ్‌లో అడుగుపెట్టారు.

ఇది చివరికి మారణ హోమంగా మారింది. ఇరు జట్ల అభిమానులు మధ్య మొదలైన గొడవ వీధుల్లోకి వ్యాపించింది. తీవ్ర హింసాత్మకంగా మారింది. సమీపంలో ప్రాంతమంతా రక్తసిక్తంగా మారింది. ఇరు జట్ల అభిమానులు దగ్గరలోని పోలీస్ స్టేషన్‌ను కూడా ధ్వంసం చేశారు. దానికి నిప్పంటించారు. ''ఆసుపత్రిలో, దాని చుట్టూ కనుచూపు మేరలో మృతదేహాలు వరుసగా ఉన్నాయి. క్షతగ్రాతులు భారీ సంఖ్యలో ఉన్నారు. మార్చురీ నిండిపోయింది. సుమారు 100 మంది చనిపోయారు'' అని స్థానిక వైద్యుడు తెలిపారు.
BREAKING: At least 100 people killed in clashes between rival fans at soccer match in N’zerekore, Guinea. - AFP
— AZ Intel (@AZ_Intel_) December 1, 2024
pic.twitter.com/BIOH6bU75H
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications