దిగ్గజ ఫుట్‌బాలర్, తెలుగు బిడ్డ తులసీరాం కన్నుమూత!

భారత దిగ్గజ ఫుట్‌బాలర్ తులసీదాస్ బలరాం కన్నుమూశారు. ఒలింపిక్స్‌లో సైతం దేశం గర్వించే ప్రదర్శన చేసిన ఈ తెలుగు బిడ్డ కోల్‌కతాలో తుదిశ్వాస విడిచాడు. భారత్‌లో ఫుట్‌బాల్ స్వర్ణ యుగం అని పిలుచుకునే 19850-1960ల కాలంలో ఆడిన తులసీదాస్.. అప్పట్లో మరో ఇద్దరు సూపర్ స్టార్ ప్లేయర్లు చునీ గోస్వామి, పీకే బెనర్జీతో కలిసి జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. వీళ్లు ముగ్గుర్నీ కలిపి 'ముగ్గురు దేవుళ్లు' (హోలీ ట్రినిటీ) అని అభిమానులు పిలుచుకునేవారంటేనే.. వీళ్లు ఎంత గొప్ప ఆటగాళ్లో అర్థం చేసుకోవచ్చు.
ఒలింపిక్స్‌లో గోల్..
ప్రస్తుత తెలంగాణలోని బొల్లారంలో 1936 అక్టోబర్ 4న తులసీదాస్ జన్మించాడు. ఆ తర్వాత హైదరాబాద్, తూర్పు బెంగాల్ జట్ల తరఫున ఫుట్‌బాల్ ఆడాడు. 1960 రోమ్ ఒలింపిక్స్‌లో తులసీదాస్ అద్భుతంగా రాణించాడు. హంగేరి, ఫ్రాన్స్, పెరు వంటి టాప్ దేశాలు ఉన్న గ్రూప్‌లో భారత్ కూడా ఉంది. దీన్ని 'గ్రూప్ ఆఫ్ డెత్' అని అభిమానులు అన్నారు. అలాంటి గ్రూపులో కూడా భారత్ తరఫున అద్భుతంగా రాణించిన తులసీదాస్.. హంగేరితో జరిగిన మ్యాచ్‌లో 79వ నిమిషంలో గోల్ చేశాడు. ఆ మ్యాచ్‌లో భారత్ 1-2 తేడాతో ఓడినా కూడా తులసీదాస్ చేసిన గోల్‌ను అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు.
ఆసియా ఛాంపియన్..
ఆ తర్వాత ఫ్రాన్స్‌పై కూడా తులసీదాస్ రాణించడంతో.. ఆ జట్టును కూడా భారత్ ఓడించినంత పని చేసింది. కానీ చివరకు విజయం ఫ్రాన్స్‌ను వరించడంతో భారత్ ఇంటి దారిపట్టింది. ఆ తర్వాత 1962లో ఆసియా కప్‌లో గోల్డ్ మెడల్ సాధించిన జట్టులో తులసీదాస్ కూడా సభ్యుడు. అదే ఏడాది అతనికి 'అర్జున అవార్డు' కూడా దక్కింది. అయితే అనారోగ్యంతో ఆ మరుసటి ఏడాదే ఆటకు దూరమవ్వాల్సి వచ్చింది. దీంతో భారత ఫుట్‌బాల్ చరిత్రలో ఒక శకం ముగిసినట్లయింది. రిటైర్ అయిన తర్వాత కోల్‌కతాలో ఉంటున్న ఆయన.. హుగ్లీ నదీ తీరంలో నివశించేవాడు.
పరిస్థితి విషమించి..
గతేడాది డిసెంబర్ 26న యూరినరీ ఇన్‌ఫెక్షన్, అబ్దామినల్ డిస్టెన్షన్‌తో ఆయన ఆస్పత్రిపాలైనట్లు సన్నిహితులు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నా పరిస్థితి విషమించడంతో గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో తులసీదాస్ బలరాం తుదిశ్వాస విడిచారని వెల్లడించారు. ఆయనకు మంచి వైద్యం అందిచడానికి సహకరించిన రాష్ట్ర ప్రభుత్వం, క్రీడాశాఖ మంత్రి అరూప్ బిస్వాస్‌కు తులసీదాస్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications