న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

టొట్టెన్‌హామ్ జట్టు వార్షిక ఆదాయం రూ.2.8 వేల కోట్లకు పైమాటే..

Tottenham announce record revenue of £306.3m for year ending June 30, 2017

హైదరాబాద్: గతేడాదితో పోలిస్తే ఏకంగా 46శాతం లాభాలు పెరిగి 306.3 మిలియన్ పౌండ్ల సంవత్సర ఆధాయాన్ని కలిగి ఉంది టొట్టెన్‌హామ్ జట్టు(అంటే సుమారు 2.8వేల కోట్లు). క్రిందటి ఏడాది వరకు 209 మిలియన్ పౌండ్ల (రూ.2వేల కోట్లు) ఆదాయం కలిగి ఉన్న జట్టు ఒకే సంవత్సరంలో ధాటిగా ఆదాయాన్ని పెంచుకుంది. మూడు సంవత్సరాల ప్రీమియర్ లీగ్‌ మీడియా హక్కులు అమ్ముకోవడం కూడా ఒక రకంగా కారణంగానే చెప్పుకోవచ్చు. ఇవే దాదాపు 149 మిలియన్ పౌండ్ల వరకు ఉన్నాయి.

టొట్టెన్‌హామ్ చైర్మన్ డేనియల్ లెవీ మాట్లాడుతూ..'క్లబ్ చేపట్టిన కొత్త మైదానం నిర్మాణంలో పూర్తి కావచ్చింది. ఇదే సమయంలో వార్షిక ఆదాయం ఇంత ఘనంగా పెరిగిందనే వార్త వినడం చాలా ఆనందంగా ఉంది. మా క్లబ్ తరపున ఆడిన ఆటగాళ్లకు, మమ్మల్ని నమ్మి జట్టు కోసం ఇంత పెట్టుబడులు పెట్టినందుకు ధన్యవాదాలు. మున్మందు జట్టు ప్రాక్టీస్ చేయడం కోసం మేమూ ఓ స్టేడియం నిర్మించుకోబోతున్నాం' అని తెలిపారు.

'ఇది మాకొక చారిత్రాత్మక విజయమనే చెప్పాలి. ఈ విషయం విన్న తర్వాత చాలా ఎగ్జైట్‌మెంట్‌కు గురైయ్యా. రాబోయే రోజుల్లో ఇంకొన్ని ఛాలెంజ్‌లు ఎదుర్కోవాల్సి ఉంది. మేమంతా ఒక్కటి అనే భావనతో ముందుకెళుతున్నాం. మేమంతా కలిస్తే ఎలాంటి ఛాలెంజ్ అయినా ఎదుర్కోగలం' అనే నమ్మకాన్ని వ్యక్తపరిచారు.

అమ్మో.. ఇంత వార్షిక ఆదాయమా అనుకోవడానికి లేదు. మిగతా జట్లతో పోలిస్తే.. ఈ జట్టుకే తక్కువ ఆదాయం వచ్చినట్లుగా ఉంది. అయితే ఒకే ఏడాది అత్యధికంగా పెరిగిన జట్టు మాత్రం టొట్టెన్‌హామ్ జట్టే.
మాంచెస్టర్ యునైటెడ్- 581.2 (మిలియన్ పౌండ్లలో)
మాంచెస్టర్ సిటీ- 473.4 (మిలియన్ పౌండ్లలో)
అర్సెనల్- 422.8 (మిలియన్ పౌండ్లలో)
లివర్ పూల్- 364 (మిలియన్ పౌండ్లలో)
చిల్సీ- 361.3 (మిలియన్ పౌండ్లలో)
టొట్టెనెహామ్- 306.3 (మిలియన్ పౌండ్లలో)

Story first published: Tuesday, April 3, 2018, 16:35 [IST]
Other articles published on Apr 3, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X