For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మనోళ్లు విదేశీయులకంటేం తీసిపోరు

ఐఎస్ఎల్ 3 ఎడిషన్ టోర్నీల్లో పిచ్‌పై చురుగ్గా కదలడంలో.. ఎక్కువ సమయం ఫీల్డ్‌లో దూకుడుగా ఉండే విషయంలో దేశీయ, విదేశీ ఆటగాళ్ల మధ్య అంతరాయం గణనీయ స్థాయిలో తగ్గుముఖం పట్టింది.

న్యూఢిల్లీ: ఐఎస్ఎల్ 3 ఎడిషన్ టోర్నీల్లో పిచ్‌పై చురుగ్గా కదలడంలో.. ఎక్కువ సమయం ఫీల్డ్‌లో దూకుడుగా ఉండే విషయంలో దేశీయ, విదేశీ ఆటగాళ్ల మధ్య అంతరాయం గణనీయ స్థాయిలో తగ్గుముఖం పట్టింది. అసాంతం లీగ్‌లో టాప్ 10 ప్లేయర్లలో ఇద్దరు మాత్రం పూర్తిగా పిచ్ పై తిరుగాడుతూ విజయావకాశాల కోసం తహతహలాడారు. టాప్ 10 ప్లేయర్లలో దేశీయ ఆటగాళ్లు నలుగురు చోటు దక్కించుకున్నారు. ప్రతిభ ఆధారంగా దేశీయ ఆటగాళ్లలో టాలెంట్ వెలికితీసేందుకు ఇది దోహద పడుతుందనడంలో సందేహం లేదు. టాప్ 10 ప్లేయర్లు ఎలా ఆడారో ఒకసారి పరిశీలిద్దాం:

బహుముఖ ప్రజ్నాశాలి సౌవిక్ చక్రవర్తి

ప్రస్తుత సీజన్‌లో తొలి నుంచి చెలరేగిపోతున్న ఢిల్లీ డైనమోస్ జట్టులో సౌవిక్ చక్రవర్తి ఒక బహుముఖ ప్రజ్నగల డిఫెండర్. తన జట్టు కోసం ప్రతి క్షణం కూడా పిచ్ పోరాడేందుకే ప్రాధాన్యం ఇచ్చాడు. పటిష్టమైన వ్యూహ అమలులో బ్యాక్ ఫోర్ టీంలో అంతర్భాగంగా వ్యవహరించాడు. విడదీయడానికి అవకాశం లేకుండా విశ్వసనీయతను పెంపొందించుకున్న ప్లేయర్ అంటే అతిశేయోక్తి కాదు. ఆయన పెర్పార్మెన్స్‌పై ఢిల్లీ హెడ్ కోచ్ జియాంలుకా జంబ్రొట్టా పెట్టుకున్న ఆశలు ఎప్పుడూ వమ్ము కాలేదు. కేరళ బ్లాక్ బస్టర్స్‌తో జరిగే సెమీ ఫైనల్స్‌లో షౌవిక్ చక్రవర్తి కీలక పాత్ర పోషించనున్నాడు.

సెంటర్ బ్యాక్‌లో సందేశ్ జిగ్నాస్ కీలకం

తొలి ఎడిషన్ టోర్నీ నుంచి ఆడుతున్న సందేశ్ జిగ్నాస్ ఎల్లవేళలా సెంటర్ బ్యాక్ విభాగంలో కీలకమే. ప్రస్తుత సీజన్‌లోనూ మొక్కవోని దీక్షతో అదే వ్యూహాన్ని స్థిరంగా అమలుచేస్తూ క్లిష్టతరమైన సమయాల్లోనూ సమర్థవంతంగా వ్యవహరించాడు. ముంబైపై జరిగిన మ్యాచ్ లో 5 - 0 తేడాతో ఓటమి పాలైనప్పడు కోచ్ స్టీవ్ కొప్పెల్ సబ్ స్ట్యూట్‌గా జిగ్నాస్ పంపడంతోనే ఆయనకు ప్రాధాన్యం లభిస్తున్నది. జిగ్నాస్ మాదిరిగానే సెడ్రిక్ హెంగ్బార్ట్ సైతం బ్యాక్ విభాగంలో కీలకం. ముఖ్యమైన వ్యూహం అమలులోనూ, క్లియరెన్స్ లోనూ, స్కోర్ సాధించడంలో రెండుసార్లు హెంగ్బార్ట్ పాత్రే కీలకమైంది. మొత్తం లీగ్ దశలో ఒక్కసారి మాత్రమే హెంగ్బార్ట్ కు సబ్ స్ట్యూట్ ప్లేయర్ ను పంపే పరిస్థితి నెలకొంది.

 Top-10 players to have clocked maximum minutes in Hero ISL 2016

ముంబై డిఫెన్స్ గుండెకాయ లుసియాన్ గోయాన్

ముంబై డిఫెన్స్ వ్యూహం అమలులో గుండెకాయ మాదిరిగా వ్యవహరించే లుసియాన్ గోయాన్ కనీసం తొమ్మిది గోల్స్ సాధించడంలో సహకరించి లీగ్ రికార్డు నెలకొల్పాడు. అంతేకాదు ఎనిమిది క్లీన్ షీట్లు సాధించాడు. తన వ్యక్తిగత ఖాతాలో సింగిల్ గోల్ మాత్రమే సాధించినా ప్రత్యర్థి వ్యూహాలను ఎదుర్కోవడంలోనూ, జోక్యం చేసుకోవడంలోనూ ముందున్నాడు. లుసియాన్ గోయాన్ మాదిరే క్రిస్టియాన్ వాడోక్జ్ మిడ్ ఫీల్డ్ విభాగంలో మెయిన్ ప్లేయర్ అంటే అతిశేయోక్తి కాదు. క్లినికల్ పాస్, ఫినిషింగ్ తోపాటు మూడు గోల్స్ తన ఖాతాలో జమచేసుకున్నాడు. పిచ్ పై అవకాశాలను కల్పించడంలోనూ ముందు వరుసలోనే ఉంటాడు.

అసిస్టెన్స్‌లో జొన్నాథన్ బెస్ట్

ఎఫ్ సి ఫుణె జట్టు నాకౌట్ దశకు అర్హత సాధించకపోయినా పిచ్ మధ్యలో జొన్నాథన్ లుక్కా కీలక పాత్ర పోషించాడు. ఢిల్లీ డైనమోస్ ద్వయం మార్సెలిన్హో, ఫ్లోరెంట్ మాలౌదాలతోపాటు సహచర ప్లేయర్లకు అసిస్టెన్స్‌లో ముందు ఉన్న ప్లేయర్ జొన్నాథన్. ప్రస్తుత సీజన్‌లో ఐదు అసిస్టెన్స్‌లు అందించాడు. నార్త్ఈస్ట్, కేరళ బ్లాక్ బస్టర్స్ పై జరిగిన మ్యాచ్‌ల్లో జట్టు విజయానికి తన వంతు పాత్ర పోషించాడు.
బెస్ట్ గోల్ కీపర్ దెబ్జిత్
ఢిల్లీ సారధి ఫ్లోరెంట్ మాలౌదా పెనాల్టీ కార్నర్‌ను అడ్డుకోవడంతోపాటు ప్రతి లీగ్ మ్యాచ్‌లోనూ జట్టును సేవ్ చేయడంలో చాలా కీలకపాత్ర పోషించాడు. తొలి ఎడిషన్ నుంచి అద్బుతమైన ఆటతీరుతో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుత సీజన్‌లో చివరిగా పుణెతో జరిగిన లీగ్ మ్యాచ్‌కు మాత్రమే దేబ్జిత్ దూరంగా ఉన్నాడు.

సూపర్ మాచన్ల హర్ట్ వాడో

మూడోసారి చెన్నైయిన్ జట్టును సెమీ ఫైనల్స్ కు తీసుకెళ్లలేకపోయినా డిఫెండర్ మెహ్రాజుద్దీన్ వాడో జట్టుకు గుండెకాయ వంటి వాడు. తన వంతుగా డిఫెన్సివ్ విధులు నిర్వహించడంలో తన శక్తి సామర్థ్యాలు రుజువు చేసుకున్నాడు. స్కోరింగ్ లోనూ, అసిస్టెన్స్ లోనూ ముందుంటాడు. తద్వారా మార్కో మాట్టరాజీ శిష్యుడిగా కొన్ని పాజిటివ్ అంశాలు అతడిలో ఇమిడి ఉన్నాయి.

టాప్ ప్లేయర్లలో పుణె సారధికే చోటు

నాకౌట్ దశకు చేరుకున్న టాప్ 4 జట్ల సారధులకు బదులు అత్యుత్తమ ఆటతీరు, ప్రతిభ కనబరిచిన టాప్ 10 ప్లేయర్లలో పుణె సారధి మహ్మద్ సిస్సోకోకు దక్కింది. జట్టు నాకౌట్ దశకు చేరుకోకున్నా అటాకింగ్, డిఫెన్స్‌లో సిస్సోకో సేవలు అమూల్యమే. మహ్మద్ సిస్సోకోలో కొన్ని పాజిటివ్ అంశాల్లో ప్రస్తుత సీజన్‌లో ఆయన సాధించిన రెండు గోల్స్ కూడా ఉన్నాయి. పుణె గోల్ కీపర్‌గా ఎడెల్ బెటె అనునిత్యం పిచ్ పై చెలరేగిపోయేవాడు. ప్రస్తుత సీజన్ లో అత్యధిక సేవ్ (46)లు ఆయన ఖాతాలోనే అంటే ఎంత ప్రతిభావంతుడో అర్థమవుతూనే ఉన్నది.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+