Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐఎస్ఎల్: చెన్నైయిన్‌పై గోవా థ్రిల్లర్ విజయం

మార్గోవా: డిఫెండింగ్ చాంపియన్ చెన్నైయిన్, రన్నరప్ ఎఫ్ సి గోవా మధ్య గురువారం రాత్రి గోవాలోని పాటోర్డా జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన మ్యాచ్ రసవత్తరంగా సాగింది. చెన్నైయిన్‌పై ఎఫ్‌సి గోవా 5-4 స్కోర్ తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనుక్షణం సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించినా ఇది నామమాత్రమే.

ఈ ఏడాది రెండు జట్ల మధ్య ఇది చివరి మ్యాచ్ కూడా. ఇంతకుముందే ముంబై సిటీ, అట్లెటికో డీ కోల్‌కతా, ఢిల్లీ డైనమోస్ జట్టు టాప్ 4 బృందంలో చోటు దక్కించుకోగా.. నాలుగో స్థానం కోసం ఎఫ్ సి పుణె, కేరళ బ్లాక్ బస్టర్స్ తలపడుతున్నాయి. ఆదివారం జరిగే మ్యాచ్ టాప్ 4లో చివరి చాన్స్ ఎవరికి దక్కుతుందో తేలుస్తుంది.

కాగా ఈ మ్యాచ్ ఐఎస్ఎల్ టోర్నీలోనే అత్యధికంగా తొమ్మిది గోల్స్ చేసిన రికార్డు నెలకొల్పింది. గోవా కుర్రాళ్లు యంగ్ఇండియన్ ప్లేయర్ సాహిల్ తావోరా (68వ, 90+), లూయిస్ (6వ, 76వ) చెరో రెండేసి గోల్స్, జాఫ్రి గొంజాలెజ్ (21వ నిమిషం) సింగిల్ గోల్ చేశారు. చెన్నైయిన్‌ ప్లేయర్లు రింజౌలా (4వ), అర్నోలిన్‌ ఓ సెల్ఫ్‌ గోల్‌ (14వ), ఒమాబెమి (28వ), రైజ్‌ (88వ) తలా ఓ గోల్‌ చేశారు.

సెమీస్‌ నుంచి నిష్క్రమించిన చెన్నైయిన్‌, గోవా

సెమీస్‌ నుంచి నిష్క్రమించిన చెన్నైయిన్‌, గోవా

ఈ మ్యాచ్‌కు ముందే రెండు జట్లు సెమీస్‌ రేసు నుంచి నిష్క్రమించాయి. 21 ఏళ్ల గోవా కుర్రాడు తావోరా మూడు నిమిషాల అదనపు ఇంజ్యూరీ సమయంలో బాక్స్ ఎడ్జ్ వద్ద నేరుగా బంతిని గోల్ పోస్ట్ దారి పట్టించడంతో నాటకీయ ఫక్కీలో చెన్నైయిన్ పరాజయం ఖరారైంది. సెకండాఫ్‌లో 68వ నిమిషం తర్వాత తావోరా ఫస్ట్ గోల్ చేశాడు. బ్రెజిలియన్ లెజెండ్ కోచ్ జికో సారధ్యంలో గోవా టీం 14 మ్యాచ్‌ల్లో 14 పాయింట్ల (నాలుగు విజయాలు, రెండు మ్యాచ్‌ల్లో డ్రా. ఎనిమిది పరాజయాలు)తో ఐఎస్ఎల్ 3 ఎడిషన్‌లో తన ప్రయాణాన్ని ముగించింది.

నాటకీయ ఫక్కీలో గోవా విజయం

నాటకీయ ఫక్కీలో గోవా విజయం

గతేడాది వివాదాస్పదంగా ముగిసిన ఫైనల్స్ మ్యాచ్‌లో టైటిల్‌ను చేజిక్కించుకున్న చెన్నైయిన్ జట్టుపై అదే స్టేడియంలో గోవా నాటకీయ ఫక్కీలో విజయం సాధించి ప్రతీకారం తీర్చుకున్నది. డిఫెండింగ్ చాంపియన్‌గా చెన్నైయిన్ అప్పుడప్పుడు మెరుపులు మెరిపించినా 14 మ్యాచ్‌ల్లో 15 పాయింట్ల (మడు విజయాలు, ఆరు మ్యాచ్ ల్లో డ్రాలు, ఐదు పరాజయాల)తో ఏడో స్థానంలో.. గోవా కంటే ఒక మెట్టుపై సెటిలైంది. తొలి నుంచి రెండు జట్లు ప్లేఆఫ్ దశకు చేరుకునే అవకాశాలు లేకపోవడంతో స్వేచ్ఛగా ఆడాయి. తత్ఫలితంగానే ఈ మ్యాచ్ ఫుట్ బాల్ అభిమానులకు తొమ్మిది గోల్స్‌తో పండుగ వాతావారణాన్ని కల్పించింది.

నాలుగో నిమిషంలో ఫ్రీ కిక్ ద్వారా గోల్

నాలుగో నిమిషంలో ఫ్రీ కిక్ ద్వారా గోల్

చెన్నైయిన్ లో 18 ఏళ్ల జెర్రీ లాల్రింజులా అత్యంత యువకుడిగా ఐఎస్ఎల్ 3 ఎడిషన్ చివరి మ్యాచ్ లో నాలుగో నిమిషంలో ఫ్రీ కిక్ ద్వారా గోల్ పాయింట్ సాధించాడు. అంతకు ముందు రిచర్ల్యైసన్ ఫెలిస్బినో చేసిన ఫౌల్.. జెర్రీకి లాభించింది. జెర్రీ పంపిన బంతిని అడ్డుకొనేందుకు గోవా గోల్ కీపర్ లక్ష్మీకాంత్ కట్టిమణికి అవకాశం లేకపోయింది. మరో రెండు నిమిషాలకు హోం టీం కుర్రాడు జాఫ్ఫ్రీ గొంజాలెజ్ పంపిన బంతిని రాఫెల్ కొయెల్హో.. చెన్నైయిన్ గోల్ కీపర్‌ను అధిగమించి గోల్ సాధించాడు.

పొరపాటుకు తావు లేకుండా బంతిని గోల్ పోస్ట్

పొరపాటుకు తావు లేకుండా బంతిని గోల్ పోస్ట్

విజిటర్స్ చెన్నైయిన్ ప్లేయర్ థాయిసింగ్ 14వ నిమిషంలో బాక్స్‌కు కుడివైపు నుంచి నేరుగా పంపిన బంతిని గోవా కీపర్ లక్ష్మీకాంత్ కట్టిమణి అడ్డుకున్నా అనిరుధ్ థాపా కొట్టిన షాట్ నేరుగా డిఫెండర్ గ్రెగరీ ఆర్నోలిన్ చేతిలో పడింది. అయినా గోవా కుర్రాళ్లు మన:స్తాపానికి గురి కాకున్నా కౌంటర్ అటాకింగ్‌కు దిగారు. ఇన్ సైడ్ బాక్స్ లో రాఫెల్ కొయెల్హోను హర్మోన్జిత్ సింగ్ కాబ్రా తప్పించినా జాఫ్రి గొంజాలెజ్ మాత్రం పొరపాటుకు తావు లేకుండా బంతిని గోల్ పోస్ట్ బాట పట్టించాడు.

28వ నిమిషంలో చెన్నయిన్ జట్టు గోల్

28వ నిమిషంలో చెన్నయిన్ జట్టు గోల్

28వ నిమిషంలో డానియల్ లాల్హింపుయా నుంచి వచ్చిన పాస్‌ను చెన్నై ఆటగాడు దుదు ఒమాంగ్‌బేమి గోల్‌గా మలిచాడు. ఫస్టాఫ్ సమయానికి చెన్నై - గోవా మధ్య స్కోర్ 3 - 2 తేడాతో స్థిర పడింది. సెకండాఫ్ లో మందార్ రావు దేశాయ్ స్థానే తావోరాను బరిలోకి దింపడంతో గోవా బ్రేక్ సాధించింది. విజిటర్స్ జట్టు చెన్నైయిన్ అనుక్షణం మార్పులతో కనీసం మ్యాచ్ ఫలితాన్ని డ్రా చేసేందుకు ప్రయత్నించింది. కానీ తావెరా అదనపు సమయంలో చేసిన గోల్.. జికో సేనను గెలుపు బాట పట్టించింది.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+