స్పెయిన్ పై స్విట్జర్లాండ్ అనూహ్య విజయం
డర్బన్: వరల్డ్ కప్ లో ఫేవరైట్ లలో ఒకటైన స్పెయిన్ జట్టు స్విట్జర్లాండ్ చేతిలో అనూహ్యంగా పరాజయం పాలైంది. బంతి ఎక్కువసేపు స్పెయిన్ జట్టు నియంత్రణలో ఉన్నా గోల్ అవకాశాలను సృష్టించుకోలేకపోయింది. ఆటగాళ్లు నేర్పుగా పాస్ లు అందించుకుంటూ ప్రత్యర్థి డి ప్రాంతం వరకు సులభంగానే చొచ్చుకుపోయినా గోల్ చేయడంలో విఫలమయ్యారు.
బుధవారం జరిగిన ఫుట్ బాల్ మ్యాచ్ లో స్పెయిన్ పై స్విట్జర్లాండ్ 1-0 తేడాతో విజయం సాధించింది. గత వరల్డ్ కప్ నుంచి గుణపాఠం నేర్చుకున్న స్విట్జర్లాండ్ ఈ మ్యాచ్ లో గెలిచి ప్రతీకారం తీర్చుకుంది. మొదట్నుంచి ప్రత్యర్ధి స్పెయిన్ పై స్విస్ ఎదురుదాడులు ప్రారంభించింది.
ఇరుజట్లు చివరి వరకూ హోరాహోరీగా తలపడినా అదృష్టం మాత్రం స్విట్జర్లాండ్ నే వరించింది. స్విస్ కెప్టెన్ అలెగ్జాండార్ ఫ్రీ ప్రాక్టీస్ మ్యాచ్ లోగాయ పడడంతో ఈ మ్యాచ్ కు దూరమయ్యాడు. అయినప్పటికీ ఆలోటును ఆటగాళ్లు కనబడనీయలేదు. తదుపరి మ్యాచ్ లకు ఫ్రీ ఆడే అవకాశం ఉందని జట్టు యాజమాన్యం తెలిపింది.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+

Click it and Unblock the Notifications