కరోనావైరస్ నేపథ్యంలో ఈ యూరోప్ ఫుట్‌బాల్ ప్లేయర్లు ఎలా టైంపాస్ చేస్తున్నారో చూడండి

ప్యారిస్ : ప్రపంచాన్ని కరోనావైరస్ గడగడలాడిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి వేలల్లో మృత్యువాత పడ్డారు. ఇక కొన్ని లక్షల మంది చికిత్స పొందుతున్నారు. కరోనావైరస్ ప్రభావంతో ఇటు వాణిజ్యరంగం కుదేలవుతుండగా అటు క్రీడారంగంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రధాన టోర్నీలన్నీ రద్దు కాగా చాలావరకు వాయిదా కూడా పడ్డాయి. దీంతో క్రీడాభిమానులు కాసింత నిరాశకు గురయ్యారు. ఇక కరోనావైరస్‌తో టోర్నమెంట్లు రద్దు అవుతుండటంతో ఆయా క్రీడలకు సంబంధించిన స్టార్ ఆటగాళ్లు మరోరకంగా టైం పాస్ చేస్తున్నారు.

ఇంటికే పరిమితమైన క్రీడాకారులు
తమ ఇళ్లల్లోని లాన్‌లో కొందరు క్రీడాకారులు అలా నడుస్తూ టైంపాస్ చేస్తుండగా ... మరికొందరు తమ పెంపుడు కుక్కలతో హాయిగా ఆటలాడుకుంటూ కనిపిస్తున్నారు. కొందరు తమ భార్యలకు వంట విషయంలో సహాయం చేస్తుండగా మరికొందరు టీవీ చూస్తూ టైంపాస్ చేస్తున్నారు. ఎప్పుడు ఏదో ఒక లీగ్‌లతో బిజీగా ఉండే ఫుట్‌బాల్ క్రీడాకారులు ఈ ఖాళీ సమయంలో అస్సలు ఒంటరిగా ఉండలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఏదో ఒక పనిచేస్తూ తమను తాము బిజీగా ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏప్రిల్ 3వరకు ప్రీమియర్ లీగ్‌లను వాయిదా వేయడంతో ఫుట్‌బాల్ ప్లేయర్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు.
ట్రెడ్ మిల్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసిన సర్జియో రామోస్
ఇక ఫుట్‌బాల్ క్రీడాకారులంతా తాము ఇళ్లల్లో ఎలా సమయం వెల్లదీస్తున్నది చెబుతూ వాటి వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. కొందరు మాత్రం ఎలాంటి పనిలేక చాలా బోర్ కొడుతోందంటూ పోస్టులు రాసుకొస్తున్నారు. రియల్ మాడ్రిడ్ బాస్కెట్ బాల్ జట్టులో ఒక ప్లేయర్‌కు కరోనావైరస్ లక్షణాలు కనిపించడంతో మిగతా జట్టుసభ్యులందరినీ ఐసొలేషన్ వార్డుకు పంపించారు. అయితే క్లబ్‌లోనే వారందరిని ఉంచడంతో వారు అక్కడే గేమ్స్ ఆడుతూ కనిపించారు. రియల్ మాడ్రిడ్ కెప్టెన్ సర్జియో రామోస్ తాను ట్రెడ్ మిల్ పై చేస్తున్న వ్యాయామం పోస్టు చేశాడు.
ఫుట్ బాల్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించిన మార్కో అసెన్సియో
ఇక గతేడాది గాయంతో ఫుట్‌బాల్ ఆటకు దూరమైన ప్లేయర్ మార్కో అసెన్సియో తాను గాయం నుంచి కోలుకుంటున్నట్లు అభిమానులకు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. తాను ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను పోస్టు చేసి అభిమానులతో పంచుకున్నాడు. ఓ స్టేడియంలో మార్కో ప్రాక్టీస్ చేస్తూ వీడియోలో కనిపించాడు. ఫుట్‌బాల్‌ను నేరుగా గోల్‌పోస్టులోకి కొడుతూ కనిపించాడు.
ట్రెడ్ మిల్ పై కరీం బెంజెమా
ఇదిలా ఉంటే మరో ఫ్రెంచ్ స్టార్ కరీం బెంజెమా కూడా తన వీడియోను పోస్టు చేశాడు. ట్రెడ్ మిల్‌పై ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను తను పోస్టు చేశాడు. తను చాలా ఖాళీగా ఉన్నట్లు చెప్పిన కరీం... ఏం చేయాలో తెలియక ఇలా ట్రెడ్ మిల్‌పై వ్యాయామం చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. తన పక్కనే పెంపుడు కుక్క కూడా ఉండటం విశేషం. ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది.
భార్యకు సహాయంగా సిరో
మరోవైపు సిరో భార్య జెస్సికా తన భర్త తనకు వంటల విషయంలో సహాయం చేస్తున్నాడని చెబుతూ ఉన్న వీడియోను పోస్టు చేసింది. జెస్సికా కేక్ తయారీ ఎలా చేయాలో చెబుతుండగా సిరో చేశాడు. కేక్‌ను మిక్స్ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications