దీదీ ఆశీర్వాదం, క్లిక్ మనిపించిన షారుఖ్ (ఫోటోలు)
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో కోల్ కత్తా నైట్ రైడర్స్ ప్రాంఛైజీని కొనుగోలు చేసిన బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్.. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)కు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. కారణం ఐఎస్‌ఎల్‌లో కోల్‌కత్తా జట్టును కొనుగోలు చేయాలనుకున్నా అది సాధ్యపడలేదని విచారం వ్యక్తం చేశాడు.
ఐఎస్ఎస్‌లో వేరే నగరాల నుంచి ఆఫర్లు వచ్చినా కోల్‌కత్తాను మాత్రమే తాను కొనుగోలు చేయాలనుకున్నాడట. "కోల్‌కత్తా ప్రాంఛైజీని కొనుగోలు చేయలేకపోవడం నిజంగా దురదృష్టం. ఐఎస్ఎల్‌లో ఉండాలనుకున్నా. అది కూడా కోల్‌కత్తా జట్టునే కొనుగోలు చేయాలనుకున్నా. కోల్‌కత్తా కొనుగోలు చేయలేనప్పుడు వేరే జట్టు అనవసరం అనుకున్నా" అంటూ అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
కోల్‌కత్తా జట్టులో సహా యజమాని గంగూలీకి అభినందనలు. నాకు పుట్ బాల్ అంటే ఇష్టం. నేనే కాకుండా నా పిల్లలు కూడా పుట్ బాల్ ఆడతారని షారుఖ్ చెప్పాడు. ప్రస్తుతం ఇండియన్ సూపర్ లీగ్‌లో కోల్‌కత్తా ప్రాంచైజీని మాజీ క్రికెటర్ సౌరభ్ గంగూలీ, హర్షవర్ధన్ నియోతియో, సంజీవ్ గోయంకలు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

కోల్‌కత్తా కొనుగోలుపై షారుఖ్ ఖాన్ అసంతృప్తి
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నుంచి ఆశీస్సులు అందుకున్న బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్.

కోల్‌కత్తా కొనుగోలుపై షారుఖ్ ఖాన్ అసంతృప్తి
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ఆప్యాంగా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్.

కోల్‌కత్తా కొనుగోలుపై షారుఖ్ ఖాన్ అసంతృప్తి
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతున్న సందర్బంలో సరదాగా ఫోటో తీస్తున్న బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్.

కోల్‌కత్తా కొనుగోలుపై షారుఖ్ ఖాన్ అసంతృప్తి
హ్యాపీ న్యూఇయర్ డైరెక్టర్ ఫరాఖాన్‌తో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అలింగనం. సరదాగా ఫోటో తీస్తున్న బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications