జొహానెస్ బర్గ్: సాకర్ ప్రపంచకప్ లో దూసుకెళ్తున్న అర్జెంటినా మెక్సికోపై విజయం సాధించింది. ఫేవరెట్లలో ఒకటైన అర్జెంటీనా క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది. ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్ లో అర్జెంటీనా 3-1తో మెక్సికోపై విజయం సాధించింది. టెవెజ్ 26వ నిమిషంలో, హిగైన్ 33వ నిమిషంలో గోల్స్ చేయడంతో అర్జెంటీనా 2-0 ఆధిక్యంతో ప్రథమార్ధాన్ని ముగించింది.
ద్వితీయార్థంలో టెవెజ్ మరోసారి మెరిశాడు. 52వ నిమిషంలో 25 గజాల దూరం నుంచి అద్భుతమైన గోల్ కొట్టాడు. మెక్సికో జట్టులో ఏకైక గోల్ హెర్నాండెజ్ 71వ నిమిషంలో సాధించాడు. క్వార్టర్స్ లో అర్జెంటీనా జర్మనీతో తలపడుతుంది.