పెళ్లి తర్వాత సునీల్ ఛెత్రి ఏం చేస్తున్నాడో తెలుసా!

హైదరాబాద్: గతేడాది జరిగిన సెలబ్రిటీ స్పోర్ట్స్ వెడ్డింగ్స్‌లో సాకర్ ప్లేయర్ సునీల్ ఛెత్రి, సోనమ్ భట్టాచార్య పెళ్లి ఒకటి. భారత జట్టు పుట్‌బాల్ కెప్టెన్ అయిన సునీల్ ఛెత్రి గతేడాది డిసెంబర్‌లో తన ప్రియురాలు సోనమ్‌ను కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
సునీల్ ఛెత్రి వివాహ జీవితం ఎలాగ ఉందో ఒక్కసారి చూద్దాం?
ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో బెంగళూరు ఎఫ్‌సి జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సునీల్ ఛెత్రి గత ఆదివారం అథ్లెటికో డీ కోల్‌కతా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఏకైక గోల్ చేసి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు.
పెళ్లికి ముందు పెళ్లి తర్వాత తన జీవితంలో ఎమైనా మార్పు వచ్చిందా అన్న ప్రశ్నకు గాను సునీల్ ఛెత్రి అలాంటిది ఏమీ లేదని చెప్పడం విశేషం. సోనమ్ తాను చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులమని, పెళ్లితో తాను నా భాగస్వామి అయిందని చెప్పుకొచ్చాడు.
అయితే పెళ్లి అనంతరం తామిద్దరం గ్రోసరీ షాపింగ్‌కు వెళ్తున్నామని చెప్పుకొచ్చాడు. గ్రోసరీ షాపింగ్‌లో భాగంగా ఉల్లిపాయలు, టమోటాలు కొనుగోలు చేస్తున్నాం. 'మ్యారేజి అయి 10-15 రోజుల పూర్తి అయింది. ప్రస్తుతం ఈ సమయాన్ని నేను ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నా. సోనమ్‌తో నాకు గత 13 ఏళ్లుగా తెలుసు. అయితే ఇప్పుడు ఇద్దరం కలిసి ఒకేచోటు ఉంటున్నాం" అని ఛెత్రి అన్నాడు.
'నేను ఎప్పుడు మ్యాచ్ ఆడేందుకు వెళ్తున్నా తాను టూరిస్ట్ అయ్యేది. కానీ, ఇప్పుడు కలిసే వెళ్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. అన్నింటినీ మించి ఇప్పుడు ఆమె నా భార్య, ఆమె అంటే ఎంతో ఇష్టం. మేమిద్దరం మంచి స్నేహితులం కూడా' అని ఛెత్రి తెలిపాడు.
ఇక, సోనమ్ విషయానికి వస్తే స్కాట్లాండ్ నుంచి బిజినెస్ మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్ పట్టా పొందింది. అంతేకాదు భారత మాజీ పుట్‌బాల్ కోచ్, మాజీ మోహున్ బగాన్ పుట్‌బాలర్ అయిన సుబ్రతా భట్టాచార్య కుమార్తె. గతేడాది డిసెంబర్ 4న బెంగాలీ సంప్రదాయ పద్ధతిలో కోల్‌కతాలో వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications