క్లబ్ వరల్డ్‌కప్ టోర్నీకి అర్హత సాధించిన విల్లింగ్టన్ క్లబ్

హైదరాబాద్: న్యూజిలాండ్ రాజధాని విల్లింగ్‌టన్ కేంద్రంగా పని చేస్తున్న ఫుట్‌బాల్ క్లబ్ జట్టు విల్లింగ్టన్ క్లబ్‌కు 'క్లబ్ వరల్డ్ కప్' టోర్నమెంట్‌లో ఆడేందుకు అర్హత లభించింది. తొలిసారి ఓషియానా చాంపియన్స్ లీగ్ టోర్నీ టైటిల్‌ను విల్లింగ్టన్ క్లబ్ గెలుచుకోవడంతో ఈ అర్హత లభించింది.

తొలిసారి ఓషియానా ఫుట్‌బాల్ చాంపియన్స్ టైటిల్ ఇలా
ఆదివారం ఫిజికి చెందిన లౌటోకా జట్టుపై జరిగిన టైటిల్ పోరులో విల్లింగ్టన్ జట్టు గెలుచుకుంది. అంతకుముందు సెమీ ఫైనల్స్ మ్యాచ్‌లో వరుసగా ఏడేళ్లు ఓఎఫ్సీ చాంపియన్స్ టైటిల్ గెలుచుకున్న ఆక్లాండ్ సిటీ క్లబ్ జట్టును ఢీకొట్టిన విల్లింగ్టన్ క్లబ్ ఫైనల్స్‌కు చేరుకుంది. తద్వారా వచ్చే డిసెంబర్ నెలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఎఈ)లో జరిగే క్లబ్ వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో తొలిసారి విల్లింగ్టన్ క్లబ్ జట్టు పాల్గొననుంది.

క్లబ్ వరల్డ్‌కప్ టోర్నీలో ఆరు ఖండాల ప్రాతినిధ్యం
క్లబ్ వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో ఆరు ఖండాలకు చెందిన జట్లతోపాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో చాంపియన్స్ అల్ అయిన్ క్లబ్ జట్టు పాల్గొననుంది. వచ్చే వారాంతంలో జరిగే ‘యూఈఎఫ్ఎ చాంపియన్స్ లీగ్ ఫైనల్స్'లో పోటీ పడే లివర్ పూల్, రియల్ మాడ్రిడ్ జట్లలో విజేతతో విల్లింగ్టన్ క్లబ్ తలపడుతుంది.

ఏడు క్లబ్‌ల నుంచి 24 క్లబ్‌లకు క్లబ్ వరల్డ్ కప్ విస్తరణ ఫిఫా ఆలోచన
విల్లింగ్టన్ క్లబ్ కోచ్ జోస్ ఫిగౌరా మాట్లాడుతూ ఫిజిలో లౌకోటా క్లబ్‌పై జరిగిన మ్యాచ్‌లో గెలుచుకున్నందుకు ఆనందంగా ఉంది. ప్రతి మ్యాచ్‌లోనూ పరిస్థితిని అర్థం చేసుకుంటూ కష్టపడి పని చేస్తూ ముందుకు సాగామని తెలిపారు. తద్వారా యేటా జరిగే క్లబ్ వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనేందుకు వెసులుబాటు కలిగిందన్నారు. నాలుగేళ్లలో ఏడు క్లబ్‌ల ఫార్మాట్‌ను 24 క్లబ్‌లకు విస్తరించాలని ఫిఫా అధ్యక్షుడు జియాన్ని ఇన్‌ఫాంటినో కలలు కంటున్నారు.

సాకర్ సంరంభానికి నైంగ్లోవాన్ లేకుండా బెల్జియం టీం
క్రియేటివ్ మిడ్ ఫీల్డర్ రాదా నైంగ్లోవాన్‌కు చోటు లేకుండానే వచ్చేనెల రష్యాలో జరిగే సాకర్ కప్ టోర్నమెంట్‌కు బెల్జియం ఫుట్‌బాల్ సమాఖ్య జట్టును ఎంపిక చేసింది. చాంపియన్స్ లీగ్ ఫైనల్స్ టోర్నమెంటులో రోమాపై జరిగిన టైటిల్ పోరులో రెండు గోల్స్ సాధించి టీం రెండోసారి గెలుచుకోవడంలో నైంగ్లోవాన్ కీలక పాత్ర పోషించాడు. బెల్జియం టీం వచ్చేనెలలో జరిగే రష్యా సాకర్ కప్ సంరంభంలో గ్రూప్ జీలో పాల్గొననున్నది. ఇంగ్లండ్, పనామా, ట్యునిషియా జట్లతో తల పడనున్నది. జట్టు తరఫున 30 సార్లు ప్రాతినిధ్యం వహించిన 30 ఏళ్ల కుర్రాడు నైంగ్లోవాన్. బెల్జియం జట్టు వచ్చేనెల రెండో తేదీన పోర్చుగల్ టీంతో వార్మప్ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో పాల్గొననున్నది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications