Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

The Best FIFA Football Awards 2019: పూర్తి విజేతలు వీరే

The Best FIFA Football Awards 2019: Full List of Winners

హైదరాబాద్: అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ ఆరోసారి ఉత్తమ ఫిఫా ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని గెలుచుకున్నాడు. మిలన్‌లోని ఓపెరా హౌస్‌లో సోమవారం ఫిఫా అవార్డుల కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. ఉత్తమ మహిళా ఫిఫా ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని అమెరికాకు చెందిన మేగాన్ రాపినో గెలుచుకుంది.

ఈ ఏడాది జులైలో జరిగిన మహిళల వరల్డ్‌కప్‌లో మేగాన్ రాపినో సారథ్యంలోని అమెరికా జట్టు టైటిల్ విజేతగా నిలిచింది. ఇక, మహిళల కోచ్ అవార్డుని జిల్ ఇల్లీస్ సొంతం చేసుకుంది. ఈ మెగా టోర్నీలో మేగాన్ రాపినో ఆరు గోల్స్ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. ఈ టోర్నీలో అత్యధిక గోల్స్ చేసిన క్రీడాకారిణిగా కూడా నిలిచింది.

దీంతో గోల్డెన్ బూట్‌తో పాటు గోల్డెన్ బంతిని కూడా దక్కించుకుంది. ఇక, పురుషుల్లో మెస్సీతో పాటు ఈ అవార్డు కోసం పోర్చుగల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో, లివర్ పూల్ డిఫెండర్ విర్గిల్ వాన్ డిజిక్‌లు పోటీలో నిలిచారు. అయితే, ఫిఫా అభిమానులు మాత్రం ఈ అవార్డుని మెస్సీకే కట్టబెట్టారు.

గత సీజన్‌లో బార్సిలోనా జట్టుతో కలిసి స్పానిష్ లాలిగా టైటిల్ లియోనల్ మెస్సీ నెగ్గిన సంగతి తెలిసిందే. అన్ని పోటీల్లో కలిపి లియోనల్ మెస్సీ మొత్తం 58 గేమ్స్ ఆడి 54 గోల్స్ సాధించడంతో యూరోపియన్ లీగ్ గోల్డెన్ బూట్‌ని కూడా సొంతం చేసుకున్నాడు. మరోవైపు రొనాల్డో సైతం 55 గేముల్లో 54 గోల్స్ చేయడం విశేషం.

ఈ ఏడాది లివర్‌పూల్ జట్టుని ఛాంపియన్ లీగ్ టైటిల్ విజేతగా నిలబెట్టిన డిఫెండర్ విర్గిల్ వాన్ డిజిక్ కాదని మెస్సీకి ఈ అవార్డు ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సీజన్‌లో యూరోపియన్ ఉత్తమ ప్లేయర్ అవార్డుని సొంతం చేసుకున్న డిఫెండర్ విర్గిల్ వాన్ డిజిక్‌కే ఉత్తమ ఫిఫా ప్లేయర్ అవార్డు వరిస్తుందని అంతా భావించారు.

2019 సంవత్సరానికి ఫిఫా ఫుట్‌బాల్ అవార్డు విజేతలు వీరే:

పురుషులు: ఫిఫా ఉత్తమ ప్లేయర్

పురుషులు: ఫిఫా ఉత్తమ ప్లేయర్

క్రిస్టియానో రొనాల్డో

లియోనల్ మెస్సీ - విజేత

విర్లిగ్ వాన్ డిజిక్

మహిళలు: ఫిఫా ఉత్తమ ప్లేయర్

మహిళలు: ఫిఫా ఉత్తమ ప్లేయర్

లూసీ కాంస్య

అలెక్స్ మోర్గాన్

మేగాన్ రాపినోయ్ - విజేత

ఉత్తమ ఫిఫా పురుషుల కోచ్

ఉత్తమ ఫిఫా పురుషుల కోచ్

పెప్ గార్డియోలా

జుర్గెన్ క్లోప్ - విజేత

మారిసియో పోచెట్టినో

ఉత్తమ ఫిఫా ఉమెన్స్ కోచ్

ఉత్తమ ఫిఫా ఉమెన్స్ కోచ్

జిల్ ఎల్లిస్ - విజేత

ఫిల్ నెవిల్లే

సరీనా విగ్మాన్

ఫిఫా పుస్కాస్ అవార్డు

ఫిఫా పుస్కాస్ అవార్డు

లియోనెల్ మెస్సీ

జువాన్ ఫెర్నాండో క్విన్టెరో

డేనియల్ జొసోరి - విజేత

ఉత్తమ ఫిఫా పురుషుల గోల్ కీపర్

ఉత్తమ ఫిఫా పురుషుల గోల్ కీపర్

అలిసన్ బెకర్ - విజేత

ఎడెర్సన్

మార్క్-ఆండ్రీ టెర్ స్టీగెన్

ఉత్తమ ఫిఫా మహిళల గోల్ కీపర్

ఉత్తమ ఫిఫా మహిళల గోల్ కీపర్

క్రిస్టియన్ ఎండ్లర్

హెడ్విగ్ లిండాహ్ల్

చీర వాన్ వీనెండల్ - విజేత

ఫిఫా ఫ్యాన్ అవార్డు

ఫిఫా ఫ్యాన్ అవార్డు

సిల్వియా గ్రెకో - విజేత

జస్టో శాంచెజ్

నెదర్లాండ్స్ అభిమానులు

ఫిఫాప్రో పురుషుల వరల్డ్ ఎలెవన్ జట్టు

ఫిఫాప్రో పురుషుల వరల్డ్ ఎలెవన్ జట్టు

అలిసన్ బెకర్ (BRA) - లివర్‌పూల్

మాథిజ్ డి లిగ్ట్ (NED) - అజాక్స్ / జువెంటస్

సెర్గియో రామోస్ (ESP) - రియల్ మాడ్రిడ్

వర్జిల్ వాన్ డిజ్క్ (NED) - లివర్‌పూల్

మార్సెలో (BRA) - రియల్ మాడ్రిడ్

లుకా మోడ్రిక్ (CRO) - రియల్ మాడ్రిడ్

ఫ్రెంకీ డి జోంగ్ (NED) - అజాక్స్ / బార్సిలోనా

ఈడెన్ హజార్డ్ (BEL) - చెల్సియా / రియల్ మాడ్రిడ్

క్రిస్టియానో రొనాల్డో (POR) - జువెంటస్

కైలియన్ ఎంబప్పే (FRA) - పారిస్ సెయింట్-జర్మైన్

లియోనెల్ మెస్సీ (ARG) - బార్సిలోనా

ఫిఫాప్రో ఉమెన్స్ వరల్డ్ ఎలెవన్ జట్టు

ఫిఫాప్రో ఉమెన్స్ వరల్డ్ ఎలెవన్ జట్టు

శారీ వాన్ వీనెండల్ (NED) - ఆర్సెనల్ / అట్లెటికో మాడ్రిడ్

లూసీ కాంస్య (ENG) - ఒలింపిక్ లియోనాయిస్

వెండి రెనార్డ్ (FRA) - ఒలింపిక్ లియోనాయిస్

నిల్లా ఫిషర్ (SWE) - VfL వోల్ఫ్స్‌బర్గ్ / లింకోపింగ్స్

కెల్లీ ఓ హారా (USA) - ఉటా రాయల్స్

అమండిన్ హెన్రీ (FRA) - ఒలింపిక్ లియోనాయిస్

జూలీ ఎర్ట్జ్ (USA) - చికాగో రెడ్ స్టార్స్

రోజ్ లావెల్లె (USA) - వాషింగ్టన్ స్పిరిట్

మేగాన్ రాపినోయ్ (USA) - ఎఫ్సి పాలన

మార్తా (BRA) - ఓర్లాండో ప్రైడ్

అలెక్స్ మోర్గాన్ (USA) - ఓర్లాండో ప్రైడ్

Story first published: Tuesday, September 24, 2019, 13:47 [IST]
Other articles published on Sep 24, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+