Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తప్పుకోక తప్పదు.. కానీ ఇది నా నిర్ణయం కాదు

Timing of Arsenal departure not my decision, says Arsene Wenger

హైదరాబాద్: ప్రీమియర్ లీగ్ ఫుట్‌బాల్ క్లబ్‌ల్లో ఒక్కటైన అర్సెనల్ కోచ్ కం మేనేజర్ ఆర్సెన్ వింగర్ జట్టు నుంచి నిష్క్రమించాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించాడు. కానీ ఇది తన నిర్ణయం కాదన్నారు. ప్రీమియర్ లీగ్ క్లబ్ అర్సెనల్ జట్టుతో తనకు సమారు 22 ఏళ్ల అనుబంధం ఉన్నదని తెలిపారు. నార్త్ లండన్ పరిధిలోని ఆర్సెనల్ క్లబ్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్న అర్సెనల్ వింగర్ కాంట్రాక్టు ముగియడానికి ఒక ఏడాది ముందే ఈ సీజన్ ముగిసే సమయానికి ఎమిరేట్స్ వెళ్లనున్నట్లు గతవారం ప్రకటించాడు.

నిష్క్రమణ సొంత నిర్ణయం కాదన్న ఆర్సెన్ వింగర్

నిష్క్రమణ సొంత నిర్ణయం కాదన్న ఆర్సెన్ వింగర్

‘నా నిష్క్రమణకు సంబంధించి నిజంగా తీసుకున్న నిర్ణయం స్వీయ నిర్ణయం కాదు' అని ఆర్సెన్ వింగర్ తెలిపాడు. ప్రస్తుతం తాను విశ్రాంతి దశలో ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం చాంపియన్స్ లీగ్, ప్రీమియర్ లీగ్ టోర్నీల్లో ఆర్సెనల్ జట్టు పేలవ ప్రదర్శనపై మద్దతుదారుల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నానని చెప్పాడు. దేశీయ ప్రీమియర్ లీగ్ టోర్నీలో అర్సెనల్ జట్టు ఆరో స్థానంలో నిలిచింది. ఇది పూర్తిగా గుడ్ బై చెప్పడమేమో అనేది కూడా తనకు సరిగ్గా తెలియదన్నాడు. అర్సెనల్ జట్టు సభ్యులు చాలా ప్రత్యేకమైన వారని కొనియాడాడు. తాను వారితో కలిసి ఫలితాలు సాధించాలని కోరుకున్నట్లు తెలిపాడు.

భవిష్యత్‌పై ఇప్పుడేమీ చెప్పలేనన్న ఆర్సెన్ వింగర్

భవిష్యత్‌పై ఇప్పుడేమీ చెప్పలేనన్న ఆర్సెన్ వింగర్

సీజన్ ముగిసిన తర్వాత ఫుట్‌బాల్‌తోనే తన అనుబంధం కొనసాగుతుందా? లేదా? అనే విషయం తనకు తెలియదని ఆర్సెన్ వింగర్ అన్నాడు. మరేదైనా జట్టుకు మేనేజర్‌గా వెళ్లాలనే విషయాన్ని తానిప్పుడే చెప్పలేనని ఆలోచించలేదని అన్నాడు. ‘నిజాయితీగా చెబుతున్నా. భవిష్యత్ లో నేనేం చేయగలనో నాకే తెలియదు. కొంతకాలం విశ్రాంతి తీసుకుంటానేమో? నేను పని చేయాలని మాత్రమే కోరుకుంటాను. ప్రస్తుత దశలో నా భవితవ్యం గురించి ఏమీ చెప్పలేను. ఆర్సెనల్ ఫుట్ బాల్ క్లబ్ కంటే మెరుగైన సేవలందిస్తానా? లేదా? చెప్పలేనని పేర్కొన్నాడు.

పీఎస్జీ స్టార్ మార్కో విర్రాట్టిపై మెస్సీ నజర్..

పీఎస్జీ స్టార్ మార్కో విర్రాట్టిపై మెస్సీ నజర్..

బార్సిలోనా ఫార్వర్డ్ ప్లేయర్ లియానెల్ మెస్సీ.. పారిస్ సెయింట్స్ జర్మైన్ స్టార్ ఆటగాడు మార్కో వెర్రాట్టి కోసం ఆశగా ఎదురు చూస్తున్నాడు. కానీ మార్కో వెర్రాట్టి మాత్రం ట్రాన్స్‌ఫర్ విండోలో రియల్ మాడ్రిడ్ జట్టులో చోటు దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుత సీజన్ లా లీగా టైటిల్ దాదాపుగా బార్సిలోనాకు దక్కనుంది. తర్వాతి స్థానంలో ఉన్న అట్లెంటికో మాడ్రిడ్ జట్టు 11 పాయింట్లు.. గోల్స్ మాంత్రికుడు క్రిస్టియానో రొనాల్డో కెప్టెన్సీలోని రియల్ మాడ్రిడ్ 15 పాయింట్లు వెనుకబడి ఉంది. దీంతో వేసవిలో తదుపరి సీజన్ ప్రారంభమయ్యే లోగా కొన్ని మార్పులు ఉంటాయని చెప్పాడు. వెర్రాట్టి కోసం ప్రయత్నిస్తున్నా నెరవేరే అవకాశాలు కనిపించడం లేదు. వివిధ జట్ల సభ్యులతో ట్రాన్స్ ఫర్.. తదితర కార్యక్రమాలను నిర్వహించేందుకు మెస్సీ.. వివాదాస్పదంగా మారిన మినో రాయోలాను తన ఏజంట్‌గా నియమించుకున్నాడు. ఇక ప్రస్తుత సీజన్‌లో రియల్ మాడ్రిడ్ ఆటతీరు చాలా పేలవంగా ఉన్నదని విమర్శలు ఉన్నాయి. రియల్ మాడ్రిడ్ కోచ్ కమ్ మేనేజర్ గా జినెడినె జిడానే కొనసాగినా వేసవిలో జట్టులో సమూల మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 బార్సిలోనా నుంచి ఆఫర్.. కొట్టి పడేసిన మార్కో వెర్రాట్టి

బార్సిలోనా నుంచి ఆఫర్.. కొట్టి పడేసిన మార్కో వెర్రాట్టి

ఇక బార్సిలోనా, రియల్ మాడ్రిడ్ జట్ల వైపు ద్రుష్టి సారించిన మార్కొ వెర్రాట్టి 2012 నుంచి పెస్కారా నుంచి పారిస్ సెయింట్ జైర్మన్ క్లబ్ తరఫున ఫుట్ బాల్ ఆడుతున్నాడు. జట్టు తరఫున 237 మ్యాచ్ ల్లో పాల్గొన్నాడు. తన భవిష్యత్ గురించి వదంతులు వినిపిస్తున్నా ఇంతకుముందు బార్సిలోనా ప్రయత్నాలు చేస్తున్నదని చెప్పాడు. బార్సిలోనాలో చేరాలని లియానెల్ మెస్సీ తన ఏజంట్ రాయోలా ద్వారా ప్రయత్నిస్తున్నట్లు వచ్చిన వార్తలను వెర్రాట్టి త్రోసిపుచ్చాడు. పీఎస్జీ జట్టు తరఫున ఒక ప్లేయర్ గా, వ్యక్తిగతంగా ఎదుగాలన్నదే తన అభిమతం అని చెప్పాడు. ఒక ఓటమితోనే కెరీర్ అంతా ముగిసిపోదుగా అని మార్కో వెర్రాట్టి వ్యాఖ్యానించాడు.

Story first published: Friday, April 27, 2018, 16:21 [IST]
Other articles published on Apr 27, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+