Fifa World Cup 2022: సూపర్ మ్యాన్ మెస్సీ.. అర్జెంటీనాను సెమీస్ చేర్చిన సూపర్ స్టార్!

ఫుట్‌బాల్ సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ.. మరోసారి తన సత్తా నిరూపించుకున్నాడు. అర్జెంటీనాకు నాయకత్వం వహిస్తున్న అతను.. పెనాల్టీ షూటవుట్‌లో నెదర్లాండ్స్‌ను ఓడించి, తమ జట్టును సెమీఫైనల్స్ చేర్చాడు. హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లో రెండు జట్ల మధ్య తేడా మెస్సీనే అనడం అతిశయోక్తి కాదు. ఈ మ్యాచ్ ఆరంభం నుంచే మెస్సీ టీం కొంత ఆధిపత్యం చెలాయించింది.

ఆరంభంలో అర్జెంటీనాదే పైచేయి..
తొలి హాఫ్‌లో 53 శాతం సమయం బంతిని తమ వద్దే ఉంచుకున్న అర్జెంటీనా గోల్స్ చేసేందుకు తెగ ప్రయత్నించింది. ఈ క్రమంలోనే అర్జెంటీనా సారధి లియోనెల్ మెస్సీ అద్భుతమైన షాట్‌తో ఒక గోల్ సాధించాడు. ఆ తర్వత నెదర్లాండ్స్ ఎంత ప్రయత్నించినా తొలి అర్ధభాగంలో గోల్ చేయలేకపోయింది. దీంతో తొలి హాఫ్ టైం ముగిసే సరికి అర్జెంటీనా 1-0 ఆధిక్యంలో నిలిచింది. సెకండ్ హాఫ్‌లో కూడా అర్జెంటీనా బంతిని తమ వద్దనే ఎక్కువ ఉంచుకుంది. ఈ క్రమంలో నెదర్లాండ్స్ ఆటగాడు చేసిన పొరపాటు వల్ల అర్జెంటీనాకు పెనాల్టీ దక్కింది.

చివర్లో పుంజుకున్న డచ్..
ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అనుకున్న మెస్సీ.. తనే ఈ కిక్ తీసుకున్నాడు. అత్యంత తెలివిగా బంతిని గోల్‌లోకి కొట్టి తన ఖాతాలో రెండో గోల్ వేసుకున్నాడు. దీంతో అర్జెంటీనా ఆధిక్యం 2-0కు పెరిగింది. ఇక ఆ జట్టు విజయం ఖాయం అనుకుంటున్న సమయంలో నెదర్లాండ్స్ రెచ్చిపోయింది. స్టీవెన్ బర్గూయిస్ బంతిని బాక్స్ ప్రాంతంలోకి పంపగా.. అక్కడ ఉన్న వూట్ వెగ్రాస్ట్ చాకచక్యంగా గోల్ చేశాడు.
ఆట ఫలితం తేలేందుకు మరికొంత సమయం అవసరం అని భావించిన రిఫరీ అదనంగా 10 నిమిషాలను జత చేశాడు. ఈ సమయంలో మరోసారి వెగ్రాస్ట్‌కు గోల్ చేసే అవకాశం దక్కింది. దాన్ని అతను చక్కగా ఉపయోగించుకున్నాడు. దీంతో మ్యాచ్ ముగిసే సమయానికి రెండు జట్ల స్కోర్లు 2-2గా ఉన్నాయి.
షూటవుట్‌తో విజయం..
దీంతో అదనంగా 30 నిమిషాల ఎక్స్‌ట్రా టైం ఇస్తున్నట్లు రిఫరీ ప్రకటించాడు. అదనంగా ఇచ్చిన సమయంలో 65 శాతం పాటు బంతిని తమ వద్దనే ఉంచుకున్న అర్జెంటీనా ఎటాక్ చేయడానికి ప్రయత్నించలేదు. బంతిని తమ హాఫ్‌లోనే ఉంచుకుంది. అదే సమయంలో నెదర్లాండ్స్ కూడా రీగ్రూప్ అయ్యి.. అర్జెంటీనా దాడిని ఎదుర్కోవడానికి సిద్ధంగా నిలబడింది.
చివరి నిమిషంలో గోల్ చేసి నెదర్లాండ్స్‌ను ఉక్కిరి బిక్కిరి చేయాలని అర్జెంటీనా అనుకుంది. కానీ ఏ జట్టూ గోల్ చేయలేకపోవడంతో మ్యాచ్ పెనాల్టీ షూటవుట్‌కు దారి తీసింది. ఈ క్రమంలో నెదర్లాండ్స్ జట్టు తన తొలి రెండు కిక్స్‌లో గోల్ చేయడంలో విఫలమైంది. ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్న అర్జెంటీనా కాన్ఫిడెన్స్‌తో ఆడి 4-3 తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించి సెమీఫైనల్ చేరుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications