Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బ్రెజిల్ ను ఓడించి సెమీస్ కెళ్ళిన డచ్

Brazil's Kaka (R) vies Mark Van Bommel
పోర్ట్ ఎలిజబెత్: ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ టోర్నిలో నెదర్లాండ్‌ సెమీస్‌లో అడుగుపెట్టింది. శుక్రవారం సాయంత్రం పోర్ట్‌ ఎలిజబెత్‌లోని నెల్సన్‌ మండెలా బే స్టేడియంలో జరిగిన మొదటి క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో 2-1 తేడాతో నెదర్లాండ్‌ జట్టు బ్రెజిల్‌ను ఓడించింది. ఆట ప్రథమ భాగంలో బ్రెజిల్‌ తొలి గోల్‌ సాధించినప్పటికీ గోల్‌ చేయకుండా నెదర్లాండ్‌ జట్టును కట్టడి చేయలేకపోయింది. ఆట మొదటి అంకం తర్వాత నెదర్లాండ్‌ పుంజుకుని రెండు గోల్స్‌ సాధించి బ్రెజిల్‌ను మట్టి కరిపించింది.బ్రెజిల్, నెదర్లాండ్స్ మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్‌ నువ్వానేనా అన్నట్టుగా సాగింది. రెండు జట్లు ఆరంభం నుంచి ఎదురుదాడికి దిగాయి.

కానీ బ్రెజిల్‌ జోరందుకున్నాక నెదర్లాండ్స్‌ ఆటలు సాగలేదు. దుంగా బృందం వరుసపెట్టి గోల్‌ ప్రయత్నాలు చేస్తుంటే నిశ్చేష్ఠులవడం డచ్‌ డిఫెండర్ల వంతైంది. ఎనిమిదో నిమిషంలో ఫాబియానో నుంచి పాస్‌ అందుకున్న రాబిన్హో బంతిని నెట్లోకి పంపాడు. కానీ అతడు ఆఫ్‌ సైడ్‌లో ఉండడంతో గోల్‌ కాలేదు. కానీ.. రెండు నిమిషాల్లోనే బ్రెజిల్‌ మెరిసింది. ఫెలిప్‌ మెలో బంతిని అందుకున్న రాబిన్హో దాదాపు 20 గజాల దూరం నుంచి గోల్‌ కొట్టాడు. జట్టుకు 1-0 ఆధిక్యం అందించాడు. వెంటనే డచ్‌ పుంజుకునేందుకు చూసింది. కానీ దుర్భేద్యమైన బ్రెజిల్‌ డిఫెన్స్‌ను దాటి మందుకెళ్లడం ఆ జట్టు ఆటగాళ్ల తరం కాలేదు. 31వ నిమిషంలో కాకా బ్రెజిల్‌ను 2-0 ఆధిక్యంలో నిలిపేవాడే. కానీ అతడు కొట్టిన షాట్‌ను డచ్‌ గోల్‌కీపర్‌ స్టెకెల్‌బెర్గ్‌ అద్భుతంగా అడ్డుకున్నాడు. స్కోరు సమం చేసేందుకు ప్రథమార్ధంలో నెదర్లాండ్స్‌ పోరాడినా ఫలితం లేకపోయింది.

ద్వితీయార్ధం ఆరంభంలో హవా బ్రెజిల్‌దే. బంతిపై పట్టు వారిదే. కానీ ఒక చిన్న పొరపాటు మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేసింది. ఫెలిప్‌ మెలో చేసిన తప్పిదానికి సాంబా జట్టు భారీ మూల్యం చెల్లించుకుంది. స్నెడర్‌ క్రాస్‌ను గోల్‌ కాకుండా ఆపే ప్రయత్నంలో మెలో తలతో సెల్ఫ్‌ గోల్‌ చేశాడు. ఆ తర్వాత ఆధిపత్యం చేతులు మారింది. బ్రెజిల్‌ డిఫెన్స్‌ చెల్లాచెదురైంది. ఓడిపోతుందనుకున్న నెదర్లాండ్స్‌ విజయం దిశగా దూసుకెళ్లింది. అర్జెన్‌ రాబెన్‌ కొట్టిన కార్నర్‌ను స్నైడర్‌ (68వ) జట్టుకు గెలుపు గోల్‌గా మలిచాడు. ఆధిక్యం సమర్పించుకున్నామన్న బాధలో బ్రెజిల్‌ మరిన్ని తప్పులు చేసింది. రాబెన్‌ను ప్రమాదకరంగా అడ్డుకున్న ఫెలిప్‌ మెలో (73వ నిమిషం) రెడ్‌ కార్డు ఎదుర్కొని మ్యాచ్‌కు దూరమయ్యాడు. అప్పటికే ఒత్తిడిలో కూరుకుపోయిన బ్రెజిల్‌కు పది మందితో పోరాడడం కష్టమైంది. ఆఖరి నిమిషాల్లో నెదర్లాండ్స్‌పై గోల్‌ చేయలేక టోర్నీ నుంచి నిష్క్రమించింది.
Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+