ఎఐఎఫ్ఎఫ్: భారత్ ఈ ఏడాది మేటి ఆటగాడు జెజె
ముంబై: మిజోరం రాష్ట్రానికి చెందిన కుర్రాడు జెజె లాల్పెఖ్లౌవా (25) ఈ ఏడాది జాతీయ ఉత్తమ ఫుట్‌బాల్ అవార్డు అందుకోనున్నారు. బుధవారం జరిగిన అఖిల భారత్ ఫుట్ బాల్ సమాఖ్య (ఎఐఎఫ్ఎఫ్) జాతీయ కార్యవర్గ సమావేశంలో అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ ఈ సంగతి ప్రకటించారు. ఈ అవార్డు కింద జెజె రూ.2.5 లక్షల నగదు బహుమతి, ట్రోఫీ అందుకుంటారు.
'నాకు వచ్చిన ఈ అవార్డుతో ప్రతి భారతీయ ఫుట్ బాల్ ప్లేయర్ కూడా ముందడుగు వేయడానికే ప్రయత్నిస్తాడు. నాపై విశ్వాసం ఉంచి నా ప్రగతి పట్ల ఆసక్తి చూపిన నా కోచ్ లందరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాకు ఈ అవకాశం లభించడం గొప్పగా ఉంది'అని ఎఐఎఫ్ఎఫ్ ప్రకటనలో తెలిపాడు.
'ఫుట్ బాల్ క్రీడలో నా ఎదుగుదలకు కారణమైన ఎఐఎఫ్ఎఫ్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఫ్లాట్ ఫాం కల్పించి నాతోపాటు గొప్ప కలలు కనేందుకు అవకాశం కల్పించిన గోవా అకాడమీకి ధన్యవాదాలు' అని అన్నాడు. 'మీ కష్టానికి ఫలితంగా గుర్తింపుగా అవార్డులు మిమ్మల్ని గొప్పగా ఎదిగేందుకు ప్రేరణగా నిలుస్తాయి.
అవార్డుల జాబితాలో చోటు దక్కించుకున్నందుకు నాకు థ్రిల్లింగ్‌గా ఉంది. ఇంతకుముందు ఇదే అవార్డు పొందిన వారిలో స్వీకరించదగిన అంశాలపైనే నేను ద్రుష్టి సారిస్తాను' అని జెజె వ్యాఖ్యానించాడు. ప్రస్తుత సీజన్ సక్సెస్ ఫుల్ సాగిపోయేందుకు సహకరించిన తన టీం సభ్యులందరికి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నాడు.
మొహున్ బగన్, చెన్నైయిన్ ఎఫ్ సి జట్లలో చెప్పుకోదగినంత మంది ప్లేయర్లు ఉండడం అద్రుష్టమని వ్యాఖ్యానించాడు. కాగా ఎఐఎఫ్ఎఫ్ ఉమన్ ఫుట్ బాలర్ అవార్డుకు సస్మిత మాలిక్ ఎంపికయ్యారు. ఈ అవార్డు కింద ఆమెకు రూ.2 లక్షల నగదు బహుమతితోపాటు ట్రోఫీ అందజేస్తారు.

2016 ఎఐఎఫ్ఎఫ్ ప్రత్యేక గుర్తింపు అవార్డు
గురుప్రీత్ సింగ్ సంధూ, ఉవెనా ఫెర్నాండెజ్‌లకు సంయుక్తంగా ‘2016 ఎఐఎఫ్ఎఫ్ ప్రత్యేక గుర్తింపు అవార్డు' లభించింది. దీనికింద రూ. లక్ష నగదుతోపాటు ట్రోఫీ అందుకుంటారు. యూరప్ లీగ్ లోని స్టాబ్యాక్ ఎఫ్ సి జట్టుకు గురుప్రీత్ సింగ్ సంధూ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ లీగ్ లో ప్రాతినిథ్యం వహిస్తున్న భారతీయ ఆటగాడు ఈయన మాత్రమే.

మహిళా ఫుట్ బాలర్ గా ఉవెనా ఫెర్నాండెజ్
ఇక తొలి ప్రపంచ కప్ ఫైనల్స్ మ్యాచ్ జట్టుకు ఎంపికైన మహిళా ఫుట్ బాలర్ ఉవెనా ఫెర్నాండెజ్. ఇక రౌల్లిన్ బొర్జెస్ కు ‘2016 ఎఐఎఫ్ఎఫ్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్' అవార్డు లభించింది. 2016 దక్షిణాసియా గేమ్స్ లో జట్టు విజయానికి కారణమైన సంజును ‘2016 ఎఐఎఫ్ఎఫ్ ఎమర్జింగ్ ఉమన్ ఫుట్ బాలర్ ఆఫ్ ది ఇయర్' అవార్డుకు ఎంపిక చేశారు. కాగా పంజాబ్ ఫుట్ బాల్ అసోసియేషన్‌కు ‘2016 ఎఐఎఫ్ఎఫ్ అవార్డు ఫర్ బెస్ట్ గ్రాస్ రూట్స్ ప్రోగ్రాం' అవార్డు లభించింది. ఇక ఐఎఫ్ఎ నుంచి 2016 బెస్ట్ రిఫరీగా ప్రంజల్ బెనర్జీ, అసిస్టెంట్ రిఫరీగా జోసెఫ్ టోనీ ఎంపికయ్యారు.

ఒకేసారి ఐ -లీగ్, ఎఎఫ్ సి మ్యాచ్‌లున్నా సమస్యేం లేదు
ఐ - లీగ్, ఎఎఫ్‌సి చాంపియన్స్ లీగ్ మ్యాచ్ తేదీలు ఒకేసారి రావడం వల్లే ఎటువంటి సమస్య తలెత్తదని బెంగళూరు ఫుట్ బాల్ క్లబ్ సిఓఓ ముస్తాఫా గౌస్ స్పష్టంచేశారు. గత మూడేళ్లుగా వీటిని తమకు సమయానుకూలంగా మార్చుకుంటున్నామని పేర్కొన్నారు. ‘రెండు లీగ్ టోర్నీల మధ్య సమతుల్యత పాటిస్తూ మూడేళ్లుగా ముందుకు సాగుతున్నాం. అటువంటప్పుడు సమస్య ఎక్కడ నుంచి వస్తుంది' అని ప్రశ్నించాడు. ఎఎఫ్ సి రన్నరప్ జట్టుగా బెంగళూరు ఎఫ్ సి టీం ముందు ఏమాత్రం విరామం లేని షెడ్యూల్ ఉంది.

జనవరి 27న గోవా క్లబ్ చర్చిల్ బ్రదర్స్
ఐ - లీగ్ ఐదో రౌండ్‌లో జనవరి 27న గోవా క్లబ్ చర్చిల్ బ్రదర్స్ జట్టుతో తల పడుతున్నది. మరోవైపు జనవరి 31న ఎఎఫ్సి చాంపియన్స్ లీగ్ టోర్నీలో అల్ వెహ్దాట్ ఎస్ సి జట్టుతో ప్రిలిమినరీ టోర్నీలో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. జోర్డానియన్ ఫుట్ బాల్ క్లబ్ తో జరిగే మ్యాచ్ లో బెంగళూరు ఎఫ్ సి జట్టు ప్రతిభే ఎఎఫ్ సిలో దాని స్థానాన్ని ఖరారు చేయనున్నది. భౌతికంగా తమ కుర్రాళ్లు చాలా పటిష్టంగా ఉన్నారని, బిజీ షెడ్యూల్ ఉన్నా సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధమని తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications