
హైదరాబాద్: 'ప్రపంచంలోనే లియోనల్ మెస్సీ గొప్ప ఆటగాడు.' అంటున్నాడు ఇటాలియన్ మాజీ ఫుట్‌బాలర్ ఫ్రాన్సిస్కో టొట్టీ. డిసెంబరు నెల మొదట్లో ఐదో బాల్లోన్స్ డీ ఆర్ అవార్డు అందుకున్న క్రిస్టియన్ రొనాల్డో గొప్పతనం ఏమీ లేదంటూ టొట్టీ తోసిపుచ్చాడు.
ఎల్‌క్లాసికొ మ్యాచ్‌లో రియల్ మడ్రిడో జట్టును ఓడించి క్రిస్మస్ పండుగను ముందే జరుపుకుంటానన్న మెస్సీ కల నెరవేరింది. 3-0స్కోరుతో ఓడించి చూపించాడు. బార్సిలోనా జట్టును తన మెరుపు వేగంతో గోల్స్ చేసి ఓడించాడు.
'నేను చాలా కాలం క్రితం ఫుట్‌బాల్ ఆడాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు అంతా కొత్తగా ఉంది. అప్పుడు ఒక అనుభూతి కోసం ఆడేవాళ్లం. కానీ ఇప్పుడు అంతా వ్యాపారమైపోయింది. ఉదాహరణకు చూస్తే రొనాల్డొ, నీమార్ జీతాలు ఎలా ఉన్నాయి. నీమార్‌కు 250 మిలియన్ యూరోలు అంటే ఒక వెయ్యి తొమ్మిది వందల కోట్ల పైమాటే.' అని ఆశ్యర్యంతో తన అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నాడు.
ఎలా ఆడినా సరే మెస్సీనే మంచి ఆటగాడు. రొనాల్డొకు చెప్పొద్దు అని ముగించాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.