Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫిఫా అభిమానుల గ్రహపాటు..! వేల కి.మీల దూరంలో రెస్టారెంట్

Swiss World Cup Fans Book Hotel 1281km Away From Venue in Russian City

హైదరాబాద్: రష్యాలో జరుగుతోన్న ఫిఫా వరల్డ్ కప్ చూసేందుకు వచ్చిన అభిమానులకు పెద్ద ఆటంకమే ఎదురైంది. ఆదివారం బ్రెజిల్‌తో జరిగిన మ్యాచ్‌కు స్విట్జర్లాండ్(స్విస్) అభిమానులు భారీగా తరలివచ్చారు. రొస్తోవ్ ఆన్‌ డాన్‌ అనే ప్రాంతంలో జరిగిన మ్యాచ్‌కు భారీగా వెళ్లిన ఫ్యాన్స్ తమ జాతీయ జట్టుకు మద్దతు తెలిపారు. రొస్తోవ్ ఆన్ డాన్‌లో పెద్ద మొత్తంలో రూములను బుక్ చేసుకున్నారు. మ్యాచ్ అనంతరం తాము బుక్ చేసుకున్న హోటల్‌కు వెళ్లేందుకు బయల్దేరారు.

నగరమంతా ఎక్కడ వెదికినా అది కనిపించలేదు. చివరికి ఆ పేరుతో హోటలే లేదని తెలిసింది. దీంతో స్విట్జర్లాండ్ ఫ్యాన్స్ షాకయ్యారు.

ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక

దిక్కుతోచక పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటికొచ్చింది. వాళ్లు రొస్తోవ్ ఆన్ డాన్‌లో హోటల్ బుక్ చేసుకోలేదని.. పొరపాటు వేరొక నగరం రొస్తోవ్ వెల్కీలో బుక్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రెండు పేర్లు ఒకేలా ఉండడంతో కన్‌ఫ్యూజ్ అయ్యారని తెలిపారు. ఐతే మ్యాచ్ జరిగిన రొస్తోవ్ ఆన్‌ డాన్‌ స్టేడియానికి రొస్తోవ్ వెల్కీ నగరం ఏకంగా 1281 కి.మీ. దూరంలో ఉండడం బాధాకరం.

రష్యాలోని ప్రాంతాల పేర్లను అనువదించడంతో విదేశీయులు ఇలాంటి ఇబ్బందులకు లోనుకాకుండా ఉండేందుకే అనువాదకులను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాంటి వారికి సాయం చేసేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేసినట్లు రష్యన్ అధికారులు వెల్లడించారు. ఫుట్‌బాల్ మ్యాచులు జరిగే ప్రాంతాల్లో స్పానిష్, ఇంగ్లీష్, అరబిక్, ఫ్రెంచ్ భాషలు మాట్లాడే ట్రాన్స్‌లేటర్లు, వాలంటీర్లను నియమించినట్లు పేర్కొన్నారు.

కాగా ఆదివారం జరిగిన బ్రెజిల్-స్విట్జర్లాండ్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఐదు సార్లు ఛాంపియన్‌గా ఉన్న బ్రెజిల్‌ను స్విస్ టీం నిలువరించింది.

Story first published: Tuesday, June 19, 2018, 17:49 [IST]
Other articles published on Jun 19, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+