న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ట్విట్టర్ వేదికగా సునీల్ ఛెత్రికి ప్రముఖుల అభినందనలు

Sunil Chhetri's Appeal To Support Indian Football Team Baffles Coach Stephen Constantine
Sunil Chhetri’s appeal to support Indian football team baffles coach Stephen Constantine

హైదరాబాద్: ముంబైలోని ఎరెనా స్టేడియం వేదికగా.. సునీల్ ఛెత్రి జట్టు కెన్యాపై తలపడి విజయం సాధించింది. అంతకుముందు రోజే సోషల్ మీడియా వేదికగా.. 'ఛెత్రి స్టేడియానికి రండి.. తిట్టండి.. ప్రశంసించండి.. ఏం చేసినా మా ముందే చేయండి. మీ నుంచి ఏదైనా స్వీకరించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం.' అంటూ ట్వీట్ చేశాడు. దానికి స్పందించి తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. కాగా, ఆ రోజు సాయంత్రం స్టేడియం ప్రేక్షకులతో నిండిపోయింది.

జోరున వర్షం కురుస్తున్నా.. టీమిండియా వెరవకుండా, పట్టువీడకుండా పోరాడి కెన్యాపై విజయాన్ని సాధించింది. కాగా, ఈ ఫలితంతో పాటుగా కెప్టెన్ సునీల్ ఛెత్రికి ఈ మ్యాచ్‌తో మరో ప్రత్యేకత వచ్చి చేరింది.

సునీల్ ఛెత్రి కెరీర్‌లో 100వది కావడం విశేషం

ఇంటర్‌కాంటినెంటల్ కప్‌లో భాగంగా సోమవారం కెన్యాతో జరిగిన మ్యాచ్ సునీల్ ఛెత్రి కెరీర్‌లో 100వది కావడం విశేషం. అతని కెరీర్‌లో భారత్ తరపున ఆడటం ఇది 100వ మ్యాచ్. భారత్ తరఫున 100 మ్యాచ్‌లాడిన కెప్టెన్ సునీల్ ఛెత్రిపై క్రీడా మంత్రి రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్‌తో పాటు క్రికెట్ దిగ్గజం సచిన్, సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్ లాంటి ప్రముఖులు ప్రశంసలు కురిపించారు.

భైచుంగ్ భూటియా(104) తర్వాత అత్యధిక మ్యాచ్‌లాడి:

మాజీ కెప్టెన్ భైచుంగ్ భూటియా(104) తర్వాత భారత జట్టుకు అత్యధిక మ్యాచ్‌లాడిన రికార్డును సునీల్ సొంతం చేసుకున్నాడు. కిక్కిరిసిన అభిమానుల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో సునీల్ డబుల్ గోల్‌తో చెలరేగి అద్భుత విజయాన్ని కట్టబెట్టాడు. ఈ సందర్భంగా పలువురు సోషల్‌మీడియా ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు.

అద్భుత ఫీట్ అందుకున్నావు అని సచిన్:

వెల్‌డన్ టీమ్‌ఇండియా..ఇది ఎంతో ప్రత్యేకమైన విజయం. వందో మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసిన సునీల్ అద్భుత ఫీట్ అందుకున్నావు అని సచిన్ ట్వీట్ చేశాడు. మరోవైపు భారత ఫుట్‌బాల్ జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది.

కెన్యాపై గెలిచిన టీమిండియాకు అభినందనలు:

కెన్యాపై 3-0తో గెలిచిన టీమిండియాకు అభినందనలు. వందో మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసి సునీల్ జట్టును ముందుండి నడిపించాడు అని క్రీడా మంత్రి రాథోడ్ తన ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు. సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్ తమదైన శైలిలో సునీల్‌ను ప్రశంసలతో ముంచెత్తారు.

Story first published: Wednesday, June 6, 2018, 10:45 [IST]
Other articles published on Jun 6, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X