ప్రిటోరియా: గ్రూప్ హెచ్ చివరి లీగ్ పో రులో స్పెయిన్ 2-1తో చిలీని చిత్తు చేసింది. దీంతో గ్రూప్ టాపర్ గా స్పెయిన్ సగర్వంగా రెండో రౌండ్ లో అడుగుపెడితే...స్విట్జర్లాండ్, హోండురస్ ల మ్యాచ్ డ్రా కావడంతో రెండో బెర్త్ చాన్సును చిలీ ఎగరేసుకుపోయింది. ఇక చిలీతో పోరులో స్పెయిన్ విజయంలో డేవిడ్ విలాల(24వ), ఆండ్రెస్ ఇనియెస్టా(37వ) చెరో గోల్ తో ప్రధాన పాత్ర పోషించారు. చిలీ తరపున రోడ్రిగో (47వ) గోల్ చేశాడు. స్విస్ కు ఆశాభంగం: సాకర్ పసికూన హోండురస్ పై నెగ్గలేక స్విట్జర్లాండ్ ప్రపంచకప్ నాకౌట్ దశకు అర్హత సాధించలేకపోయింది. ప్రీక్వార్టర్స్ కు అర్హత సాధించాలంటే, రెండు గోల్స్ తేడాతో విజయం అవసరమైన స్విస్ జట్టు...కనీసం ఒక్క గోల్ కూడా చేయలేక హోండూరస్ తో డ్రా (0-0)తో సరిపెట్టుకుంది.