For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫోటో: కోల్‌కతా భామతో త్వరలో సునీల్ ఛెత్రి పెళ్లి

ప్రస్తుతం భారతీయ క్రీడాకారులను వివాహ సీజన్ ముంచెత్తుతున్నది. టీం ఇండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్, ఇషాంత్ శర్మ వివాహాల తర్వాత క్యూలో ఇండియన్ ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి చేరాడని తెలుస్తున్నది.

By Nageshwara Rao

కోల్‌కతా: ప్రస్తుతం భారతీయ క్రీడాకారులను వివాహ సీజన్ ముంచెత్తుతున్నది. టీం ఇండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్, ఇషాంత్ శర్మ వివాహాల తర్వాత క్యూలో ఇండియన్ ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి చేరాడని తెలుస్తున్నది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఆయన చిన్న నాటి స్నేహితురాలు సోనం భట్టాచార్యను వివాహం చేసుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఇండియన్ ఫుట్‌బాల్ టీం మెంటర్, మాజీ ఫుట్‌బాలర్ సుబ్రొతో భట్టాచార్య కూతురే సోనం భట్టాచార్య కావడం గమనార్హం. సునీల్ ఛెత్రి గురువారం కోల్‌కతాకు రావడంతో ఈ ఊహాగానాలు ఊపందుకున్నాయి. సోనం భట్టాచార్యతో వివాహం విషయమై ఆమె తండ్రి సుబ్రొతో భట్టాచార్యతో సంప్రదింపులు జరిపేందుకు సునీల్ ఛెత్రి ధ్రువీకరించారు కూడా.

Sunil Chhetri to wed ex-football star’s daughter, Sonam

సుబ్రొతో భట్టాచార్య ఇంతకుముందు మోహన్ బగన్ జట్టు సారథిగా కూడా వ్యవహరించారు. తన కూతురు సోనం, శిష్యుడు సునీల్ ఛెత్రి మధ్య అనుబంధం గురించి తెలిసిన సుబ్రోతో భట్టాచార్య వారిద్దరి వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని రూఢీగా తెలుస్తున్నది. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో వారి వివాహానికి పచ్చజెండా ఊపారు.

సునీల్ ఛెత్రి తనతో కలిసి చర్చించిన సంగతి నిజమేనని శుక్రవారం చెప్పారు. వారిద్దరు సన్నిహితంగా ఉంటున్నారని, వారి భవిష్యత్ జీవితం అంతా హ్యాపీగా సాగాలని కోరుకుంటున్నానని సుబ్రొతో భట్టాచార్య చెప్పారు. సునీల్ ఛెత్రిని సుబ్రొతో భట్టాచార్య అత్యంత దగ్గర నుంచి పరిశీలించాడు. కిందిస్థాయి నుంచి ఫుట్ బాల్ ప్లేయర్‌గా ఎదిగిన ఛెత్రి గురించి పూర్తిగా తెలుసుకున్న సుబ్రొతో భట్టాచార్య.. ఆయన క్రమశిక్షణ గల ప్లేయర్ అని అభివర్ణించాడు.

సుబ్రొతో కూతురుతో వివాహం జరిపించమని ఆయన్నే అడిగేందుకు మాత్రం సునీల్ ఛెత్రి చాలా సమయం తీసుకున్నారు. సునీల్ ఛెత్రిని ఫుట్ బాల్ ఆటలో ఎదుగుతున్న ప్లేయర్‌గా తొలినుంచి గమనిస్తున్నా. 2003లో తొలిసారి కోల్ కతాలో ఛెత్రిని చూశానని, ఫుట్ బాల్ ప్లేయర్ గా ఆయన తన ప్రతిభకు మెరుగులు దిద్దుకున్నాడని, ప్రస్తుత పరిస్థితుల్లో జావియర్ పియాస్‌తో ఛెత్రిని పోల్చవచ్చునన్నాడు. ఆయన అమాయకత్వం తనకు నచ్చిందన్నాడు.

కొన్ని రోజుల క్రితం సునీల్ ఛెత్రి తన స్నేహితురాలు సోనం బర్త్ డే సందర్భంగా ఆమెకు 'విష్ యూ ఆల్ సక్సెస్ అండ్ గుడ్ హెల్త్' అంటూ శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఆమె ఫొటో పోస్ట్ చేసినప్పటి నుంచి ఆయన అభిమానులు పెండ్లి ఎప్పుడని ప్రశ్నిస్తున్నారు. స్కాట్లాండ్‌లో బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తిచేసిన సోనం భట్టాచార్య ప్రస్తుతం కోల్ కతాలోని స్టాల్ లేక్ ఏరియాలో రెండు స్టార్ హోటళ్లను నిర్వహిస్తున్నారు.

సోనం భట్టాచార్య సోదరి సాహెబ్ భట్టాచార్య ప్రముఖ సినీ తార కావడం గమనార్హం. ఐదేళ్లుగా ఇద్దరి మధ్య స్నేహం కొనసాగుతున్నది. త్వరలో ఛెత్రి తల్లిదండ్రులు కూడా వారిద్దరి వివాహ తేదీలను ఖరారుచేస్తారని తెలుస్తున్నది. గోవాలో ఛెత్రి మ్యాచ్ ను వీక్షించేందుకు ఆయన సోదరుడితో కలిసి సోనం వచ్చినప్పుడు వారి అనుబంధం, వివాహం సంగతులు బయటకు పొక్కాయి.

అయితే కోల్‌కతాలో తన పని ముగించుకుని ఢిల్లీ చేరుకున్న ఛెత్రి తన వివాహం సంగతి దాటవేసేందుకు ప్రయత్నించాడు. తాను కొన్ని వ్యక్తిగత కారణాల రీత్యా సుబ్రొతో భట్టాచార్యతో సంప్రదింపులు జరిపేందుకు మాత్రమే కోల్ కతాకు వెళ్లానని మీడియాకు చెప్పాడు.

ఆయన వివాహం గురించి అడిగినప్పుడు మాత్రం ఫక్కున నవ్వేశాడు. ప్రతి ఒక్కరికి తనకు, సోనం మధ్య గల సంబంధాలు తెలుసునన్నాడు. ఇందులో కొత్తదనమేదీ లేదన్నాడే గానీ తాను సోనం తండ్రి సుబ్రొతో భట్టాచార్యతో వివాహం ప్రతిపాదన తీసుకొచ్చినట్లు మాత్రం బయటపెట్టలేదు.

Story first published: Tuesday, November 14, 2017, 10:06 [IST]
Other articles published on Nov 14, 2017
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+