
హైదరాబాద్: సుదూర కాల ప్రేమాయాణం తర్వాత ఇండియన్ పుట్‌బాల్ టీం కెప్టెన్ సునీల్ చెత్రీ ఒకింటివాడయ్యాడు. నవంబర్ 20న వీరి నిశ్చితార్థం గుర్గావ్‌లో జరిగగా డిసెంబర్ 4న వివాహం జరిగింది.
మోహన్ బగాన్ దిగ్గజ పుట్‌బాలర్ సుబ్రతా భట్టాచార్య కూతురు సోనమ్ తో ప్రేమలో ఉన్న సునీల్ చెత్రి కోల్ కత్తాలో డిసెంబర్4న అతిరథ మహారథుల సమక్షంలో ప్రియురాలినే వివాహమాడాడు. గుర్రపు బగ్గీలో ఊరేగింపు జరిపి పెళ్లి సంబరాన్ని నేపాలీ, బెంగాలీ సంప్రదాయాల్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ప్రస్తుతం ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) తరపున ఆడుతున్న సునీల్ చెత్రి వయస్సు 33ఏళ్లు. సోనమ్ స్కాట్లాండ్ లో బిజినెస్ మేనేజ్ మెంట్ పూర్తిచేసింది.
వీరిని మొట్టమొదటగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆశీర్వదించగా రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, పుట్‌బాల్ క్రీడాకారులు, బంధుమిత్రుల తమ శుభాకాంక్షలు తెలిపారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.