
తొలిసారి 2002 సాకర్ కప్‌లో మార్క్వౌజ్
2002లో తొలిసారి జపాన్ - దక్షిణ కొరియా సంయుక్త సారథ్యంలో నిర్వహించిన ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో రాఫెల్ మార్క్వౌజ్ ఆరంగ్రేటం చేశాడు. మెక్సికోకు చెందిన రాఫెల్ మార్క్కౌజ్‌తోపాటు ఇటలీకి చెందిన గియాంలౌగి బఫెన్, జర్మనీ ఆటగాడు లోథార్ మాథ్యూస్, మెక్సికో ప్లేయర్ అంటోనియో కార్బజాల్‌లతో ఇప్పటి వరకు ఐదు వరల్డ్ కప్‌ల్లో ఆడారు.

డ్రగ్స్ ట్రాఫికింగ్, న్యాయపోరులో మార్క్వౌజ్
కానీ డ్రగ్స్ ట్రాఫికింగ్ కేసులో ఇరుక్కున్న రాఫెల్ మార్క్వౌజ్ ఒకవైపు న్యాయ పోరాటం, మరోవైపు వ్యక్తిగత సమస్యల్లో చిక్కుకున్నాడు. ఆగస్టు వరకు ఈ బార్సిలోనా మాజీ ప్లేయర్‌ను నిందితుడిగానే అభివర్ణిస్తూ వచ్చింది. ఆయనకు జారీ చేసిన వీసాను అమెరికా రద్దు చేసింది. న్యాయ పోరాటం కోసం 3 నెలల పాటు ఫుట్‌బాల్ ఆటకు దూరంగా ఉన్నాడు రాఫెల్ మార్క్వౌజ్. కోర్టులో గెలిచి బ్యాంక్ ఖాతాలను అన్‌ఫ్రీజ్ చేసుకున్నాడు.

మార్క్వౌజ్‌కు స్పాన్సరర్ కొకాకోలా రాంరాం
రాఫెల్ మార్క్వౌజ్ జట్టుకు కెప్టెన్సీ వహించడంతో మెక్సికో జాతీయ జట్టు స్పాన్సర్ సంస్థలు కొకాకోలా కూడా ఆయనతో భాగస్వామ్యం కావద్దని కోరింది. అందుకే ఏ సంస్థ ట్రేడ్ మార్క్, లోగో లేని జెర్సీ ధరించి రాఫెల్ మార్క్వౌజ్ ట్రైనింగ్ క్యాంపుల్లో పాల్గొన్నాడు. తద్వారా ప్రత్యామ్నాయంగా టీం కెప్టెన్ హోదాలో రాఫెల్ మార్క్వౌజ్ నిలిచాడు.

రోజురోజుకు మెరుగవుతున్న నేయ్మార్
బ్రెజిల్ కెప్టెన్‌గా ఎన్నికైన నేయ్మార్ రోజురోజుకు తన ఫిట్‌నెస్ మెరుగు పర్చుకుంటున్నాడని తమ ఆట బ్రెజిల్ రైట్ బ్యాక్ డానిలో తెలిపాడు. దీనికి కారణం నిరంతరం శిక్షణ ఇవ్వడం వల్లే ఆయన ఫిట్‌నెస్ పెంచుకుంటున్నాడు. ప్రపంచకప్ టోర్నమెంట్‌లో పారిస్ సెయింట్ జెర్మైన్ సూపర్ స్టార్ నేయ్మార్‌పై అంతర్జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారులు దృష్టిని కేంద్రీకరించారు. ఫిబ్రవరి నెలాఖరు నుంచి చికిత్స నిమిత్తం విరామంలోనే ఉన్నాడు.

17న రొస్టోవ్‌లో స్విట్జర్లాండ్‌తో బ్రెజిల్ ‘ఢీ'
టైట్ కోచ్‌గా పని చేస్తున్న బ్రెజిల్ టీం వచ్చేనెల 17వ తేదీన రొస్టోవ్‌లో స్విట్జర్లాండ్ జట్టుపై తలపడనుంది. అంతకుముందు అన్‌ఫీల్డ్‌లో ఆదివారం క్రొయేషియాపై జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో ఆడనుంది. తాను ఎల్లవేళలా శిక్షణలో భాగంగా నేయ్మార్‌తో తలపడుతున్నానని, రోజు రోజుకు ఆయన్ను బ్లాక్ చేయడానికి కష్టపడాల్సి వస్తోందన్నాడు. మోకాలి గాయంతో పీఎస్జీ వెటరన్ డానీ ఆల్వేస్ పక్కకు తప్పుకోవడంతో జట్టులో చోటు కోసం సెలెకావోతో డానిలో పోటీ పడుతున్నాడు.


Click it and Unblock the Notifications














