బ్రెజిల్ సాకర్: మాజీ ప్రేయసిని చంపి కుక్కలకేశాడు

హత్యకు సంబంధించిన ఆనవాళ్లు లభించకుండా ఆణె దేహాన్ని ముక్కముక్కలుగా నరికి కుక్కలకు ఆహారంగా వేశాడు. అప్పట్లో ఎలీజా మరణం మిస్టరీగా మారింది. మూడేళ్ల తర్వాత ఆమె మరణం మిస్టరీ వీడింది. అప్పట్లో బ్రూనోను అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే, తన ప్రమేయం ఏ మాత్రం లేదని అతను బుకాయించాడు.
చివరకు అతను నేరం చేసినట్లు రుజువైంది. దీంతో ఆయనకు కోర్టు శుక్రవారం 22 ఏళ్ల జైలు శిక్ష విధించింది. బ్రూనో కుమారుడికి గార్డియన్‌గా ఎలీజా తన తల్లిని నియమించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం - బ్రూనో ద్వారా ఎలీజాకు 2010 ఫిబ్రవరిలో ఓ కుమారుడు జన్మించాడు. అతనికి భరణం చెల్లించాలని ఎలీజా బ్రూనోను డిమాండ్ చేసింది. అందుకు అతను నిరాకరించాడు.
దాంతో డిఎన్ఎ పరీక్ష ద్వారా చట్టబద్ధంగా తాను భరణం పొందుతానని ఎలీజా బ్రూనోను హెచ్చరించింది. దాంతో ఆమె హత్యకు అతను కుట్ర చేశాడు. ఈ కేసులో బ్రూనో మిత్రుడు, మరో గర్ల్ ఫ్రెండ్‌ను కూడా కోర్టు దోషులుగా నిర్ధారించింది. 28 ఏళ్ల బ్రూ నో 2009లో బ్రెజిల్ సాకర్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications