FIFA World Cup 2026: స్వీడన్ సంచలన విజయం!
ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీ స్వీడన్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్ ఎఫ్‌లో భాగంగా సోమవారం ఉదయం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన స్వీడన్ 5-1 తేడాతో ట్యునీషియాను చిత్తుగా ఓడించింది.
యాసిన్ అయారీ డబుల్స్ గోల్స్‌తో సత్తా చాటగా.. అలెగ్జాండర్ ఇసాక్, విక్టర్ గ్యోకెరెస్ అద్భుత ప్రదర్శనతో స్వీడెన్ విజయంలో కీలక పాత్ర పోషించారు. గ్రూప్ ఎఫ్‌లో నెదర్లాండ్స్, జపాన్ మ్యాచ్ 2-2తో డ్రాగా ముగియడంతో స్వీడన్ నాకౌట్ అవకాశాలు మెరుగయ్యాయి.

ఆరంభం నుంచే జోరు..
మ్యాచ్ ఏడో నిమిషంలోనే ట్యునీషియా సంతతికి చెందిన స్వీడన్ ఆటగాడు యాసిన్ అయారీ అద్భుతమైన గోల్‌తో ఖాతా తెరిచాడు. చాలా దూరం నుంచి గోల్ పోస్ట్‌లోకి బంతిని పంపించాడు. ట్యునీషియా గోల్‌కీపర్ అబ్దెల్‌మౌహిబ్ చమఖ్ చేసిన తప్పిదాన్ని అయారీ చక్కగా ఉపయోగించుకున్నాడు. ఆ తర్వాత 30వ నిమిషంలో గ్యోకెరెస్ అందించిన పాస్‌ను ఇసాక్ లో-గోల్‌గా మార్చడంతో స్వీడన్ 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఫస్టాఫ్ చివర్లో ట్యునీషియా ఆటగాడు ఒమర్ రెక్కిక్ హెడర్ ద్వారా ఒక గోల్ చేసి స్వీడెన్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించాడు.
12 సెకన్లలోనే గోల్..
సెకండాఫ్‌లో ట్యునీషియా డిఫెన్స్‌ను స్వీడన్ ముక్కలు చేసింది. 59వ నిమిషంలో ఇసాక్ అందించిన బంతిని గ్యోకెరెస్ గోల్‌గా మలిచాడు. మ్యాచ్ ముగిసే దశలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన మట్టియాస్ స్వాన్‌బర్గ్ మైదానంలోకి అడుగుపెట్టిన కేవలం 12 సెకన్లలోనే ఫ్రీ-కిక్ ద్వారా గోల్ కొట్టి ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సబ్‌స్టిట్యూట్ గోల్‌గా రికార్డుగా సాధించాడు. తొలుత ఈ గోల్‌ను ఆఫ్‌సైడ్‌గా ప్రకటించినా.. సమీక్షలో గోల్‌గా తేలింది. ఇంజూరీ టైమ్‌లో అయారీ మరో గోల్ చేయడంతో స్వీడన్ 5-1తో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
గ్రాహం పోటర్ మ్యాజిక్..
గత ఫిఫా ప్రపంచకప్ 2022 టోర్నీకి అర్హత సాధించలేకపోయిన స్వీడన్.. ఈసారి ప్లే-ఆఫ్స్ ద్వారా అతికష్టం మీద ఎంట్రీ ఇచ్చింది. కానీ, కోచ్ గ్రాహం పోటర్ మార్గదర్శకత్వంలో జట్టు ఇప్పుడు అద్భుతమైన ఫామ్‌లో కనిపిస్తోంది. 1994 తర్వాత ఒకే ప్రపంచకప్ మ్యాచ్‌లో గోల్, అసిస్ట్ రెండూ చేసిన స్వీడన్ జోడీగా ఇసాక్-గ్యోకెరెస్ రికార్డుకెక్కారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications