Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆటలో పుట్‌బాల్ ఆటగాడు మహేశ్ తాపా పైలోకాలకు

Footballer Mahesh Thapa dies after on-field collision
జల్‌పాయ్‌గురి/కోల్‌కత్తా, జులై 10: నాలుగు నెలల క్రిందట బెంగుళూరులో వెంకటేశ్ అనే పుట్ బాలర్ మైదానంలో మృతి చెందిన విషాదం మరువక ముందే అదే పుట్ బాల్ ఆటలో మరో విషాదం. జల్ పాయ్ గురిలో జరిగిన స్దానిక లీగ్ మ్యాచ్‌ 25 ఏళ్ల యువ పుట్ బాలర్ మహేశ్ తాపా మృతి చెందాడు. ఇక వివరాల్లోకి వెళితే...

ఈ మ్యాచ్ టోరల్‌పారా, భాను నగర్ జట్ల మధ్య జరుగుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్‌‌లో భాగంగా గోల్‍‌ను కొట్టే సందర్బంలో ప్రత్యర్ది గోల్ కీపర్ మోకాలు మహేశ్ తాపా గుండెలకు బలంగా తాకడంతో తాపా మైదానంలోనే కుప్పకూలి పోయాడు. మహేశ్ తాపాను వెంటనే నిర్వాహకులు అంబులెన్స్‌లో జల్ పాయ్ గురి సర్దార్ ఆసుప్రతికి తరలించారు. కానీ అక్కడి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పడకలు ఖాలీ లేకపోవడంతో అతన్ని ఆసుపత్రిలో చేర్చలేకపోయారు.

దాంతో మరో ప్రయివేట్ ఆసుపత్రి మారినాకు తరలించారు. అక్కడ కూడా ఐసియు ఖాళీ లేకపోవడంతో మరో ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గం మధ్యలో మరణించాడు. సరిగ్గా ఇలాంటి సంఘటనే నాలుగు నెలల క్రితం బెంగళూరులో వెంకటేశ్ అనే ఫుట్‌బాలర్ 'కార్డియాక్ అరెస్ట్'తో మైదానంలోనే మృతి చెందాడు. తన ముగ్గురు కుమారులలో రెండవ వాడైన మహేశ్ తాపా మృతిపై తండ్రి చంద్ర బహుదూర్ మాత్రం ఎవరిని నిందిచలేమని అన్నారు. తన కనుల వెంట వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ ఇద ప్రమాదవ శాత్తూ జరిగింది. ఇది నా విధి అని అన్నారు ...ఇంతక మించి ఇప్పుడు వేరే ఏమి చెప్పగలను అన్ని అన్నారు.

ఇండియన్ పుట్‌బాల్‌లో గతంలో చనిపోయిన వారు:

సంజిబ్ దత్త: 1993 కన్నూర్, కేరళ

క్రిస్టియానో ​జూనియర్: 2004 బెంగుళూర్, కర్ణాటక

అల్లెబి దుజ్విరే: 2008 బెంగుళూర్, కర్ణాటక

వెంకటేష్: 2012 బెంగుళూర్, కర్ణాటక

మహేష్ తాపా: జూలై 2012 పశ్చిమబెంగాల్

తెలుగు వన్ఇండియా

Story first published: Tuesday, November 14, 2017, 10:06 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+