
UEFA యూరో 2012 రిజల్ట్స్ | యూరో 2012 గ్రూప్స్
మొదటి నుండి ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరి 11వ నిమిషంలో క్రిస్టినో రోనాల్డో గోల్ సాధించాడు. దీంతో పోర్చుగల్ సెమీ పైనల్స్‌లో వరల్డ్ ఛాంపియన్ స్పెయిన్ లేదా ఫ్రాన్స్‌తో తలపడనుంది. చెక్ రిపబ్లిక్ స్టార్ ఆటగాడు థామస్ రోస్కీ గాయం కారణంగా ఆట నుండి వైదొలగడంతో చెక్ రిపబ్లిక్ ఒక్క గోల్‌ను కూడా చేయలేక పోయింది. ఇక పోర్చుగల్ మొదటి నుండి కూడా దూకుడుగా ఆడుతూ చెక్ రిపబ్లిక్‌ను ఇబ్బంది పెడుతూనే వచ్చింది.
యూరో 2012 జట్లు | యూరో 2012 మ్యాచ్‌లు
చెక్ రిపబ్లిక్ గోల్ కీపర్ ప్రత్యర్ది జట్టు వేసిన గోల్ పోస్ట్ అన్నింటిని సాధ్యమైనంత వరకు బ్లాక్ చేసినప్పటికీ.. ఫలితం లేకపోయింది. చెక్ రిపబ్లిక్ పై మ్యాచ్ గెలిచిన అనంతరం క్రిస్టినో రొనాల్డో మాట్లాడుతూ సెమీ పైనల్స్‌కు వెళ్లడం ఆనందం కలిగించే అంశం. సెమీ ఫైనల్స్‌లో కూడా అధ్బుతంగా రాణిస్తామనే ధీమాను వ్యక్తం చేశాడు. అభిమానుల చిరునవ్వుతో మాకు చేసిన సపోర్ట్ హార్షనీయం అన్నాడు.
ఈరోజు జరుగు మ్యాచ్: నియో స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
రాత్రి 12.15 గంటలకు నుంచి గ్రీస్ వర్సెస్ జర్మనీ (Q2)
తెలుగు వన్ఇండియా