పుమాతో మూడేళ్ల ఒప్పందం: దిగ్గజాల సరసన సునీల్ ఛెత్రి

హైదరాబాద్: భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి మంగళవారం గ్లోబల్ స్పోర్ట్స్ దిగ్గజం పుమాతో మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందంతో సునీల్ ఛెత్రి ఆంటోయిన్ గ్రీజ్మాన్, రొమేలు లుకాకు, లూయిస్ సువరేజ్, సెర్గియో అగ్యురో వంటి ప్రపంచ ఆటగాళ్ల జాబితాలో చేరాడు.
ఈ సందర్భంగా ఛెత్రి మాట్లాడుతూ "నేను పుమా ఫ్యామిలీలో చేరడాన్ని సంతోషిస్తున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా, ఫుట్‌బాల్ బ్రాండ్ యొక్క వారసత్వాన్ని చాలా దగ్గరగా చూడటంతో పాటు అనుభవించాను. ఇప్పుడు వారితో పుమా ప్లేయర్‌గా సంతకం చేయడం నాకు చాలా సహజమైన పురోగతి" అని అన్నాడు.
పోర్చుగల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో తర్వాత ప్రపంచ ఫుట్‌బాల్‌లో అంతర్జాతీయ స్కోరర్‌ల జాబితాలో సునీల్ ఛెత్రి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. భారత పుట్‌బాల్ జట్టు అందించిన ఉత్తమ ఆటగాళ్లలో ఛెత్రి ఒకడు. జాతీయ పుట్‌బాల్ జట్టుతో పాటు ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)లో బెంగళూరు ఎఫ్‌సి ఛెత్రి ఆడుతున్నాడు.
భారత జట్టులో ఆత్యధిక పుట్‌బాల్ మ్యాచ్‌లు ఆటగాడిగానే కాదు అత్యధిక గోల్స్ చేసిన రికార్డు కూడా ఛెత్రి సొంతం. 2011లో అర్జున అవార్డు, 2019లో పద్మశ్రీతో సునీల్ ఛెత్రిని భారత ప్రభుత్వం సన్మానించింది. అంతేకాదు, ఆరుసార్లు ఆల్ ఇండియా పుట్‌బాల్ ఫెడరేషన్(ఎఐసీసీ) ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని కూడా సొంతం చేసుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications