For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సునీల్ ఛెత్రీ స్టన్నింగ్ గోల్‌: ఏటీకేపై బెంగళూరు విజయం (వీడియో)

By Nageshwara Rao
Sunil Chhetri's stunner against ATK sends Bengaluru FC to the top of the ISL table

హైదరాబాద్: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌)లో ఆదివారం బెంగళూరు ఎఫ్‌సీ జట్టు 1-0తో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అథ్లెటికో డీ కోల్‌కతా (ఏటీకే)పై విజయం సాధించింది. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో బెంగళూరు జట్టు కెప్టెన్ సునీల్‌ ఛెత్రి (39వ నిమిషం) గోల్‌ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు.

తొలి అర్ధభాగం ఇక ఐదు నిమిషాల్లో ముగుస్తుందనగా సునీల్ ఛెత్రి తనదైన శైలిలో ఏటీకే గోల్ పోస్టుపై దాడి చేసి గోల్ సాధించాడు. ఈ విజయంతో మూడు పాయింట్లు సాధించిన బెంగళూరు.. 9 మ్యాచ్‌ల నుంచి మొత్తం 18 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

మరోవైపు ఢిల్లీ డైనమోస్‌, చెన్నయిన్‌ ఎఫ్‌సీ మధ్య జరిగిన మరో మ్యాచ్‌ 2-2తో డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్ డ్రాగా ముగియడంతో వరుస విజయాలతో కుదేలవుతు ఢిల్లీకి కాస్తంత ఊరట లభించింది. ఈ మ్యాచ్‌కు ముందు వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఢిల్లీ ఓటమి పాలైంది.

ఇదిలా ఉంటే మొత్తం 9 మ్యాచ్‌లు ఆడిన చెన్నయిన్‌ 17 పాయింట్లతో, పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుండగా... ఎఫ్‌సీ పుణె సిటీ 16 పాయింట్లతో మూడో స్థానంలో, ముంబై సిటీ ఎఫ్‌సీ 14 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాయి. ఇక ఇప్పటివరకు 8 మ్యాచ్‌లాడిన ఢిల్లీ 4 పాయింట్లతో అట్టడుగున ఉంది.

Story first published: Monday, January 8, 2018, 12:07 [IST]
Other articles published on Jan 8, 2018
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+