Fifa World Cup 2022 : ఫిఫా వరల్డ్ కప్ కోసం.. ఫైటర్ జెట్ల మధ్య కతార్ చేరిన పోలండ్ టీం!

ప్రపంచంలో అత్యథిక దేశాలు ఆసక్తిగా ఎదురు చూసే ఫిఫా వరల్డ్ కప్‌కు వేదిక సిద్ధమైంది. కతార్ వేదికగా జరిగే ఈ టోర్నీ కోసం అన్ని దేశాల జట్లు ఒకటొకటిగా ఇక్కడకు చేరుకుంటున్నాయి. అదే సమయంలో ఉక్రెయిన్‌కు దగ్గరగా ఉన్న ఒక పోలండ్ గ్రామంపై మిసైల్స్ దాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు పోలండ్ వ్యక్తులు మరణించారు. దీంతో పోలండ్ ఫుట్‌బాల్ టీంకు రక్షణ కావలసి వచ్చింది.
ఉక్రెయిన్ యుద్ధం
దాదాపు పది నెలలపైగా ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధాన్ని ఆపేందుకు జరిగిన చర్చల్లో ఏవీ పూర్తిగా సఫలం కాలేదు. దీంతో ఇది కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో రష్యాపై పశ్చిమ దేశాలు కఠిన ఆంక్షలు విధించాయి. అయినా సరే రష్యా వెనక్కు తగ్గలేదు. ఉక్రెయిన్‌తో తాము యుద్ధం చేయడం లేదని, ఇది కేవలం స్పెషల్ సైనిక చర్య మాత్రమేనని రష్యా వాదిస్తోంది.
ఫైటర్ జెట్ల రక్షణ
ఆ యుద్ధం నేపథ్యంలోనే ఉక్రెయిన్‌ను ఆనుకొని ఉన్న పోలండ్ గ్రామంపై కూడా దాడి జరిగింది. దీంతో ఆటగాళ్ల భద్రతపై ఆందోళన చెందిన పోలండ్ ప్రభుత్వం రక్షణ దళాలను రంగంలోకి దింపింది. రెండు ఫైటర్ జెట్ విమానాలు పోలండ్ ఆటగాళ్ల విమానానికి భద్రతగా వచ్చి కతార్‌లో వారిని దింపాయి. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్న పోలండ్ ఫుట్‌బాల్ టీం.. 'థాంక్యూ అండ్ గ్రీటింగ్స్ టు ది పైలట్స్' అని పోస్టు చేసింది.
పోలండ్ షెడ్యూల్ ఇదే
ఎఫ్16 ఫైటర్ జెట్ల మధ్య కతార్‌లో దిగినట్లు సోషల్ మీడియాలో వెల్లడించిన పోలండ్ జట్టు.. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రపంచకప్‌లో గ్రూప్-సీలో ఉన్న పోలండ్.. మంగళవారం నాడు తమ తొలి పోరులో మెక్సికోతో పోలండ్ తలపడుతుంది. ఆ తర్వాత నవంబరు 26న సౌదీ అరేబియాతో రెండో మ్యాచులో పోరాడుతుంది. ఇక చివరి గ్రూప్ మ్యాచ్‌లో అర్జెంటీనాతో ఢీకొంటుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications