For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత్‌లో ఫుట్‌బాల్‌కు ఇదే శుభ తరుణం: ఛెత్రి

By Nageshwara Rao

దోహా: ఆసియా కాన్ఫిడరేషన్ క్లబ్ (ఎఎఫ్‌సి) కప్ టోర్నీ ఫైనల్స్‌లో పాల్గొనడమే భారత్ లో ఫుట్ బాల్ పూర్వ వైభవానికి నాంది ప్రస్తావన కానున్నదని బెంగళూరు ఎఫ్ సి సారధి సునీల్ ఛెత్రి వ్యాఖ్యానించాడు. శనివారం ఇరాక్ క్లబ్ 'అల్ ఖువా అల్ జావియా' జట్టుతో జరిగే ఫైనల్స్ లో పాల్గొనేందుకు బెంగళూరు జట్టు ఇప్పటికే దోహాకు చేరుకున్నది.

మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ నేపథ్యంలో సునీల్ ఛెత్రి పిటిఐతో మాట్లాడుతూ 'బెంగళూరు ఎఫ్ సి క్లబ్ ఎఎఫ్‌సి ఫైనల్స్‌కు చేరుకోవడంతో 2022లో భారత్ నిర్వహించే సాకర్ వరల్డ్ కప్ టోర్నీలో విజయానికి బాటలు ఏర్పరుస్తుందని ఆశాభావంతో ఉన్నాం. ఆసియాలో భారత్ ఫుట్ బాల్ క్రీడ ఒక శక్తిమంతంగా ఎదిగేందుకు ఇది శుభారంభం'అని తెలిపాడు.

ఇప్పటివరకు 91 అంతర్జాతీయ మ్యాచ్ ల్లో ప్రాతినిధ్యం వహించిన సునీల్ ఛెత్రి 51 గోల్స్ సాధించాడు. ఖతార్ లోని భారత సంతతి వారు 2022లో భారత్‌లో 'ఫిఫా వరల్డ్ కప్ ' నిర్వహణకు చేయూతనిస్తారని తెలిపారు. తద్వారా భారత్ ఫుట్ బాల్ చరిత్రలో రికార్డు నమోదుకు రంగం సిద్ధమవుతున్నదన్నారు.

Sunil Chhetri says Bengaluru FC reaching final begins the revival of Indian football

'ఆసియాలో ఫుట బాల్ ఆట పునరుద్దరణకు దోహాలో జరిగే ఎఎఫ్ సి ఫైనల్స్‌లో తమ జట్టు ప్రాతినిధ్యం పొందడానికంటే మించిన తరుణం మరొకటి ఉంటుందని నేను భావించడం లేదు' అని ఛెత్రి వ్యాఖ్యానించాడు. తదుపరి భారత్ ఆసియా వరల్డ్ కప్ టోర్నీ నిర్వహిస్తుందని ఆయన చెప్పారని ఎసి.క్యూఎ డాట్ కాం పేర్కొంది.

'ఫైనల్స్ లో పాల్గొనేందుకు వచ్చిన తమకు దోహాలోని భారత సంతతి వారు అపూర్వ స్వాగతం పలికారు. అదే మద్దతు కూడా ఫైనల్స్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు కొనసాగాలని కోరుకుంటున్నాం. దోహలోని సహచర భారతీయులు శనివారం ఖతార్ ఎస్సీ స్టేడియానికి చేరుకుని తమకు మద్దతును కొనసాగిస్తారని నేను విశ్వాసంతో ఉన్నా. ఇది కేవలం బెంగళూరు సిటీకి, కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు. భారతీయులందరికీ మేం ప్రాతినిధ్యం వహిస్తున్నాం' అని చెప్పాడు.

సొంత గడ్డ భారత్‌తోపాటు ఆసియా ఖండ దేశాల్లో ఫుట్ బాల్ ఆట పునరుద్ధరణ ఒక్కటే కాదు తదుపరి ఆసియాన్ సాకర్ వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇవ్వడం తమ లక్ష్యమని అన్నాడు. సెమీ ఫైనల్స్ లో విజయం సాధిస్తామని తానెప్పుడూ ఊహించలేదని, కానీ తనకు దోహా నగరంతో ప్రత్యేక అనుబంధం ఉన్నదని తెలిపాడు. 'దోహా నగరంతో నాకు ఉన్న అనుబంధం తిరిగి ట్రోఫీ కప్ తో భారత్ కు వెళ్లేందుకు దోహదపడుతుందని ఆశాభావంతో ఉన్నా' అని తెలిపాడు.

ఆసియా కప్ టోర్నీ నిర్వహణ భారత్ ఫుట్ బాల్ ఆటను మెరుగుపరిచేందుకు గొప్ప అవకాశమని, తాను బహ్రెయిన్, సౌత్ కొరియాలకు వ్యతిరేకంగా జరిగిన మ్యాచ్ ల్లో రెండు గోల్స్ చేయగలిగానన్నాడు. అయితే ఎఎఫ్ సి కప్ ఫైనల్స్ మ్యాచ్ చాలా విభిన్నమైందని, అయినా ఆసియా ఖండంలోనే భారత్ ఫుట్ బాల్ ఆటపట్ల నూతనోత్తేజాన్ని తీసుకొస్తుందన్నాడు. గత ఏడాది కాలంగా కష్టపడుతూ ముందుకు సాగడం వల్లే తాము ఈ స్థానానికి చేరుకోగలిగామన్నాడు.

ఇంతకుముందు బెంగళూరు ఎఫ్ సి క్లబ్ మేనేజర్‌గా పనిచేసిన ఆశ్లేయ్ వెస్ట్ వుడ్ సైతం ఇరాక్ జట్టుపై జరిగిన మ్యాచ్ లో బెంగళూరు ఎఫ్ సి జట్టు విజయానికి అవకాశాలెక్కువగా ఉన్నాయని తెలిపాడు. ఎఎఫ్ సి కప్ ఫైనల్స్‌కు వెళ్లేందుకు బెంగళూరు ఎఫ్ సి క్లబ్ జట్టును తీర్చి దిద్డడంలో ఆశ్లేయ్‌వుడ్ కీలక పాత్ర పోషించాడు.

వెస్ట్ ఆసియా టీంతో జరిగే ఈ ఫైనల్స్ మ్యాచ్ ఒకింత రసవత్తరంగా సాగే అవకాశం ఉన్నదన్నాడు. ఆసియా ఖండంలోనే బెస్ట్ టీంగా రూపుదిద్దుకోవాలనే సంకల్పంతోనే తాము ఎల్లవేళలా కష్టపడ్డామని తెలిపాడు. దోహాలో జరిగే ఫైనల్స్ మ్యాచ్ కోసం బెంగళూరు ఎఫ్ సి యాజమాన్యం జట్టుకు నూతన మేనేజర్‌గా ఆల్బర్ట్ రోసాను నియమించుకున్నది.

డిఫెన్స్ ను కన్సాలిడేట్ చేసుకుంటూ అటాకింగ్ పై ప్రధానంగా కేంద్రీకరించాల్సి ఉంటుందన్నాడు. బంతిపై ఏ జట్టుకు ఆధిపత్యం లభిస్తుందే అదే జట్టుకు విజయావకాశాలు ఉంటాయి. 'ఇటీవల బెంగళూర్ ఎఫ్ సి రూపొందించుకున్న 4 - 4 - 1 - 1 డిఫెన్సివ్ వ్యవస్థ లాంగ్ బాల్ స్టయిల్ కలిగి ఉంటుంది. వెస్ట్ ఆసియా జట్టు ఆట తీరు, వ్యూహం తదితర అంశాలపై మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుంది' అని అన్నాడు.

సెర్జియో స్థానే అల్వారో తెజెరో
మాడ్రిడ్: స్పానిష్ లీగ్ 'లా లీగా' జెయింట్స్ రియల్ మాడ్రిడ్ ఫ్రాంచైసీ సెర్జియో రామోస్ స్థానంలో ప్రత్యామ్నాయంగా ఇప్పటివరకు రిజర్వు బెంచ్ కే పరిమితం అయిన అల్వారో తెజెరోకు ఆహ్వానం లభించింది. బుధవారం లీగియా వార్సా జట్టుపై జరిగిన మ్యాచ్ లో అల్వారో తెజెరో ప్రాతినిధ్యం వహించాడు. ఆయన మరోసారి డిఫెన్సర్‌గా తన శక్తియుక్తులు ప్రదర్శించాడు. మోకాలి గాయంతో బాధపడుతున్న సెర్జియో రామోస్ స్థానే అల్వారోనే తీసుకున్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+