Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బ్రెజిల్- డచ్, విజయం ఎవరిదోచ్?

Bastian Schweinsteiger
పోర్ట్‌ ఎలిజబెత్‌: హేమాహీమీలైన నెదర్లాండ్స్, బ్రెజిల్ జట్లు నేటి రాత్రి ఏడున్నర నుంచి హోరాహోరీగా పోరాడనున్నాయి. 30 ఏళ్ల కిత్రం ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌ అంటే అభిమానులు చెవి కోసుకునేవారు. వీరు అంతగా క్లాసిక్‌ ఫుట్‌బాల్‌ ఆడేవాళ్లు. ప్రస్తుత జట్లు ఆనాటి స్థాయిలో ఆడకపోయినా...ఈసారి ప్రపంచకప్‌లో రెండు జట్లూ చాలా బలంగా ఉన్నాయి. దీంతో ఏ జట్లునూ ఫేవరెట్‌ అని చెప్పలేని స్థితి. ఇలాంటి నేపథ్యంలో నెల్సన్‌మండేలా బేలో శుక్రవారం బ్రెజిల్‌, నెదర్లాండ్స్‌ మధ్య క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. టోర్నీలో డచ్‌ జట్టు ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోలేదు. మరోవైపు బ్రెజిల్‌ మూడింట గెలిచి, ఒకటి డ్రాగా ముగించింది.

నెదర్లాండ్స్‌ బలం, బలహీనత
'ఏదైనా తేడా జరిగి, మ్యాచ్‌ ఓడిపోతే మాత్రం ఉపేక్షించను'.... ప్రపంచకప్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు ముందు ఓ జట్టు కోచ్‌ ఆటగాళ్లకు ఇలాంటి వార్నింగ్‌ ఇవ్వాల్సి రావడం నిజంగా దురదృష్టకరం. ఇంతగా టెన్షన్‌పడుతోంది ఎవరంటే.. నెదర్లాండ్స్‌ కోచ్‌ మార్విక్‌. జట్టులోని స్టార్‌ ఆటగాడు రాబిన్‌, మిడ్‌ఫీల్డర్‌ వెస్లీ స్నిజెర్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ప్రి క్వార్టర్‌ఫైనల్‌ తర్వాత ఈ ఇద్దరూ బహిరంగంగానే గొడవపడ్డారు. దీంతో కోచ్‌ ఇద్దరితో విడివిడిగా మాట్లాడాడు. టీమ్‌ మీటింగ్‌ పెట్టి అందరికీ వార్నింగ్‌ ఇచ్చాడు. ఇక ఆట పరంగా డచ్‌ అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉంది. గాయం నుంచి కోలుకుని వచ్చిన రాబెన్‌ అర్జెన్‌ ఫుల్‌ ఫామ్‌లో కనిపించడం జట్టు బలం. అయితే అంతర్గత కలహాల వల్ల దెబ్బతింటామేమోనని 'ఆరెంజ్‌' జట్టు అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

బ్రెజిల్‌ ప్లస్ మైనస్ లు
కౌంటర్‌ ఎటాక్‌ చేయడంలో బ్రెజిల్‌కు నెదర్లాండ్స్‌ సమానమైన జట్టు. కాబట్టి ఆరంభం నుంచి పూర్తి దూకుడుగా ఆడాలనేది బ్రెజిల్‌ వ్యూహం. రాబిన్‌, రాబెన్‌, కాకా, రాబెన్హో, ఫాబియానో...ఇలా చెప్పుకుంటూ పోతే బ్రెజిల్‌ జట్టులో సగానికిపైగా స్టార్‌ ఆటగాళ్లే. ఇప్పటివరకూ టోర్నీలో జట్టుకు పెద్దగా సమస్యలు ఎదురుకాకపోయినా...డిఫెన్స్‌లో లోపాలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు తొలి రెండు మ్యాచ్‌ల్లో గోల్స్‌ చేసిన ఎలానో అందుబాటులో లేడు. దీంతో రాబిన్హో మీద అదనపు భారం పడనుంది. కాకపోతే ఈ స్టార్‌ ఆటగాడు ఇప్పటివరకూ స్థాయికి తగ్గట్లుగా ఆడకపోవడం కోచ్‌ దుంగాను ఆందోళన పరుస్తోంది.

ఈ రెండు జట్లు గతంలో 9 సార్లు తలపడ్డాయి. బ్రెజిల్‌ మూడుసార్లు గెలవగా... డచ్‌ రెండింట నెగ్గింది. నాలుగు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. బ్రెజిల్‌ 14 గోల్స్‌ చేస్తే... డచ్‌ 13 గోల్స్‌ చేసింది. డచ్‌ టోర్నీలో ఇప్పటిదాకా ఏడు గోల్స్‌ చేసింది. రెండు గోల్స్‌ ఇచ్చింది. బ్రెజిల్‌ 8 గోల్స్‌ చేసి రెండు ఇచ్చింది.

క్వార్టర్‌ ఫైనల్‌ 1
బ్రెజిల్‌ /నెదర్లాండ్స్‌
రాత్రి గం.7.30 నుంచి ఈఎస్పీఎన్‌ లో ప్రత్యక్ష ప్రసారం.

ప్రస్తుతం జట్లు ఉన్న ఫామ్‌, ఇప్పటివరకూ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటే...బ్రెజిల్‌, నెదర్లాండ్స్‌ మధ్య జరిగే క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఫైనల్‌ ను తలపించడం ఖాయం. కాకపోతే నెదర్లాండ్స్‌ జట్టు అంతర్గత కలహాలతో సతమతమవుతోంది.
Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+