సౌతాఫ్రికాపై ఘన విజయం.. ప్రిక్వార్టర్స్ చేరిన కెనడా!
కెనడా ఫుట్‌బాల్ టీమ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఫిఫా ప్రపంచకప్ చరిత్రలోనే కెనడా తొలిసారి ప్రిక్వార్టర్స్ చేరింది. సోమవారం తెల్లవారుజామున జరిగిన నాకౌట్ పోరులో కెనడా 1-0 తేడాతో సౌతాఫ్రికాను ఓడించింది. మ్యాచ్ అదనపు సమయంలో (ఇంజురీ టైమ్) కెనడా కెప్టెన్ స్టీఫెన్ యుస్టాకియో కొట్టిన అద్భుతమైన గోల్ జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించింది.
ఉత్కంఠ రేపిన నాకౌట్ పోరు
ఇరు జట్లకు ఇది తొలి ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్ కావడంతో ప్రారంభం నుంచే తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మ్యాచ్ ఆద్యంతం సహ-ఆతిథ్య దేశమైన కెనడా దూకుడుగా ఆడుతూ గోల్ కోసం ప్రయత్నించింది. అయితే, సౌతాఫ్రికా డిఫెండర్లు, ముఖ్యంగా గోల్ కీపర్ రోన్వెన్ విలియమ్స్ కెనడా దాడులను సమర్థవంతంగా అడ్డుకున్నారు. ఈ మ్యాచ్‌లో విలియమ్స్ రికార్డు స్థాయిలో 77 సక్సెస్‌ఫుల్ పాస్‌లు ఇచ్చి, 2022లో మాన్యుయెల్ నోయర్ (51 పాస్‌లు) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.

కెనడా ఆటగాళ్లు డెరెక్ కార్నెలియస్, మోయిస్ బొంబిటో, తజోన్ బుకానన్ హెడర్ల ద్వారా గోల్స్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ, సౌతాఫ్రికా కీపర్ విలియమ్స్, డిఫెండర్ ముదౌ వాటిని అద్భుతంగా తిప్పికొట్టారు. మ్యాచ్ 75వ నిమిషంలో కెనడా స్టార్ ప్లేయర్ అల్ఫోన్సో డేవిస్ మైదానంలోకి వచ్చినప్పటికీ సౌతాఫ్రికా డిఫెన్స్‌ను ఛేదించడం కష్టంగా మారింది. మ్యాచ్ 'ఎక్స్‌ట్రా టైమ్' వైపు వెళ్తుందనుకున్న తరుణంలో యుస్టాకియో మ్యాజిక్ చేశాడు.
కెప్టెన్ ఇన్నింగ్స్.. సరికొత్త రికార్డులు
92వ నిమిషంలో సౌతాఫ్రికా డిఫెండర్ ఒకాన్ క్లియర్ చేసిన బంతిని యుస్టాకియో తన ఛాతీతో నియంత్రించి, పెనాల్టీ బాక్స్ బయటి నుంచి ఒకే ఒక్క లో-షాట్‌తో గోల్ పోస్ట్ లెఫ్ట్ నెట్‌లోకి పంపాడు. లోకల్ లాస్ ఏంజెల్స్ ఎఫ్‌సి క్లబ్ తరఫున ఆడే యుస్టాకియోకు ఈ స్టేడియం సొంత మైదానం కావడం విశేషం. వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌లో గోల్ చేసిన మూడవ ఎంఎల్ఎస్ (MLS) ప్లేయర్‌గా అతను నిలిచాడు. అంతేకాదు, ఈ మ్యాచ్‌లో సెట్-పీసెస్ ద్వారా 5 గోల్ అవకాశాలు సృష్టించి, 2006లో ఆండ్రియా పిర్లో నెలకొల్పిన రికార్డును అతను సమం చేశాడు. జెస్సీ మార్ష్ నేతృత్వంలోని కెనడా జట్టు శనివారం జరగబోయే క్వార్టర్ ఫైనల్ పోరులో నెదర్లాండ్స్ లేదా మొరాకోతో తలపడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

