Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐఎస్ఎల్: ఢిల్లీ, కోల్‌కతా మధ్య థ్రిల్లింగ్ డ్రా

న్యూఢిల్లీ: జంబ్రొట్టా సారధ్యంలోని ఢిల్లీ డైనమోస్ ఈ సీజన్‌లో సొంతగడ్డపై ఎదురులేని శక్తిగా నిలిచింది. 20 వేల మంది అభిమానుల మధ్య న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఆదివారం రాత్రి అట్లెటికో డీ కోల్‌కతాతో జరిగిన మ్యాచ్ 2 - 2 స్కోర్ తేడాతో థ్రిల్లింగ్ డ్రాను మిగిల్చింది. ఫస్టాఫ్‌లో బాదరా బాద్జీకి రెడ్ కార్డు చూపకముందు విజిటర్స్ కోల్ కతా ప్లేయర్ ఇయాన్ హుమ్ 17వ నిమిషంలో చేసిన గోల్ ఆ జట్టును ఆధిక్యంవైపు నడిపించింది.

ఇరు జట్లు తామేమీ తక్కువ కాదన్నట్లు పోటీ పడ్డాయి. సెకండాఫ్‌లో 63 నిమిషంలో మిలాన్‌సింగ్ అద్భుతమైన రీతిలో గోల్ చేయడంతో స్కోర్ సమమైంది. మళ్లీ జావీ లారా 71వ నిమిషంలో గోల్‌తో అట్లెటికో డీ కోల్ కతాను ఆధిక్యంవైపు నడిపించగా, మరో మూడు నిమిషాలకే ఢిల్లీ సారధి ఫ్లోరెంట్ మాలౌదా గోల్ తో స్కోర్ 2-2గా సమమైంది.

తర్వాత ఇరు జట్లు ఆధిక్యం సాధించేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. కాకపోతే ఇప్పటికే టాప్ 4లో చోటు సంపాదించుకున్న రెండు జట్ల స్థానాలలో ఎటువంటి మార్పు లేదు. మ్యాచ్ ప్రారంభమైన నాలుగో నిమిషానికే బోర్జా ఫెర్నాండెజ్ తొలి షాట్‌తో కోల్ కతాకు ఆధిక్యం చేసిన ప్రయత్నానికి ఢిల్లీ డైనమోస్ గోల్ కీపర్ అంటోనియో డొబ్లాస్ గండికొట్టాడు.

తర్వాత 13 నిమిషాలకు గానీ కోల్ కతా గోల్ సాధించేందుకు మార్గం సుగమం అయ్యింది. సమీగ్ దౌటీ సాయంతో కోల్ కతా స్టార్ ప్లేయర్ ఇయాన్ హుమ్ తెలివిగా బంతిని గోల్ పోస్ట్ వైపు డైవ్ కొట్టడంతో తొలి గోల్ నమోదైంది. ఢిల్లీ డిఫెన్స్ ను తప్పించుకుని.. గోల్ కీపర్ డొబ్లాస్ అడ్డుకునే యత్నాలను పసిగట్టి మరి ఇయాన్ హుమ్ కొట్టిన కిక్ నేరుగా బంతిని గోల్ పోస్ట్ దారి పట్టించాడు.

దీంతో రెండు జట్ల మధ్య స్కోర్‌లో 1 - 0 ఆధిక్యం లభించింది. 30 నిమిషాల మ్యాచ్ పూర్తయిన తర్వాత అట్లెటికో డీ కోల్‌కతా సారధి హెల్డర్ పొస్టిగ తొలిసారి గోల్ కోసం ప్రయత్నించాడు. లెఫ్ట్ వైపు నుంచి బంతిని నేరుగా కిక్ చేసినా క్రాస్ బార్ వద్ద ఢిల్లీ కుర్రాళ్లు అడ్డుకొట్టారు. మరో నాలుగు నిమిషాలకు పొస్టిగ పంపిన బంతిని కీపర్ డొబ్లాస్ తిప్పికొట్టాడు. పొస్టిగ పంపిన బంతిని గోల్ పోస్ట్ లో వెళ్లకుండా డొబ్లాస్ విజయవంతంగా అడ్డుకోవడంతో కోల్ కతా స్పష్టమైన ఆధిక్యం సాధించడంలో విఫలమైంది.

ఫస్టాఫ్‌లోనే ఢిల్లీ డైనమోస్ పరిస్థితి దారుణం

ఫస్టాఫ్‌లోనే ఢిల్లీ డైనమోస్ పరిస్థితి దారుణం

24వ నిమిషం తర్వాత ఢిల్లీ సంచలనం మార్సిలిన్హో కార్నర్ ద్వారా పంపిన బంతిని ఇబ్రహీమా నాయిస్సే హెడ్డర్ ద్వారా గోల్‌పోస్ట్‌కు పంపినా లక్ష్యం చేరకపోవడంతో స్కోర్ సమంచేసే అవకాశం మిస్సయ్యింది. 38వ నిమిషంలోనూ మరోసారి మార్సిలిన్హో రైట్ వైపు కట్ కొట్టిన బంతిని బాక్స్ వద్ద ముగ్గురు డిఫెండర్లు అడ్డుకోవడంతో స్థానిక ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు. బాదరా బాద్జీ వరుసగా రెండు ఎల్లో కార్డులతో మ్యాచ్ నుంచి వైదొలగాల్సి రావడంతో ఫస్టాఫ్ లోనే ఢిల్లీ డైనమోస్ పరిస్థితి దారుణంగా మారింది.

గంట సేపటికి గానీ ఢిల్లీకి లైఫ్ లై

గంట సేపటికి గానీ ఢిల్లీకి లైఫ్ లై

సెకండాఫ్ లో కేవలం 10 మందితోనూ ఢిల్లీ ప్లేయర్లు బరిలోకి దిగాల్సి వచ్చింది. మ్యాచ్ ప్రారంభమైన గంట సేపటికి గానీ ఢిల్లీకి లైఫ్ లైన్ లభించలేదు. ప్రబీర్ దాస్ అడ్జస్ట్ మెంట్ తో బంతిని మార్సిలిన్హోకు పంపితే ఆయన బాక్స్ లోకి పంపడంలో విఫలమయ్యాడు. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ సారధి ఫ్లోరెంట్ మాలౌదా.. కోల్‌కతా గోల్ కీపర్ దేబ్జిత్ మజుందార్ పై ఒత్తిడి తెచ్చి నియంత్రించేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేక పోయింది. 63వ నిమిషంలో మిలాన్ సింగ్ బాక్స్ బయటి వైపు నుంచి ఆశ్చర్యకరమైన రీతిలో లెఫ్ట్ ఫుట్ తో బంతిని గోల్ పోస్ట్ దారి మళ్లించాడు.

మజుందార్ విఫలయత్నం

మజుందార్ విఫలయత్నం

అది నేరుగా గోల్ పోస్ట్ కు చేరుకుని స్కోర్ ను సమం చేసింది. గోల్ పోస్ట్ కు 25 గజాల దూరం నుంచి కొట్టిన కిక్ షాట్‌ను సేవ్ చేయడానికి మజుందార్ విఫలయత్నం చేశాడు. మిలాన్ సింగ్‌కు ఇది ప్రస్తుత సీజన్‌లో రెండో గోల్ కావడం గమనార్హం. ఈ దశలో కోల్ కతా కీలక ప్లేయర్ జావీ లారా 71వ నిమిషంలో లూస్ బాల్ ను స్వాధీనంచేసుకుని బాక్స్ అవుట్ సైడ్ నుంచి నేరుగా గోల్ పోస్ట్ కు పంపాడు. దీంతో మళ్లీ మ్యాచ్‌పై కోల్ కతా పట్టు సాధించినట్లయింది.

ఇద్దరు డిఫెండర్లు గోల్స్ చేసే యత్నాలు విఫలం

ఇద్దరు డిఫెండర్లు గోల్స్ చేసే యత్నాలు విఫలం

మరో మూడు నిమిషాలకు ఢిల్లీ సారధి ఫ్లోరెంట్ మాలౌదా.. కోల్ కతా డిఫెన్స్, గోల్ కీపర్ ల వ్యూహాలను అధిగమిస్తూ పంపిన బంతి నేరుగా గోల్ పోస్ట్ దరి చేరింది. ఆ తర్వాత ఢిల్లీ కుర్రాళ్లు మ్యాచ్ ను వదులుకునేందుకు సిద్ధపడలేదు. మరో మూడు నిమిషాలకు డేవిడ్ అడ్డీని సబ్‌స్ట్యూట్‌గా తీసుకున్న తర్వాత ప్రత్యర్థి జట్టుకు చెందిన ఇద్దరు డిఫెండర్లు గోల్స్ చేసే యత్నాలను సాగనివ్వలేదు. చివరిగా తిరిగి తీవ్ర గాయానికి గురైనప్పుడు అట్లెటికో డీ కోల్ కతాకు పైచేయి సాధించేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఫలితంగా అది క్రాస్ బార్ మీదుగా గోల్ పోస్ట్ ను దాటుకుని వెళ్లిపోయింది.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+