Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐఎస్ఎల్: హేమాహేమీలు.. టాప్‌ ప్లేయర్స్ వీరే

ముంబై: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) 3 ఎడిషన్‌ ప్రారంభమై అప్పుడే రెండు వారాలు దాటుతున్నది. కొన్ని టీంలు రెండుసార్లు, మరికొన్ని ఒక్కోసారి తమ ప్రత్యర్థులతో తలపడిన ఈ టోర్నీ కోసం 18 వేల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. 13 వేలకు పైగా టీంలు సృష్టించబడటం ఐఎస్‌ఎల్‌కు అభిమానులకు ఉన్న ఫాంటసీని తెలియచేస్తున్నది.

ప్రారంభం నుంచే మూడో ఎడిషన్‌ టోర్నీ టఫ్‌గా ఉంటుందని తేలిపోయింది. నిలకడ గల ఆటగాళ్లతో ఆయా జట్లు నువ్వానేనా అన్నట్లు ముందుకు సాగుతున్నాయి. వారిలో బెస్ట్‌ టాలెంట్‌ ప్రతిభ కనబరిచిన ఆటగాళ్ల ఫెర్పార్మెన్స్‌ ఒకసారి గమనిద్దాం..

రోబర్టో వొల్పాటో: ముంబై సిటీ ఎఫ్‌సి క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ బ్రెజిలియన్‌ గోల్‌ కీపర్‌ జట్టుకు బెస్ట్‌ షాట్‌ స్టాపర్‌గా నిలిచాడు. ఆయన గోల్‌పోస్ట్‌లో ఇంతవరకు ప్రత్యర్థి జట్లు గోల్‌చేయలేక పోయాయంటే అతిశేయోక్తి కాదు. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో జట్టును ఏడుసార్లు రక్షించుకోగలిగాడు. గోల్‌పోస్ట్‌ వద్ద కాచుకుని కూచునే రోబర్టో ఈ సీజన్‌కు అత్యంత సమర్థుడైన ప్లేయర్‌ కమ్‌ గోల్‌ కీపర్‌. రెండు గేమ్స్‌లోనే వొల్పాటో 15 పాయింట్లు చేజిక్కించుకుని ఇతర కీపర్లకంటే బెస్ట్‌గా నిలిచాడు.

Top performers after two rounds of ISL Fantasy 2016

సేనా రాల్టే: గత ఏడాది చాంపియన్‌ చెన్నైయిన్‌ ఎఫ్‌సి తరుఫున ప్రాతినిధ్యం వహించిన ఈ సీజన్‌లో ముంబై సిటీ ఎఫ్‌సికి దన్నుగా నిలిచాడంటే ఆశ్చర్యమేమీ లేదు. ఫోర్లాన్‌ జట్టుకు డిఫెన్స్‌లో పూర్తి అర్థాన్ని అందించాడు. ఇప్పటివరకు ఒక్క గోల్‌ కూడా చేయకున్నా.. రెండు గేమ్స్‌లోనే 17 పాయింట్లతో మిగతా డిఫెండర్లతో పోలిస్తే ముందు వరుసలో నిలిచాడు. ఎప్పటికప్పుడు ప్రత్యర్థిపై అటాకింగ్‌ కోసం మధ్యలోనే దూరిపోవడం ఇతని సహజ లక్షణం.

జావీ లారా: అట్లెటికో డీ కోల్‌కతా క్లబ్‌లో అత్యంత స్ఫూర్తిదాయక ప్లేయర్‌. తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించిన ఈ స్పానిష్‌ అటాకర్‌ వల్ల కోల్‌కతా జట్టుకే పెద్ద దిక్కు. ప్రత్యర్థి జట్టు డిఫెన్స్‌ను బద్దలు కొట్టేందుకు అడ్వెంచరిక్‌ వింగ్‌ ఆట ఆడేందుకు వెనుకాడడు. గోల్‌ సాధించిన టేస్ట్‌ను రుచి చూసిన లారా.. 17 వ్యక్తిగత పాయింట్లతో ఇతర జట్ల మిడ్‌ ఫీల్డర్ల కంటే మెరుగ్గా ఆడుతున్నాడు.

మాటియాస్‌ డెఫెడెరికో: ముంబై సిటీ ఎఫ్‌సి బెస్ట్‌ మిడ్‌ ఫీల్డర్‌ ఇతగాడు. ఐఎస్‌ఎల్‌ 3 సీజన్‌లోనే అత్యధిక పాయింట్లు పొందిన మిడ్‌ఫీల్డర్‌. కోల్‌కతా లారా కంటే కూడా బెస్ట్‌ ప్లేయర్‌గా గుర్తింపు సాధించుకున్న అర్జెంటీనా కుర్రాడు ఐఎస్‌ఎల్‌ టోర్నీలో ఆడటం ఇదే తొలిసారి. బంతిపై ట్రిక్కులన్నీ ప్రయోగించి క్లినికల్‌ షాట్‌తో గోల్‌పోస్ట్‌కు పంపడం ఈయన స్పెషాలిటీ. 19 పాయింట్లకు ఎక్కువగా గెలుచుకున్న మాటియాస్‌.. ఈ సీజన్‌లోనే మిగతా వాళ్ల కంటే డిఫరెంట్‌గా నిలువనున్నాడు.

మార్సెలిన్హో: ఐఎస్‌ఎల్‌లో ఆరంగ్రేటంచేసిన ఈ బ్రెజిలియన్‌.. ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నైయిన్‌పై 3 - 1 స్కోర్‌ తేడాతో ఢిల్లీ డైనమోస్‌ సంచలన విజయానికి కారకుడయ్యాడు. పిచ్‌లో వెనుక బాగాన నిలుస్తూ తన ఇంద్రజాల ప్రతిభతో ప్రత్యర్థి జట్టు సూపర్‌ మచన్స్‌ (చెన్నైయిన్‌)కు చుక్కలు చూపించాడు. డైనమోస్‌కు లివర్‌వైర్‌గా భావిస్తున్న మార్సెలిన్హో వ్యక్తిగతంగా సగటున తొమ్మిది పాయింట్లు సాధించాడు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+