For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఖతార్‌లో ‘ఫిఫా’ కార్మిక హక్కుల ఉల్లంఘించలేదు

ఖతార్‌లో కార్మిక హక్కుల ఉల్లంఘన జరుగలేదని జ్యురిచ్ వాణిజ్య న్యాయస్థానం పేర్కొంది. అంతర్జాతీయ ఫుట్‌బాల్ సంఘాల సమాఖ్య (ఫిఫా) ఎటువంటి కార్మిక హక్కులు ఉల్లంఘించలేదని తేల్చి చెప్పింది.

By Nageshwara Rao

జ్యురిచ్: ఖతార్‌లో కార్మిక హక్కుల ఉల్లంఘన జరుగలేదని జ్యురిచ్ వాణిజ్య న్యాయస్థానం పేర్కొంది. అంతర్జాతీయ ఫుట్‌బాల్ సంఘాల సమాఖ్య (ఫిఫా) ఎటువంటి కార్మిక హక్కులు ఉల్లంఘించలేదని తేల్చి చెప్పింది. మూడు అంతర్జాతీయ కార్మిక సంఘాలు, ఒక బంగ్లాదేశీ కార్మికుడు జారీచేసిన పిటిషన్లను జ్యురిచ్ కోర్టు కొట్టేసింది.

2022లో ఖతార్‌లో జరిగే సాకర్ కప్ నిర్వహణకు జరుగుతున్న ఏర్పాట్లో కార్మిక, మానవ హక్కల ఉల్లంఘన జరుగుతున్నాయని మూడు కార్మిక సంఘాల ఆరోపణ. గత నెల 8న స్విస్ కోర్టులో డచ్ కార్మిక సంఘం (ఎఫ్ఎన్‌వి), బంగ్లాదేశీ కార్మిక సంఘం (బిఎఫ్‌టియుసి), బంగ్లాదేశీ కన్స్‌స్ట్రక్షన్ కార్‌పెంట్రీ ట్రేడ్ యూనియన్, నదీం షరీఫుల్ ఆలం అనే కార్మికుడు ఈ పిటిషన్లు దాఖలుచేశారని స్థానిక దిన పత్రిక నైయె జ్యురిచర్ జైటింగ్ వార్తా కథనం.

Swiss court rejects lawsuit against FIFA on Qatar labour rights violations

జ్యురిచ్ న్యాయస్థానం నిర్ణయాన్ని ఫిఫా స్వాగతించింది. 'ఖతార్‌లో 2022లో ఫిఫా వరల్డ్ కప్ నిర్వహణ ఏర్పాట్లను తీవ్రంగా పరిగణించడంతోపాటు ఆయా పనుల పరిస్థితులను, మానవ హక్కులను పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటాం' అని ఫిఫా తెలిపింది. ఖతార్‌లో ప్రపంచ వరల్డ్‌కప్ నిర్వహణ ఏర్పాట్లను చాలా సన్నిహితంగా పరిశీలిస్తాం' అని ఫిఫా అధ్యక్షుడు జియాన్నీ ఇన్‌ఫాంటినో తెలిపాడు.

ఫిఫా సహకారం కోరిన బ్రెజిల్ మిడ్ ఫీల్డర్ నెవెస్
అల్ జజీరాతో నూతన కాంట్రాక్ట్ విషయమై బ్రెజిల్ మాజీ ఇంటర్నేషనల్ థియాగో నెవెస్ సహకరించాలని ఫిఫాను అభ్యర్థించాడు. 2018 జూన్ వరకు అల్ జజీరాతో నెవెస్ కాంట్రాక్ట్ కలిగి ఉన్నాడు. బ్రెజిల్ టీమ్‌కు ఏడు సార్లు సారథ్యం వహించిన నెవెస్ 2015లో అల్ హిలాల్ జట్టులో చేరినప్పటి నుంచి 46 మ్యాచ్‌ల్లో 15 గోల్స్ సాధించాడు. బీజింగ్ ఒలింపిక్స్‌లో బ్రెజిల్ జట్టు తరఫున కాంస్య పతకం సాధించిన ఘనత కూడా నెవెస్‌దే.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+