Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మేం మల్టీ నేషనల్ టోర్నీలకు సిద్ధం: సునీల్ ఛెత్రి

There is more awareness about football now: Chhetri

హైదరాబాద్: ఫుట్‌బాల్ ఆట పట్ల ప్లేయర్లు, అభిమానుల్లో గతంతో పోలిస్తే చాలా అవగాహన పెరిగిందని ఫుట్‌బాల్ టీమిండియా కెప్టెన్ సునీల్ ఛెత్రి వ్యాఖ్యానించాడు. 100 మ్యాచ్ లకు మరో రెండు మ్యాచ్‌ల దూరంలో ఉన్న సునీల్ ఛెత్రి పోటీతో మీడియాతో మాట్లాడుతూ 'ఇప్పుడు చాలా అవగాహన పెరిగింది. ఇది కేవలం ఆటగాళ్లకు మాత్రమే పరిమితం కాలేదు. దేశ వ్యాప్తంగా ఉన్న అభిమానుల్లో, సాధారణ వ్యక్తుల్లోనూ విస్తరించింది' అని తెలిపాడు.

చైనీస్ తైపై జట్టుతో ఇండియా ఢీ

చైనీస్ తైపై జట్టుతో ఇండియా ఢీ

శుక్రవారం ఇంటర్ కాంటినెంటల్ కప్ ప్రారంభం సందర్భంగా చైనీస్ తైపై జట్టుతో భారత జట్టు తలపడనుంది. ‘ఆటగాళ్లు ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనే విషయాలపై పూర్తి పరిజ్ఞానం కలిగి ఉన్నారు. వారు తాము తీసుకునే పౌష్ఠికాహారం గురించి కూడా జాగ్రత్తలు వహించేందుకు ఆసక్తిగా ఉన్నారు' అని చెప్పాడు.

సోమవారం కెన్యాతో ఆడనున్న సునీల్ చెత్రి జట్టు

సోమవారం కెన్యాతో ఆడనున్న సునీల్ చెత్రి జట్టు

సికింద్రాబాద్‌కు చెందిన సునీల్ ఛెత్రి శుక్రవారం ముంబైలోని ఫుట్‌బాల్ ఎరీనాలో చైనీస్ తైపై జట్టుతో 99వ మ్యాచ్, జూన్ నాలుగో తేదీన కెన్యాపై జరిగే మ్యాచ్ లో 100వ మ్యాచ్‌లో పాల్గొననున్నాడు. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 56 గోల్స్ సాధించిన సునీల్ ఛెత్రి ఇక ముందు భారత జట్టు బహుళ దేశాల టోర్నమెంటులో ఆడేందుకు ఫిట్‌గా, సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు.

ఇండియన్ జట్టుకు కెప్టెన్ గౌరవధాయకం

ఇండియన్ జట్టుకు కెప్టెన్ గౌరవధాయకం

‘నేను శిక్షణాశిబిరానికి వచ్చినప్పుడు మిశ్రమ స్పందన లభించింది. మా జట్టులో ఆడే వారిలో కొందరు నెల రోజులుగా ఎటువంటి మ్యాచ్‌ల్లోనూ పాల్గొనలేదు' అని సునీల్ ఛెత్రి తెలిపాడు. ఏఎఫ్‌సీకప్ మ్యాచ్‌లో పాల్గొని నేరుగా ముంబై ఫుట్‌బాల్ ఎరీనాకు చేరుకున్నాడు సునీల్ ఛెత్రి. భారత దేశం తరఫున ఆడుతున్నందుకు గౌరవంగా ఉందని తెలిపాడు. వివిధ రకాల కోచ్‌లు, ఆటగాళ్లు, ఫిజియో థెరపిస్టులు, స్టాప్ మధ్య ఆడుతుండటంతో భారత జట్టుకు మెరుగైన సేవలందించినట్లవుతుంది‘ అని సునీల్ ఛెత్రి తెలిపాడు.

2020వరకు బెంగళూరు ఎఫ్‌సీతో నిషు, సెంబోయి కాంట్రాక్టు

2020వరకు బెంగళూరు ఎఫ్‌సీతో నిషు, సెంబోయి కాంట్రాక్టు

డిఫెండర్ నిషుకుమార్, స్ట్రైకర్ థోంగ్ ఖోసిం హావోకిప్ 2020 వరకు బెంగళూరు ఎఫ్ సీ జట్టుతోనే ఉండనున్నారు. ఎఎఫ్ సీ కప్ నాకౌట్ దశలో బెంగళూరు ఎఫ్ సీ జట్టులో కీలక పాత్ర పోషిస్తున్నారు. నిషు 26 మ్యాచ్‌లు ఆడి మూడు గోల్స్ చేశాడు. హావోకిప్ కేవలం ఏడు మ్యాచ్‌ల్లోనే మూడు గోల్స్ సాధించాడు. ఈ మేరకు నిషు కుమార్, థోంగ్ ఖోసిం హావోకిప్‌లతో కాంట్రాక్టుపై ఒప్పందం చేసుకున్నట్లు బెంగళూరు ఎఫ్‌సీ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా పేర్కొంది.

Story first published: Friday, June 1, 2018, 15:25 [IST]
Other articles published on Jun 1, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+