Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐఎస్ఎల్: ఆ నలుగురు అణిముత్యాలే!

న్యూఢిల్లీ: ఐఎస్ఎల్ 3 ఎడిషన్ ఎనిమిదో రౌండ్‌లోగానీ అంటే లీగ్ సగభాగం పూర్తయిన తర్వాత పుణె, గోవా శుభారంభాన్ని అందుకున్నాయి. గోల్ స్కోరింగ్‌లో ఎమిలియానో అల్ఫారో, మార్సిలిన్హో వంటి వారు చెలరేగిపోయారు. తద్వారా వారిద్దరూ స్కోరింగ్ చార్ట్‌లో టాప్ ప్లేస్ సాధించారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో పోలిస్తే కొద్దిమంది ప్రతిభావంతులైన దేశీయ ఆటగాళ్లు విదేశీ ఆటగాళ్లకంటే మెరుగైన పెర్పార్మెన్స్ కనబరుస్తున్నారు. వారిలోని ప్రతిభ స్ఫూర్తిదాయకంగా కనిపిస్తున్నది. ఈ సీజన్‌లో యువత ఫాంటసీల్లో కరంజిత్ సింగ్ (చెన్నైయిన్), మెహ్రాజుద్దీన్ (చెన్నైయిన్), మిలాన్‌సింగ్ (ఢిల్లీ), జెజె లాల్పెఖౌలా (చెన్నైయిన్) అణిముత్యాలుగా మెరుస్తున్నారు. వారి ప్రతిభా పాటవాలు.. యువత ఫాంటసీల్లో వారికి ఉన్న విలువ, రేట్ ఒకసారి పరిశీలిద్దాం..

కరంజిత్ సింగ్ విలువ రూ.5.2 కోట్లు

నార్త్ఈస్ట్ యునైటెడ్ ఎఫ్ సి గోల్ కీపర్ సుబ్రతాపాల్ గాయంతో టోర్నీకి దూరంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తదుపరి మెరుగైన జాతీయ గోల్ కీపర్ అంటే టక్కున కరంజిత్ సింగ్ పేరే వినిపిస్తుంది. మ్యాచ్ వారీగా అతడే టాప్ స్థానంలో నిలిచాడు. అట్లెటికో డీ కోల్‌కతా గోల్ కీపర్ దెబ్జిత్ మజుందార్ 27 పాయింట్లు పొందితే కరంజిత్ సింగ్ రెండు పాయింట్లు అదనంగా కలిగి ఉన్నాడు.

కానీ చెన్నై గోల్ కీపర్ కరంజిత్ సింగ్‌తో పోలిస్తే దేబ్జిత్ మజుందార్ నాలుగు మ్యాచ్ లలో ఆడాడు. కరంజిత్ ప్రస్తుత సీజన్‌లో మూడు మ్యాచ్‌ల్లో పాల్గొన్నా ఇంకా శుభారంభాన్నే అందుకోలేదు కానీ మూడు క్లీన్ చిట్‌లు పొందాడు.

15 సార్లు జట్టును కాపాడిన కరంజిత్ సింగ్ బ్యాకప్ గోల్ కీపర్ అంటే అతిశేయోక్తి కాదు. ఒకవేళ మీరు ఫాంటసీ ఐఎస్ఎల్ టీంను ఎంచుకుంటే తప్పక అందులో కరంజిత్‌కు చోటు కల్పించాల్సిందే.

Top domestic performers in ISL Fantasy 2016

రూ.6.1 కోట్లు పలుకుతున్న మెహ్రాజుద్దీన్ వాడో

దేశీయ డిఫెండర్లలో మెహ్రాజుద్దీన్ వాడో, సేనా రాల్టే అత్యధికంగా 40 స్కోర్ పాయింట్లు సాధించిన ప్లేయర్లు. చెన్నైయిన్ రైట్ బ్యాక్ ప్లేయర్‌గా ఉన్న మెహ్రాజుద్దీన్ వాడో ఒక మ్యాచ్‌లో తక్కువగా ప్రాతినిధ్యం వహించినా 2015 సీజన్‌లో కొనసాగించిన దూకుడును యథాతథంగా కొనసాగించాడు. తనకు గల పేరు ప్రతిష్ఠలను యథాతథంగా ముందుకు తీసుకెళుతూ జాతీయ ప్లేయర్లలో లీగ్ లోనే అత్యంత సుస్థిర పెర్పార్మెన్స్ ప్రదర్శిస్తున్న ఆటగాడిగా నిలిచాడు.

సూపర్ మచన్స్‌కు మూడు క్లీన్‌చిట్‌లు సాధించిన మెహ్రాజుద్దీన్ వాడో ఈ ఏడాది కూడా ఒక గోల్ చేశాడు. ఈ ఏడాది ప్రారంభంలో హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న వాడో.. చెన్నైయిన్ కోసం 12 బంతులను నిలువరించాడు. దీంతో యువత ఫాంటసీ టీమ్‌ల్లో వాడో ధర రూ.6.1 కోట్లు పలుకుతోంది.

మిడ్ ఫీల్డ్‌లో మిలాన్‌సింగ్ బెస్ట్
ఢిల్లీ డైనమోస్‌కు చెందిన మిలాన్ సింగ్ దేశీయ మిడ్ ఫీల్డర్లలోనే బెస్ట్ ప్లేయర్ గా నిలిచాడంటే అతిశేయోక్తి కాదు. ఈ ఏడాది ప్రారంభం నుంచి సవ్యసాచిలా 25 పాయింట్లు సాధించిన మిలాన్ సింగ్.. డైనమిక్ లయన్స్ మిడ్ ఫీల్డర్‌గా అటాకింగ్, డిఫెన్స్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు.

ఈ ఏడాది ప్రత్యర్థి జట్లు గోల్ పోస్ట్‌కు పంపిన 15 బంతులను సేవ్ చేసి ఢిల్లీ డైనమోస్ ను కాపాడిన మిలాన్ సింగ్.. పుణెతో జరిగిన మ్యాచ్ 1 - 1 స్కోర్‌తో డ్రాగా ముగించడంలో కీలక పాత్ర పోషించాడు. 24 ఏళ్ల ఈ కుర్రాడు ప్రతి పాసింగ్ గేమ్‌లోనూ బంతులు పాస్ చేస్తూ ప్రస్తుత సీజన్‌లో 'ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు'ను గెలుచుకున్నాడు. దీంతో ఫాంటసీ మార్కెట్‌లో మిలాన్ సింగ్ రూ.5.2 కోట్ల ధరకు అందుబాటులో ఉన్నాడు.

చెన్నై సంచలనం జెజె

ఐఎస్ఎల్‌లోనే సంచలనంగా జెజె లాల్పెఖౌలా నిలిచాడు. అందుకు అనుగుణంగానే ఫాంటసీ మార్కెట్‌లో ఎకాఎకీన రూ.9.6 కోట్లు పలుకుతున్నది. పసిడితో పోల్చదగ్గ వ్యక్తిత్వం, ప్రతిభ కల జెజె.. దేశీయ ప్లేయర్లలో అత్యధికంగా స్కోర్ సాధించాడు. ఐఎస్ఎల్ చరిత్రలోనే జెజె.. రెండు గోల్స్, రెండు అసిస్టెన్స్‌లతో ఏకంగా 35 పాయింట్లు పొందాడు.

సరైన సమయంలో బంతిని హిట్ చేస్తూ డిఫెండింగ్ చాంపియన్లకు అసలు సిసలు ప్రతినిధిగా ఉన్న జెజెను యువత ఫాంటసీ జట్టులోకి ఎంపిక చేసుకోవడం తప్పనిసరి. ఈ ఏడాది రెండుసార్లు హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు ఎంపికయ్యాడంటే ఆయన సత్తా ఏమిటో అవగతమవుతూనే ఉన్నది.

Story first published: Tuesday, November 14, 2017, 10:06 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+