Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డిఫెన్స్‌తో తగ్గిన గోల్స్: టాప్ స్కోరర్ మార్సిలిన్హో

న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) మూడో ఎడిషన్‌లో జట్లన్నీ పటిష్ఠ డిఫెన్స్ వ్యూహం అమలు చేశాయి. గత ఎడిషన్‌తో పోలిస్తే 41 గోల్స్ తక్కువగా జరిగాయి. ప్రతి మ్యాచ్‌లోనూ సగటున 2.37 గోల్స్ జరిగాయి. ఫైనల్స్ సహా ఈ దఫా టోర్నీలో జరిగిన 61 మ్యాచ్‌ల్లోనూ 145 గోల్స్ నమోదయ్యాయి.

అయినా ఎనిమిది జట్లలో కొందరు ప్లేయర్లు తమదైన శైలిలో ప్రత్యర్థి జట్ల డిఫెన్స్ బద్దలు కొట్టి గోల్స్ సాధించారు. వారిలో టాప్ స్కోరర్ల వివరాలు పరిశీలిద్దాం..

గోల్డెన్ బూట్ కొట్టేసిన మార్సిలిన్హో

గోల్డెన్ బూట్ కొట్టేసిన మార్సిలిన్హో

ఐఎస్ఎల్ మూడో ఎడిషన్ టోర్నీలో గోల్డెన్ బూట్ గెలుచుకున్న మార్సిలిన్హో గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బంతిపై ఆధిపత్యం ప్రదర్శిస్తూ ప్రత్యర్థి జట్ల డిఫెన్స్‌ను తుత్తునియలు చేసి గోల్స్ సాధించాడు. ఢిల్లీ డైనమోస్ తరఫున పది గోల్స్ సాధించిన ఈ బ్రెజిల్ ఇంద్రజాలికుడు జట్టు తరఫున హ్యాట్రిక్ గోల్స్ సాధించిన ఘనత కొట్టేశాడు. ఇతర జట్ల ప్లేయర్ల కంటే అధికంగా గోల్స్ సాధించిన మార్సిలిన్హో 10 గోల్స్, ఐదు అసిస్టెన్స్‌లు అందించాడు. పలు అవకాశాలు పుష్కలంగా కల్పించుకుని గోల్స్ సాధించిన మార్సిలిన్హో.. గోవాపై జరిగిన మ్యాచ్‌లోనే అత్యధికం.

రెండోస్థానంలో ఇయాన్ హుమ్

రెండోస్థానంలో ఇయాన్ హుమ్

2014లో కేరళ బ్లాక్ బస్టర్స్ ప్లేయర్‌గా రెప్పపాటులో ఐఎస్ఎల్ ట్రోఫీ మిస్ చేసుకున్న ఇయాన్ హుమ్ ఈ ఏడాది చాంపియన్లుగా అట్లెటికో డి కోల్‌కతా ప్లేయర్‌గా ఈ సారి సంత్రుప్తి చెందాడు. ఈ ఏడాది టోర్నీలో ఏడు గోల్స్ సాధించిన ఈ కెనడియన్ స్ట్రయికర్.. జట్టులోనే అత్యధిక గోల్స్ చేసి చాంపియన్ గా ఎటికెను నిలపడంలో కీలకపాత్ర పోషించాడు. ముంబై సిటీ ఎఫ్ సి జట్టుతో జరిగిన తొలి సెమీ ఫైనల్స్ మ్యాచ్‌లో ఎటికె విజయం సాధించి ఫైనల్స్ కు అర్హత దిశగా ముందడుగు వేయడంలో ప్రధాన పాత్ర పోషించాడు.

కేరళలో సికె వినీత్ బెస్ట్

కేరళలో సికె వినీత్ బెస్ట్

ప్రస్తుత సీజన్‌లో కేరళ బ్లాక్ బస్టర్స్ జట్టుకు కీలక ప్లేయర్‌గా నిలిచాడు. జట్టును ఫైనల్స్‌కు తీసుకెళ్లడంలో సికె వినీత్ దే కీలకం. ఎఎఫ్ సి ఫైనల్స్ నుంచి తిరిగొచ్చాక వినీత్ కేరళ జట్టు తరుపున రెండో సీజన్‌లో తొమ్మిది మ్యాచ్‌ల్లోనే ఐదు గోల్స్ సాధించాడు. మరొక గోల్ చేయడంలో అసిస్టెన్స్ అందించాడు. చెన్నైయిన్ ఎఫ్ సి జట్టుకు వ్యతిరేకంగా జరిగిన మ్యాచ్ లో విజయం సాధించడంలోనే ఆయనది ప్రధాన పాత్ర.

గోవాకే బెస్ట్ రాఫెల్ కొయెల్హో

గోవాకే బెస్ట్ రాఫెల్ కొయెల్హో

ఐఎస్ఎల్ టోర్నీలో ఎఫ్ సి గోవా జట్టు పూర్తిగా వెనుకబడినా ఆ టీం ప్లేయర్ రాఫెల్ కొయెల్హో బెస్ట్ అనిపించుకున్నాడు. ఈ బ్రెజిలియన్ ఫార్వర్డ్ ప్లేయర్ ఐదుసార్లు గోల్స్ చేశాడు. రెండు అసిస్టెన్స్‌లు అందించాడు. చెన్నైయిన్ జట్టుకు వ్యతిరేకంగా జరిగిన మ్యాచ్‌లో గోవా సాధించిన ఐదు గోల్స్‌లో రెండు రాఫెల్ చేసినవే.

ఢిల్లీ అటాకింగ్‌లో గాడ్జె బెస్ట్

ఢిల్లీ అటాకింగ్‌లో గాడ్జె బెస్ట్

ఈ దఫా ఢిల్లీ జట్టులో తీవ్రస్థాయిలో అటాకింగ్ చేయడంలో కీలక పాత్ర రిచర్డ్ గాడ్జె. ఈ ఏడాది ఐదు గోల్స్ చేసి, నాలుగు అసిస్టెన్స్ చేశాడు. ప్రత్యర్థి జట్టుకు ప్రధాన ముప్పుగా పరిణమించాడంటే అతిశేయోక్తి కాదు. న్యూఢిల్లీలోనే ముంబై సిటీతో జరిగిన మ్యాచ్‌‌ను 3 - 3 స్కోర్ తో డ్రా‌గా ముగించడంలో కీలకపాత్ర పోషించాడు.

ముచ్చటగా మూడో సీజన్‌లోనూ ముంబై హ్యాట్రిక్

ముచ్చటగా మూడో సీజన్‌లోనూ ముంబై హ్యాట్రిక్

ముంబై హెడ్ కోచ్ అలెగ్జాండ్రీ గుమారెస్ మార్గదర్శకత్వంలో తొలిసారి జట్టును సెమీ ఫైనల్స్ దశకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు సారథి డియాగో ఫోర్లాన్. ముంబైకర్ల కోసం ఐదు గోల్స్ చేయడంతోపాటు మరో మూడు అసిస్టెన్స్‌లు అందించాడు. కేరళ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ గోల్స్ సాధించడం హైలేట్. ఇంతకుముందు 2014లో అండ్రె మోరిట్జ్, గతేడాది సునీల్ ఛెత్రి ముంబై జట్టులో హ్యాట్రిక్ సాదించిన ప్లేయర్లుగా నిలిచారు.

పుణెలో అనిబల్ టాప్ స్కోరర్

పుణెలో అనిబల్ టాప్ స్కోరర్

ఎఫ్ సి పుణె జట్టులో ఐదు గోల్స్ సాధించిన టాప్ స్కోరర్ అనిబల్ రోడ్రిగ్జ్. నూతన కోచ్ అంటోనియో హబాస్ సారథ్యంలో జరిగిన ప్రతి మ్యాచ్ లోనూ సహచర ప్రత్యర్థుల నుంచి చేయూతనిచ్చే వారు లేక జట్టు ముందడుగు వేయలేకపోయింది. ఫ్రీ కిక్ ల ద్వారా ఇతరులకు భిన్నంగా రెండు గోల్స్ సాధించాడు.

డుడు, ఎమిలియానో చెరో ఐదు గోల్స్

డుడు, ఎమిలియానో చెరో ఐదు గోల్స్

చెన్నైయిన్ ఎఫ్ సి టాప్ స్కోరర్ గా నిలిచిన డుడు మిగతా ప్లేయర్ల కంటే భిన్నంగా టోర్నీలో చెలరేగిపోయిన ప్లేయర్. మూడు సెషన్లలో మూడు జట్లకు ప్రాతినిధ్యం వహించిన ప్లేయర్ కూడా. నార్త్ఈస్ట్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో హ్యాట్రిక్ గోల్స్ తో మ్యాచ్ ఫలితాన్ని డ్రాగా ముగించాడు. నార్త్ఈస్ట్ అటాకింగ్‌లో ఎమిలియానో అల్ఫారో ముందు ఉన్నాడు. ఐదుగోల్స్ సాధించిన ఈ ఉరుగ్వేయర్ ప్లేయర్ ప్రారంభంలో నార్త్ఈస్ట్ జట్టును దూకుడుగా ముందుకెళ్లడానికి దోహద పడ్డాడు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+